hockey cup tourny
-
Hockey Pro League: ఫ్రాన్స్‌తో భారత్ ‘ఢీ’
పొచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ఈ ఏడాది ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్లకు ముందు మేటి జట్లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం జట్టుకు కలిసొస్తుందని భారత పురుషుల హాకీ జట్టు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో భాగంగా భారత్... దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌లతో తలపడనుంది. మంగళవారం మొదలయ్యే ప్రొ లీగ్ కొత్త సీజన్ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ ‘ఈ సీజన్లో శుభారంభం చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. మాకు ఎదురుపడే జట్లు గట్టి ప్రత్యర్థులు. మెగా ఈవెంట్ పోటీలకు ఇలాంటి మ్యాచ్‌లు ఉపకరిస్తాయి. సానుకూల ధోరణితో ఈ సీజన్‌ను ఆరంభిస్తాం. కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ఈ ఏడాదంతా మాకు బిజీ షెడ్యూల్ ఉంది. ఇందుకోసం మేమంతా బాగా సన్నద్ధమయ్యే వచ్చాం’ అని అన్నాడు. చదవండి: 25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్ -
రాయల్ క్లబ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హాకీ కప్ టోర్నమెంట్లో రాయల్ క్లబ్, సాయి హాస్టల్ జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్ క్లబ్ 5-0తో ఎస్బీఐపై గెలువగా... సాయి హాస్టల్ జట్టు 1-0తో ఏసీ గార్డ్ జట్టును ఓడించింది. రాయల్ క్లబ్ తరఫున బి. సందీప్ 3 గోల్స్, రాజు 2 గోల్స్ చేయగా... సాయి హాస్టలర్స్ జట్టుకు సాయి వినీత్ ఒక్క గోల్‌ను అందించాడు.