holders
-
H-1B వీసాదారులకు శుభవార్త..
-
ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్, 3 లక్షల బీమా
సాక్షి,ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే. ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు. ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కేవలం 3 నిమిషాల్లో దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్‌ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్లకు జీవిత బీమా కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు. -
పట్టాదార్లకే పెట్టుబడి చెక్కులు
ఆదిలాబాద్‌అర్బన్ : రైతుబంధు పథకం కింద పెట్టుబడి చెక్కులను పట్టాదారులకే అందించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతుబంధు పథకం కింద చెక్కులను గ్రామాల వారీగా భూములు కలిగిన పట్టాదారు రైతులకు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్థానికంగా ఉండి కదలలేని స్థితిలో ఉన్న పట్టాదారుని ఇంటికి రెవెన్యూ సిబ్బంది వెళ్లి చెక్కు అందించాలని సూచించారు. గ్రామాల వారీగా పట్టాదారుల చెక్కులను సరి చేసుకోవాలని, వాటిని భద్రంగా పోలీస్‌స్టేషన్, పోస్టాఫీసు స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచాలని తెలిపారు. చెక్కుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని, ఇంగ్లిష్ అక్షర క్రమంలో తయారు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. గ్రామాల్లోని వీఆర్వో, వీఆర్ఏ, ఏఈవోలను కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితుల సహకారం తీసుకోవాలని, షెడ్యూల్ ప్రకారం చెక్కుల పంపిణీకి ఒక రోజు ముందే గ్రామాల్లో ఠాంఠాం విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. చెక్కుల పంపిణీ తీరును వీడియో చిత్రీకరణ చేయాలని పేర్కొన్నారు. ఏ గ్రామంలో ఏప్రాంతంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ముందుగా ఆ గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను తహసీల్దార్లు ఇవ్వాలని, రైతులు, సర్వేనంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, ప్రతి రైతు నుంచి రోజుకు 2 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని రైతులకు వివరించాలని తెలిపారు. ఇచ్చోడ, బేల కొనుగోలు కేంద్రాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఆర్డీవోలు సూర్యనారాయణ, జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, జేడీఏ ఆశాకుమారి, డీఎస్‌హెచ్‌వో నర్సింగ్‌దాస్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పుల్లయ్య, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించాలి ఆదిలాబాద్‌అర్బన్: వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శనివారం కలెక్టర్‌తన క్యాంప్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రిమ్స్ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలను రిమ్స్, ఉట్నూర్‌లలో ఉన్న పౌష్టికాహార కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. గ్రామాల్లోని పిల్లలను పోషకాహార పునరావాస కేంద్రాలకు ఎక్కువ మందిని పంపించే ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు నగదు ప్రోత్సాహకం అందించాలని పేర్కొన్నారు. ఆశలకు రూ.300 చొప్పున, అంగన్వాడీలకు రూ.100 చొప్పున అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, రిమ్స్ డైరెక్టర్ అశోక్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
కిరోసిన్‌కు ‘పొగ’
- ఈ నెల కోటాలో కోత - జిల్లాకు ఇవ్వాల్సింది 1800 కిలోలీటర్లు.. ఇచ్చింది 1224 కిలోలీటర్లు - దానినే చౌక దుకాణాలకు సర్దుబాటు చేసిన అధికారులు - చివరిలో వచ్చే కార్డుదారులకు మొండిచేయే.. కాకినాడ సిటీ : చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ఇస్తున్న కిరోసిన్‌కు ‘పొగ’ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్ కార్డులపై ఇస్తున్న ఒకటి రెండు లీటర్ల కిరోసిన్‌ను రెండు మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తోంది. రాష్ట్రాన్ని పొగ రహితంగా ప్రకటించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు కిరోసిన్ కేటాయింపులను ఆలస్యం చేసింది. మామూలుగా ప్రతి నెలా 20వ తేదీలోగానే చౌకదుకాణాలకు తరువాతి నెల సరుకుల కేటాయింపులు పూర్తయ్యేవి. కానీ ఈ నెలలో కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభించిన మూడు రోజులకు ప్రభుత్వం జిల్లాకు కిరోసిన్ కోటా కేటాయింపులు ఇచ్చింది. అది కూడా ఇవ్వాలిన కోటాలో కోత పెట్టింది. జిల్లాలోని మొత్తం 2,647 చౌక దుకాణాల పరిధిలో అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, తెల్ల కార్డుదారులు 16,11,494 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి 2 లీటర్లు, ఉన్నవారికి ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. దీని ప్రకారం జిల్లాకు 1800 కిలోలీటర్ల కిరోసిన్ కావాలి. కానీ ప్రభుత్వం కోత పెట్టడంతో 1224 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే ఇంతవరకూ వచ్చింది. అరకొర కేటాయింపులే.. చాలీచాలకుండా వచ్చిన ఆ కిరోసిన్‌ను సర్దుబాటు చేసేందుకు పౌర సరఫరాల అధికారులు తర్జనభర్జన పడ్డారు. చివరకు జిల్లాకు అరకొరగా వచ్చిన కిరోసిన్‌ను ఒక్కో చౌక దుకాణానికి 75 శాతం చొప్పున కేటాయించారు. దీని ప్రకారం హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లు రేషన్ దుకాణాలకు సరుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ సగంమంది రేషన్ డీలర్లకు మాత్రమే కిరోసిన్ అందించారు. మిగిలినవారికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికే మరో రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు. దీనినిబట్టి కార్డుదారులకు కిరోసిన్ చేరడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 40 శాతం మంది కార్డుదారులు కిరోసిన్ లేకుండానే ఉన్న సరుకులు తీసుకుని వెళ్లిపోయారు. అరకొర కేటాయింపుల కారణంగా ముందుగా వచ్చేవారికి తప్ప చివరిలో వచ్చేవారికి కిరోసిన్ దొరకని పరిస్థితి ఏర్పడనున్నది. భారమన్న ఉద్దేశంతోనే.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని భారంగా భావిస్తున్న ప్రభుత్వం దానిని ఎలాగోలా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్రం చక్కెర సబ్సిడీని తొలగించడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలకు ఈ నెల పంచదారను విడుదల చేయలేదు. గోదాంలలో ఉన్న అరకొర నిల్వలనే జిల్లా అధికారులు చౌక దుకాణాలకు సర్దుబాటు చేశారు. కిరోసిన్ విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు గతంలో ఇస్తున్న 4 లీటర్ల కిరోసిన్‌ను గత నెల నుంచి 2 లీటర్లకు ప్రభుత్వం కుదించింది. తాజాగా ఈ నెల కేటాయింపుల్లోనే కోత పెట్టింది. కిరోసిన్ పంపిణీ చేపట్టాం జిల్లాలోని కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేపట్టాం. కేటాయింపులు ఆలస్యం కావడంతో పంపిణీలో జాప్యం జరిగింది. గత నెల సీబీ, ఈ నెల కేటాయించిన కోటా కలుపుకుని చౌకదుకాణాలకు కిరోసిన్‌ను సర్దుబాటు చేశాం. -
గురి చూసి కొట్టా : మోదీ
-
నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం
విశాఖ జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ భానుగుడి (కాకినాడ) : దేశంలో పన్ను పరిధిలోకి రాకుండా బ్లాక్‌మనీ రూపంలో చలామణిలో ఉన్న సొమ్ము రూ.14.5 లక్షల కోట్లని, అందులో రూ.ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉండగా మిగిలిన నల్లధనాన్ని డిసెంబరు 30 నాటికి ఏ మూలనఉన్నా వెలికితీసేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని విశాఖపట్నం జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నల్లకుబేరులకు పలు హెచ్చరికలు జారీచేశారు. 2017 జనవరి నుంచి జీఎస్టీ బిల్లు అమలు కానుందని, దాచుకున్న నల్లధనాన్ని బయటపెట్టకుంటే కటాకటాల పాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న సొమ్ములో రూ.7వేల కోట్లు ఉగ్రవాదుల వద్ద, రూ.700 కోట్లు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఉన్న మావోయిస్టుల వద్ద ఉందని ఇది రికవరీ కాదన్నారు. మిగిలినదంతా ఏ రూపంలో ఉన్నా పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 25 కోట్ల పాన్‌కార్డులు జారీచేస్తే అందులో ఐదుకోట్ల మంది మాత్రమే వాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి విధాన నిర్ణయానికి కొందరు మోకాలడ్డుతూ పన్ను ఎగవేద్దామనుకుంటున్నారని, రానున్న చట్టాలతో అడ్డులన్నీ తొలగిపోనున్నట్టు పేర్కొన్నారు. కెన్యాలో 80 శాతం లావాదేవీలన్నీ నగదు రహితమేనని, మున్ముందు మనదేశం యావత్తు అదే తరహా వ్యవస్థ ఏర్పాటు కానుందన్నారు. పన్ను చెల్లించకుండా దాచినది ఏదైనా ( బంగారం, భవనాలు, స్థలాలు) అది బ్లాక్‌మనీ లిస్టులోకే వస్తుందన్నారు. అలా దాచినవారెవరైనా కఠినశిక్షలు అనుభవించక తప్పదని ఓంకారేశ్వర్ హెచ్చరించారు. వ్యాపారస్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 300 కోట్ల నగదు స్వాధీన పరుచుకున్న చరిత్ర ఉందన్నారు. ఇక అంతా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగనున్నందున దాచినవన్నీ బయటపెట్టి శిక్షల నుంచి తప్పించుకోవాలని సూచించారు. ఈ నగదు రహిత లావాదేవీల కారణంగా పేదప్రజలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందుతాయన్నారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధినారాయణరావు(బాబ్జీ), పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
టీజీబీ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ గుండ్లపల్లిలో టీజీబీ శాఖ ప్రారంభం బెజ్జంకి : ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు విస్తృతపరుస్తున్నట్లు ఆ బ్యాంకుల రాష్ట్ర చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.10,682 కోట్లు, జిల్లావ్యాప్తంగా రూ.1919.13 కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పంటరుణాలు, వ్యాపారులకు, మహిళ సంఘాలకు, విద్యార్థులకు విద్య రుణాలతో పాటు వాహనాల రుణాలు కూడ ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే మిషన్‌కాకతీయలో చెరువుల మట్టిని తరలించేందుకు ఎకరాకు రూ.5 వేలు రైతులకు రుణసౌకర్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జీఎం ఎస్.పాదం, ఆర్ఎం రవీందర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీపాద్, మేనేజర్ అనిల్‌రెడ్డి, క్యాషియర్ వేణుగోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు కృష్ణమోహన్‌రెడ్డి, గువ్వ వీరయ్య, ఎంపీటీసీ కొర్వి సంధ్యారాణి, ఉపసర్పంచ్ కాల్వ పెద్ద కొమురయ్య, ముల్కనూర్, రీజీనల్ ఆఫీసర్ ఐలయ్య, అల్గునూర్ బ్రాంచ్‌ల మేనేజర్లు సతీశ్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఇంటింటా బీఎఫ్‌డీ ప్రక్రియ : డీఎస్ఓ
కాకినాడ సిటీ: రేషన్ లబ్ధిదారుల పది మంది చేతివేలిముద్రలు ఇంటింటికీ వెళ్ళి సేకరించే బెస్ట్‌ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ) ప్రక్రియను చేపట్టినట్టు పౌర సరఫరాలశాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వేలిముద్రలు సేకరించాలని చౌకడిపో డీలర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల మంది రేషన్‌కార్డులకు సంబంధించి 40,20,904 మంది లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,63,671 మంది వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించి తిరిగి ఆగస్టు 10 నుంచి 30 వరకు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి బియ్యం చౌక దుకాణాలలోని ఈ పోస్ మెషీన్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4,309 పాఠశాలలకు సంబంధించి 926 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. -
భూమి కొట్టేశారు బోర్డు పెట్టేశారు!
కాపులుప్పాడలో వైద్యుడి భూమి దురాక్రమణ నకిలీ డాక్యుమెంట్లు, వారసులను పుట్టించిన ఘనులు రూ.3 కోట్లకు పైగా విలువైన భూమిలో కబ్జాదారుల పాగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు విభాగాలు నగరంలో ఆయనో ప్రముఖ వైద్యుడు. తన వారసుల కోసం ఎప్పుడో పాతికేళ్ల క్రితం కొంత స్థలం కొనుగోలు చేశారు. కొంత కాలం అందులో వ్యవసాయం చేయించినా ఆ తర్వాత దాన్ని ఖాళీగా వదిలేశారు.ఇటీవలి కాలంలో నగరంలో భూములు బంగారంగా మారాయి. ఈ వైద్యుడి భూమి ధర కూడా కోట్లకు పెరిగింది. సహజంగా అది కబ్జాదారులను ఆకర్షించింది. అంతే.. కొద్దిరోజుల క్రితం ఆ భూమిలో ఒక బోర్డు ప్రత్యక్షమైంది. ఆ భూమి తమదంటూ గౌతమ్ అనే వ్యక్తి పేరుతో వెలసిన ఆ బోర్డు చూసి వైద్యుడు అవాక్కయ్యారు. అందులో ఉన్న నెంబరుకు ఫోన్ చేస్తే రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పి అవతలి వ్యక్తి ఫోను పెట్టాశారు.అప్పటి నుంచీ సదరు వైద్యుడి పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్నట్లు తయారైంది. భూమికి సంబంధించి తన వద్ద ఉన్న దస్తావేజులు పట్టుకొని తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, పోలీస్‌స్టేషన్.. ఇలా అన్నిచోట్లకు వెళ్లి మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం.. కబ్జాదారులకు రాజకీయ పెద్దల ప్రాపకం ఉండటమే!.. విశాఖపట్నం : భూమే బంగారంగా మారిన విశాఖ నగరంలో కోట్ల విలువైన స్థలాల కబ్జాలు.. డబుల్, త్రిబుల్ ఎంట్రీలతో రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. రిజిస్ట్రేషన్ సమయంలో భూమి అసలు వారసులు, పట్టాదారులు ఎవరన్నది నిర్థారించుకోకుండానే ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. దీంతో అసలు పట్టాదారులు అన్యాయమైపోతున్నారు. ఓ ప్రముఖ వైద్యుడికే ఇలాంటి అన్యాయం జరిగిందంటే.. ఇక సామాన్యుల భూములకు రక్షణ ఎక్కడుంటుంది!. రెండున్నర దశాబ్దాల క్రితం.. నగరంలో ప్రముఖ వైద్యుడైన బి.బాలచంద్రుడు 1991లో కాపులుప్పాడ సర్వే నెం.29-3లో 47 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఒకప్పుడు ఆ భూమి కొల్లి అప్పయ్య, గుడ్ల తమ్మయ్యల ఉమ్మడి యాజమాన్యంలో ఉండేది. అప్పయ్య కుమారులు కొల్లి యర్రయ్య, రామస్వామిల నుంచి ఇరవైమూడున్నర సెంట్లు, తమ్మయ్య కుమారుడు రామ్మూర్తి నుంచి మరో ఇరవైమూన్నర సెంట్లు చొప్పున సింగవరపు సుధాకర్ కొనుగోలు చేశారు. ఆయన నుంచి బాలచంద్రుడు కొనుగోలు చేసి.. తనతో పాటు తన భార్య కమలాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చాలా కాలం పాటు ఆ భూమిలో వ్యవసాయం కూడా చేయించారు కూడా. నకిలీ వారసులతో నాటకం నగరం పెరగడంతో భూములు, స్థలాల రేట్లు పెరిగి బంగారంలా మారాయి. కాపులుప్పాడలోని బాలచంద్రుడి స్థలం విలువ కూడా కోట్లకు పెరిగింది. దాంతో కబ్జాదారులు దానిపై కన్నేశారు. కొల్లి అప్పయ్య వారసులంటూ లేని 23 మందిని సృష్టించారు. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయించారు. వారి నుంచి ఈ భూమి కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఓ వ్యక్తి.. ఆ స్థలం తనదేనంటూ బోర్డు కూడా పెట్టేశారు. విషయం తెలిసి బాలచంద్రుడు తన స్థలంలో పాతిన బోర్డుపై ఉన్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేశారు. తాను అక్కడి రైతుల నుంచి ఆ స్థలం కొన్నానని అవతలి వ్యక్తి సమాధానమిచ్చారు. 1991లోనే తాను కొనుగోలు చేసి, చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని తన ప్రమేయం లేకుండా అతనెలా కొన్నాడో వైద్యుడికి అర్ధం కాలేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు దీనికి కొద్ది రోజుల ముందే బాలచంద్రుడు మండల తహశీల్దార్‌ను కలిసి ఆన్లైన్ పట్టాదారు పాసుపుస్తకానికి దరఖాస్తు చేశారు. కానీ ఆ స్థలం తనదంటూ మరో వ్యక్తి కూడా వచ్చారని, ఇద్దరూ న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించి తహశీల్దార్ తప్పించుకున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ భీమునిపట్నం పోలీసులను ఆశ్రయించారు. వారు ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం తప్పుడు రిజిస్ట్రేషన్ అయినా ఆపుదామని స్థానిక సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి సర్వే నెంబర్ 29-3లోనిది తనకు, తన భార్యకు చెందిన భూమి అని, ఈ సర్వే నెంబర్‌పై రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎవరైనా వస్తే చేయవద్దని విన్నవించారు. ఆక్కడా తహశీల్దార్ కార్యాలయంలో వచ్చిన సమాధానమే వచ్చింది. భూమి తమదేనని తెలిపే అన్ని పత్రాలను ఈ మూడు చోట్లా ఆయన సమర్పించారు. కానీ ఏ ఒక్కరూ వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. కనీసం వాటి వివరాలు పరిశీలించడానికి కూడా పూనుకోలేదు. దీనికి కారణం కబ్జాకు పాల్పడిన వారికి రాజకీయ పెద్దల అండదండలుండటమేనని తెలుస్తోంది. నాలుగైదుసార్లు వెళ్లాం మా భూమిని కాపాడమని సీఐ అప్పలనాయుడుకి ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు తీసుకున్నట్లు రసీదు కూడా ఇవ్వలేదు. నాలుగైదుసార్లు ఆయన చుట్టూ తిరిగాం. చూస్తాం చేస్తాం అంటూ పట్టించుకోలేదు. చివరికి మా స్థలంలో ఎవరో ఏకంగా బోర్డు పాతేశారు. మా సర్వే నెంబర్‌పై ఎవరైనా రిజిస్ట్రేషన్‌కు వస్తే చేయవద్దని రిజిస్ట్రార్‌కు పిటిషన్ ఇచ్చాం. ఆయన రిజిస్ట్రేషన్ ఆపడం కుదరదన్నారు. ఆన్లైన్ పాసుపుస్తకం ఇమ్మని తహశీల్దార్ రామారావుకు దరఖాస్తు చేశాం. వివాదంలో ఉన్నదానికి ఇవ్వలేమని కోర్టులో తేల్చుకోమని ఆయన చేతులు దులుపుకున్నారు. ఇంక మాకు న్యాయం చేసేదెవరు. - బలుసు బాలచంద్రుడు, బాధితుడు ఆ సమస్య లేదనుకున్నాం తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ బలుసు బాలచంద్రుడు అనే వ్యక్తి నాలుగైదు నెలల క్రితం మా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే మా సిబ్బంది ఆయనను తీసుకుని ఆ భూమి వద్దకు వెళ్లారు. సరిహద్దులు వేయించి, ఏదైనా సమస్య వస్తే చెప్పమన్నాం. అయితే ఆ తర్వాత బాలచంద్రుడు మా వద్దకు రాలేదు. సమస్య లేదనుకుని ఊరుకున్నాం. కబ్జా జరిగినట్లు ఆయన వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. - టి.అప్పలనాయడు, సీఐ, భీమిలి.