holesale markets
-
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హోల్‌సేల్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 2023లో 40 లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదైంది. తయారీ కంపెనీల నుంచి గతేడాది డీలర్లకు 41,01,600 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) శుక్రవారం తెలిపింది. యుటిలిటీ వెహికిల్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఇందుకు కారణమని వెల్లడించింది. ‘హోల్‌సేల్‌లో 2022లో జరిగిన ప్యాసింజర్ వాహన అమ్మకాలతో పోలిస్తే గతేడాది నమోదైన విక్రయాలు 8 శాతం అధికం అయ్యాయి. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 22.4 శాతం వృద్ధి చెంది గత ఏడాది 23,53,605 యూనిట్లకు పెరిగాయి. వ్యాన్స్ 1,32,468 నుంచి 1,46,122 యూనిట్లకు ఎగశాయి. ప్యాసింజర్ కార్స్ 8 శాతం క్షీణించి 16,01,873 యూనిట్లకు పడిపోయాయి. అక్టోబర్–డిసెంబర్లో డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం అధికమై 10,12,285 యూనిట్లను తాకాయి’ అని సియామ్ వివరించింది. ఇతర విభాగాల్లో ఇలా.. గతేడాది తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ద్విచక్ర వాహనాల సంఖ్య 9 శాతం పెరిగి 1,70,75,160 యూనిట్లుగా ఉంది. వాణిజ్య వాహనాలు 9.33 లక్షల నుంచి 9.78 లక్షల యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు 4,18,510 నుంచి 6,80,550 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లో కలిపి హోల్‌సేల్‌లో వాహన విక్రయాలు గతేడాది 10 శాతం వృద్ధితో 2,28,36,604 యూనిట్లకు పెరిగాయి. 2022లో ఈ సంఖ్య 2,07,92,824 యూనిట్లుగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి 2023 సహేతుకంగా సంతృప్తికరంగా ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. ప్యాసింజర్, వాణిజ్య, ద్విచక్ర వాహనాలు సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేశాయి. త్రిచక్ర వాహనాలు చాలా మంచి రికవరీని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విభాగంలోని మొత్తం అమ్మకాలలో యుటిలిటీ వాహనాల వాటా ఏకంగా 62 శాతానికి చేరిందని వివరించారు. 2024లో సైతం వృద్ధి జోరు కొనసాగుతుందని ఆటో పరిశ్రమ ఆశాజనకంగా ఉందన్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో..: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో ఫిబ్రవరి 1–3 తేదీల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరుగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో కంటే ఈ ప్రదర్శన విస్తృత స్థాయిలో ఉంటుందని వినోద్ అగర్వాల్ చెప్పారు. ఆటోమొబైల్‌తో ముడిపడి ఉన్న అన్ని విభాగాల కంపెనీల భాగస్వామ్యంతో ఇది మరింత విస్తృత ఈవెంట్‌గా మారనుందని ఆయన అన్నారు. వాహన తయారీ సంస్థలతోపాటు ఈ ప్రదర్శనలో టైర్లు, స్టీల్, బ్యాటరీ, ఇతర విభాగాల కంపెనీలు సైతం పాల్గొంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 600 మందికిపైగా ఎగ్జిబిటర్లు పాలుపంచుకుంటారని వివరించారు. -
ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ భారీ విస్తరణ
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ (హోల్‌సేల్ వర్తకుల కొనుగోళ్ల వేదిక/బీటుబీ) భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంతోపాటు, లక్షలాది మంది చిన్న వ్యాపారస్థులు, కిరాణా స్టోర్ల యజమానుల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి 2,700 పట్టణాలకు విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వ్యాపారం 2020 సెప్టెంబర్‌లో మొదలు కాగా.. 2021 మొదటి ఆరు నెలల్లో వ్యాపార పరంగా మంచి వృద్ధిని చూసింది. కిరాణా స్టోర్లు, రిటైలర్లు ఈ కామర్స్ కొనుగోళ్ల వైపు అడుగులు వేయడం ఈ వృద్ధికి మద్దతునిచ్చింది. ఇక ఈ ఏడాది ద్వితీయ భాగంలో (జూలై–డిసెంబర్) 180% వరకు హోల్‌సేల్ వ్యాపారం వృద్ధి చెందుతుందని ఫ్లిప్‌కార్ట్ అంచనా వేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బీటుబీ వేదికపై సరఫరాదారుల సంఖ్య కూడా వృద్ధి చెందుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సరఫరాదారులు 58% పెరగొచ్చని అంచనా వేసింది. ఇది స్థానిక వ్యాపార సంస్థల వృద్ధికి, జీవనోపాధికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. వాల్‌మార్ట్‌కు చెందిన ‘బెస్ట్‌ప్రైస్’ను 2020లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. దీన్నే ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌గా పేరు మార్చుకుని విస్తరణపై దృష్టి సారించింది. కరోనా మహమ్మారి ఎన్నో సవాళ్లను తీసుకొచ్చినప్పటికీ కిరాణా సంస్థల నుంచి మంచి మంచి మద్దతును చూస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ పేర్కొన్నారు. డిజిటైజేషన్ ప్రయోజనాలను వారు చవి చూస్తున్నారని.. ఈ కామర్స్‌పై కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ సాయంతో స్థానిక సరఫరాదారుల వ్యవస్థ బలోపేతానికి, జీవనోపాధి పెంపునకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. -
హోల్'సేల్' లేదు!
లాక్‌డౌన్‌కు ముందు రోజుకు సగటున లక్ష రూపాయల వ్యాపారం జరిగేది. ఇందులో డొమెస్టిక్ సేల్స్ కంటే కమర్షియల్ సేల్సే ఎక్కువ. ప్రస్తుతం ఫంక్షన్లు తగ్గిపోయాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచినా కస్టమర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో మా కిరాణాషాపులో వ్యాపారం భారీగా తగ్గింది. ప్రస్తుతం డొమెస్టిక్ కస్టమర్లే ఎక్కువ వస్తున్నారు. చిల్లర వ్యాపారం ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మా కౌంటర్ రూ.40 వేలు దాటడం లేదు. – ఎల్బీనగర్లోని ఓ హోల్‌సేల్ కిరాణా వ్యాపారి ఆవేదన ఇది సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభించినకొద్దీ విక్రయాలు నీరసిస్తున్నాయి. కరోనా ప్రభావం పెరిగినకొద్దీ కిరాణా వ్యాపారం హైరానా పడుతోంది. గిరాకీ లేక వ్యాపారం గిరికీలు కొడుతోంది. శుభకార్యాలు భారీగా తగ్గిపోయాయి. అక్కడక్కడా దావత్‌లు జరుగుతున్నా బంధుమిత్రులు పరిమిత సంఖ్యలోనే వచ్చేస్తున్నారు. దావత్‌లకు పోయేవాళ్లల్లో కొంతమంది మొహం చూపించి రావడం తప్ప భోజనం సైతం చేయడం లేదు. మరోవైపు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తెరిచినప్పటికీ గిరాకీ పూర్తిగా తగ్గింది. ఈ ప్రభావం హోల్‌సేల్(టోకు) కిరాణా దుకాణాలపై తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకుల వ్యాపారానికి ఢోకా లేదని భావించినా హోల్‌సేల్ వ్యాపారులకు మాత్రం ప్రస్తుత పరిస్థితి మింగుడుపడడం లేదు. సాధారణరోజుల్లో జరిగే వ్యాపారంలో ప్రస్తుతం 40 శాతం మించడం లేదనే ఆందోళన హోల్‌సేల్ వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్.. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సాధారణ గృహావసరాలకు జరిగే విక్రయాలతో పోలిస్తే కమర్షియల్ విక్రయాల పరిమాణమే ఎక్కువ. యాభైమంది డొమెస్టిక్ కస్టమర్లకు సరిపడా సరుకులు ఒక కమర్షియల్ కస్టమర్ కొనుగోలు చేస్తాడు. ఈ క్రమంలో కమర్షియల్ సేల్స్ పడిపోవడంతో వ్యాపారులకు నష్టాలు మొదలయ్యాయి. రెండింటిలో తేడా ఏంటంటే... సాధారణంగా ఒక డొమెస్టిక్ కస్టమర్ కొనుగోలు చేసే సరుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ప్యాకింగ్ చేసేందుకు రిస్క్‌తోపాటు మ్యాన్‌పవర్ అవసరం ఎక్కువ. సరుకులు తూచే క్రమంలో నిర్ణీత పరిమాణం కంటే కాస్త కొసరు వేయడంతో లాభాలు అక్కడే హరించుకుపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకే ఈ ఎత్తుగడ అని, వ్యాపారం రొటేషన్ కోసం మాత్రమే డొమెస్టిక్ సేల్స్ పాత్ర పోషిస్తామని అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ కస్టమర్‌కు పెద్దమొత్తంలో సరుకులు ఇవ్వడంతోపాటు ప్యాకేజీ సమస్య కూడా పెద్దగా ఉండదు. కాస్త తక్కువ రేటుకు సరుకులు విక్రయించినా డొమెస్టిక్ సేల్స్‌తో పోలిస్తే ఎక్కువ వ్యాపారం, ఎక్కువ లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాతి పరిస్థితులతో కమర్షియల్ సేల్స్ బాగా పడిపోవడంతో హోల్‌సేల్ వ్యాపారంతోపాటు లాభాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణభారం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. సూపర్మార్కెట్లు కాస్త మెరుగే... హోల్‌సేల్ వ్యాపారంతో పోలిస్తే సూపర్మార్కెట్లలో వ్యాపారం ఆశాజనకంగా ఉన్నట్లు పలు మార్కెటింగ్ రీసెర్చ్‌లు చెబుతున్నాయి. సూపర్ మార్కెట్లలో సరుకులను ఎక్కువగా డొమెస్టిక్ కస్టమర్లే కొనుగోలు చేస్తారు. ఇక్కడ ప్యాకేజింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. సేల్స్ బాయ్స్ కూడా అందుబాటులో ఉండడంతో కస్టమర్ల రాకపోకలు సాఫీగా, వేగంగా సాగుతాయి. ఈ క్రమంలో ఎక్కువ సేల్స్‌తోపాటు ప్యాకేజింగ్ చార్జీలు, సరుకుల కొలత పక్కాగా ఉండడం వ్యాపారికి కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే లాభాల్లో ఏమాత్రం తేడా ఉండదు. లాక్డౌన్ కంటే ముందు జరిగే వ్యాపారంతో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం పెరిగినట్లు బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ‘సాక్షి’తో అన్నారు. మరో నాలుగు నెలలు ఇంతే... ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతోంది. కరోనా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఇప్పటివరకు నడిచిన వ్యాపారంపై మరింత ప్రభావం పడనుంది. ఉపాధి అవకాశాలు తగ్గుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు ఆచితూచి ఖర్చులు పెడుతున్నాయి. వైరస్ ప్రభావం మరో నాలుగు నెలల వరకు ఉంటుందని, అప్పటి వరకు కిరాణా వ్యాపారానికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చని వ్యాపారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిసెంబర్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధి గణేష్‌గుప్తా అభిప్రాయపడ్డారు. -
చైనాలో భారీగా కరోనా పరీక్షలు
బీజింగ్: కరోనా మహమ్మారి మరోసారి తన కోరలు చాచడంతో చైనా అప్రమత్తమైంది. కొత్త కరోనా కేసులు మొదలైన బీజింగ్ హోల్‌సేల్ మార్కెట్‌కు ఇటీవల వెళ్లిన వారందరికీ కరోనా పరీక్షలు చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 67 మందికి కరోనా సోకగా, ఇందులో 42 మంది రాజధాని బీజింగ్‌కు చెందిన వారే. ఇప్పటివరకూ చైనాలో మొత్తంగా 83181 మందికి కరోనా సోకగా, 4,634 మంది మరణించారు. కొన్ని వారాలపాటు కొత్త కేసులేవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న చైనా.. తాజాగా కేసులు నమోదవడంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా మే 30 నుంచి బీజింగ్ హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లిన 29,386 మందికి సోమవారం నుంచి పరీక్షలు చేయడం మొదలుపెట్టిందని బీజింగ్ హెల్త్ కమిషన్ ప్రతినిధి గావ్ షియాజున్ తెలిపారు. ‘కరోనా టీకా’కు మరింత దగ్గరయ్యాం కోవిడ్–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్ బయోటెక్ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్’టీకా మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి దశలో 600 మంది వాలంటీర్లు తమ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 90% కన్నా ఎక్కువ మందిలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. వారిలో తీవ్రస్థాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని పేర్కొంది. త్వరలో చైనా ‘నేషనల్ మెడికల్ ప్రాడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్’కు పూర్తి వివరాలు అందజేస్తామని, అనంతరం, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విదేశాల్లో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. బ్రెజిల్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూటొ బూటాంటన్’సంస్థతో కలిసి విదేశాల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామంది. ‘తొలి, మలి క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో కోవిడ్–19పై పోరులో కీలక దశకు చేరుకున్నాం. కరోనావాక్ సురక్షితమైందని మా ట్రయల్స్‌లో తేలింది’అని సైనోవాక్ ప్రెసిడెంట్, సీఈఓ వీడాంగ్ యిన్ ప్రకటించారు. -
పసందైన పుచ్చకాయ..
ఎదులాపురం: ప్రస్తుతం ఎండలు అదరగొడుతున్నాయి... ఎండ వేడిమి నుంచి రక్షణ పొందేందుకు ఆహార పదార్థాలను తీసుకునేందుకు ప్రజలు దృష్టి సారిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ఒక నెల ముందుగానే ఎండ తీవ్రత పెరిగిపోయింది. వేసవిలో ప్రజలు పుచ్చకాయలను పసందు గా తింటుంటారు. ప్రసుత్తం ఆదిలాబాద్ మార్కెట్లో పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువు అధికంగా ఉండడంతో వీ టి కొ నుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది.. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయాలను వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. ఎండ తీవ్రతకు గొంతు తడారిపోకుండా, ఎండలో తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన వ్యక్తి తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిస్తోంది. చెమట రూపంలో విసర్జన జరిగిన శరీరంలోని నీటి శాతం పడిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో దోహద పడుతోంది. పట్టణంలో విక్రయాలు.. ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం పుచ్చకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ వీటిపై ఆసక్తి క నబర్చుతారు. రుచిగా తియ్యగా ఉండే ఈ కా యల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ప్రస్తు తం పుచ్చకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయల రుచిచూడటానికి అందరు ఇష్టపడతారు. కిలో పుచ్చకాయ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండలు ముదిరి శరీరంలోని ఖనిజ లవణాలు బయటకు పో యే తరుణంలో పుచ్చకాయ తినడం శ్రేయస్క రం. ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టర్‌చౌక్, ఎన్టీఆర్‌చౌక్, బస్టాండ్ ఏరియా, శివాజీచౌక్, దస్నాపూర్, గాంధీచౌక్, అంబేద్కర్లతో పాటు తదితర ముఖ్య కూడళ్ల లో వీటి విక్రయాలు జోరందుకుంటున్నాయి. భానుడు తన ప్రతాపం చూపించడం ఆరంభిం చడంతో ప్రజలు చల్లదనాన్ని కోరుకుంటూ పు చ్చకాయలపై దృష్టి పెట్టారు. దాహర్తిన్ని తీర్చేందుకు పుచ్చకాయలు ఉపయోగకరం. ప్రజలను ఆకర్షించేలా.. పుచ్చకాయలు మార్కెట్లో అందుబాటులోకి వ చ్చాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని హోల్‌సేల్‌కు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారులు తోపుడు బండ్లపై పుచ్చకాయలను విక్రయిస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా ఐస్ గడ్డలపై ముక్కలు చేసిన పుచ్చకాయలను ఉంచుతూ అమ్ముతున్నారు. రూ.10 కి ఒక ప్లేట్ చొప్పున అమ్ముతూ, వాటిపై మసాల, ఉప్పు లాంటివి చల్లి ఇస్తుండడంతో ప్రజలు మరింత ఇష్టంగా వాటిని తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు.