HIV affected girl
-
Karnataka: వీడియోలతో బెదిరించి మంత్రి అయ్యాడు
బనశంకరి: కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని మహిళ ఆరోపించారు. బెంగళూరులో ఇది జరిగిందని, నా భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని తెలిపారు. చాలా మంది మహిళలతో ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు. హెచ్ఐవీ కలిగిన యువతితో.. మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు. హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని పదే పదే కోరారు. -
ప్రతి ఒక్కరిని కదిలిస్తోన్న వీడియో!
-
ఇంటర్నెట్ను కదిలిస్తోన్న వైరల్ వీడియో
ఎయిడ్స్ / హెఐవీ పేరు పలకడానికే చాలా మంది అసహ్యించుకుంటారు, అలాంటిది ఇక ఈ వ్యాధి బారిన పడిన వారి పట్ల సమాజం తీరు ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల బాధ వర్ణానాతీతం. అటు తల్లిదండ్రులు ప్రేమకు దూరమయ్యి, ఇటు సమాజపు చీత్కారాలను ఎదుర్కొలేక ఆ పసి మనసులు పడే క్షోభ వర్ణనాతీతం. దీనికి ప్రధాన కారణం నేటికి ఈ వ్యాధి పట్ల ఎన్నో అనుమనాలు సమాజంలో వేళ్లునుకుపోవడమే. నేటికి దీన్నో అంటువ్యాధిలా భావించి, కనీసం చూసినా కూడా ఆ వ్యాధి తమకు అంటుకుంటుందేమోనని భావించేవారు కోకొల్లలు. ఈ అనుమానాలను దూరం చేసి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు బాసటగా నిలవడం కోసం యునిసెఫ్ ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఉజ్బెకిస్తాన్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో అజ్మా అనే పదహారేళ్ల యువతి రోడ్డు పక్కన నిల్చుని ఉంది. ఆమె పక్కనే ఒక ప్ల కార్డు ఉంది. దాని మీద ‘నాకు హెచ్ఐవీ ఉంది. నన్ను కౌగిలించుకోండి అని రాసి ఉంది. రోడ్డు మీద వెళ్లే వారు యువతిని, ఆమె పక్కన ఉన్న ప్ల కార్డును గమనించారు. తరువాత ఏం జరుగుతుందని భావిస్తున్నారు.. ఆశ్చర్యం వారంతా ఆమె దగ్గరకి వెళ్లి, ఆ యువతిని కౌగిలంచుకున్నారు. ఈ విషయం గురించి వీడియో చివరలో అజ్మా ‘పది సంవత్సరాల క్రితం నాకు హెచ్ఐవీ అని తెలిసింది. అయిన నాటి నుంచి నేటి వరకూ నేను బాగానే ఉన్నాను. నా జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాను. కేవలం రక్త మార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, అసురక్షితమైన లైంగిక పద్దతుల వల్లనే హెచ్ఐవీ వ్యాపిస్తుంది. అంతే తప్ప ఈ వ్యాధి ఉన్న వారితో కరచాలనం చేసినా, మాట్లాడినా, కలిసి కూర్చున్నా, తిన్నా ఎయిడ్స్ రాదు’అని తెలిపారు. అంతేకాక ‘ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు ఇంత మంచి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. నన్ను ఆలింగనం చేసుకున్న ప్రతివారిని నా కుటుంబ సభ్యులుగా భావించాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలని’ తెలిపారు. యునిసెఫ్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల కొద్ది లైక్‌లు దాదాపు రెండు వేల రీ ట్వీట్లు పొందింది. చాలామంది అజ్మా చేసిన పనిని మెచ్చుకుంటూ, ఆశీర్వదిస్తున్నారు. An angel.Infinite love and virtual hugs from me and my kiddos to her. May God bless and protect her always. — 2016 (@ErNikGaJa2015) July 23, 2018 -
హెచ్ఐవీ బాధిత బాలికకు అండగా...
మండపేట : తాను చేయని తప్పుకు బలై కానిరోగం బారిన పడి అయినవారికి బారమైన ఓ బాలికకు మండపేట పోలీసులు అండగా నిలిచారు. ఆమెకు ఓ గూడు, ఆసరా చూపారు. మండపేట మండలం మారేడుబాకకు చెందిన ఒకబాలిక తల్లిదండ్రులను ఆమె చిన్నతనంలోనే హెచ్ఐవీ భూతం కబళించింది. అదే వ్యాధితో ఆమె తన సోదరిని కూడా కోల్పోయింది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆప్రాణాంతక వ్యాధితో ఆమె కూడా బాధపడుతోంది. ఆమె బంధువులందరూ నిరుపేదలే కావడంతో ఆమెకు ఆశ్రయం కరవైంది. స్థానికుల చొరవతో ఆమె ఏడేళ్లుగా పట్టణంలోని ఒక హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తిచేసింది. ఇప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు. ఆమెను హాస్టల్లో కొనసాగించేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ ఇటీవల హాస్టల్ అధికారులు ఆమెను బయటకు పంపేశారు. దాంతో ఆమె తన పెదనాన్న, మేనత్తల పంచకు చేరింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే కావడంతో ఎవరు ఆమెను సంరక్షించాలనే విషయమై వివాదం తలెత్తింది. దాంతో ఇరు కుటుంబాల వారు సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బంధువులు ఆమెను స్టేషన్ బయటే వదలిపెట్టి వెళ్లిపోయారు. విషయం ఆరా తీసిన మండపేట ఎస్సై క్రాంతికుమార్ ఆమె దీనావస్థను చూసి చలించిపోయారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సరిగా మాట్లాడలేకపోతున్న ఆమె సంరక్షణ బాధ్యతలను ఏదైనా సంస్థకు అప్పగించాలని భావించారు. విషయాన్ని మండపేట సీఐ విజయారావు దృష్టికి తీసుకువెళ్లారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులతో పాటు పలుశాఖల అధికారులతో ఏస్సై, సీఐ మాట్లాడారు. చివరకు రావులపాలెంలోని ఫారా స్వచ్ఛంద సంస్థ గురించి తెలియడంతో వారితో మాట్లాడారు. వారు ఆమెను సంరక్షించేందుకు అంగీకరించడంతో మంగళవారం మధ్యాహ్నం సీఐ విజయారావు, ఎస్సై క్రాంతికుమార్‌లు ఖర్చుల కోసం రూ. 1500 నగదు ఇచ్చి, ఏఎస్సై దేవరను తోడుగా ఇచ్చి ఆమెను రావులపాలెం పంపించారు. మండపేట పోలీసులు చూపిన చొరవను పలువురు పట్టణవాసులు అభినందించారు. పౌష్టికాహారం రావులపాలెం పంపిస్తాం మండపేటకు చెందిన ‘మేమున్నాం’ స్వచ్ఛంద సంస్థ ప్రతీ నెలా సుమారు 60 మంది హెచ్ఐవీ బాధిత చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.500 విలువ చేసే పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా మారేడుబాకకు చెందిన బాలికకు కూడా ప్రతీనెలా పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను రావులపాలెం తరలించడంతో ఇకపై ప్రతీనెలా పౌష్టికాహారాన్ని అక్కడకు తీసుకువెళ్లి అందజేస్తామని సంస్థ వ్యవస్థాపకుడు బుంగా సంజయ్ తెలిపారు.