హాలిడే ఐక్యూలో వాటా కొనుగోలు చేసిన మేక్మైట్రిప్
28% వాటాను రూ.95కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ : ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు, సమాచారముండే ఆన్లైన్ పోర్టల్ హాలిడేఐక్యూలో 28 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను రూ.95 కోట్లకు కొనుగోలు చేయనున్నామని మేక్మైట్రిప్డాట్కామ్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ దీప్ కల్రా చెప్పారు. మేక్మైట్రిప్ అందిస్తున్న పెట్టుబడులతో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని హాలిడేఐక్యూ వ్యవస్థాపకుడు, సీఈఓ హరి నాయర్ వివరించారు.
గతంలో టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్ల నుంచి నిధులు సమీకరించామని పేర్కొన్నారు. భారత పర్యాటకులు హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు పదిలక్షలకు పైగా హాలిడేఐక్యూలో ఉన్నాయి.