Holly wood movie
-
‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలాంటి సినిమాలు చూసి, లేదా కథలు చదివి మనం వినోదం పొందుతాం. ఇలా రుధిరాన్ని ఆస్వాదించే కారెక్టర్స్‌ను వాంపైర్స్ అని పిలవడం కూడా మనకు తెలుసు. కానీ వాంపైరిజమ్ అనే కండిషన్ ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతోకొంత రుచి చూస్తాడు. చటుక్కున వేలు తెగినప్పుడు చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకే ఇలా చేస్తారు. అయినప్పటికీ ఇలా తన రక్తాన్ని రుచిచూసే ఆ ప్రక్రియకు ‘‘ఆటో వాంపైరిజమ్’’ అంటారు. ఇది సాధారణం. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఇంకా అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇలా రక్తం తాగాలనే కోరిక పుట్టడాన్ని ‘‘క్లినికల్ వాంపైరిజమ్’’ అంటారు. ఇక మరికొందరిలో ఇది ఓ రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన (బిహేవియరల్) రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ చికిత్స అందిస్తారు. చదవండి: ‘యూ బ్లడీ ఫూల్’ అంటూ బాతు నోట తిట్టు! -
సూపర్ హీరోలు దిగిపోతున్నారు
ఇంకొక్క మూడు రోజుల్లో కమర్షియల్ సినిమాలకు బాబు లాంటి సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో పాత్రలన్నీ ఒకే సినిమాలో, ఒకేసారి కనిపించే సంబరం కావడంతో సాధారణంగానే ‘అవెంజర్స్’కు అభిమానుల్లో పిచ్చి క్రేజ్ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేసింది. ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే అభిమానులు టికెట్లు బుక్ చేస్కోవడం మొదలుపెట్టేశారు. ఇండియాలోనూ అవెంజర్స్ సిరీస్‌కు లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలోనూ ఈ శుక్రవారం (ఏప్రిల్ 27న) భారీ ఎత్తున అవెంజర్స్ విడుదలవుతోంది. కెప్టెన్ అమెరికా, ఐరన్‌మేన్, స్పైడర్‌మేన్ లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ సినిమా అంతా కనిపించనున్నాయి. అడుగడుగునా యాక్షనే! ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఫస్ట్ వీకెండ్‌కే ఈ సినిమా 250 మిలియన్ డాలర్లు (సుమారు 1,600 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. పాజిటివ్ టాక్గనక వస్తే అవెంజర్స్‌ను బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఆపలేరని టాక్ వస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే!! -
హాలీవుడ్‌కు నెపోలియన్
తమిళసినిమా: కోలీవుడ్‌లో మావీరన్గా పేరుగాంచిన నటుడు నెపోలియన్ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు డెవిల్స్ నైట్–డాన్ అఫ్ ది నైన్ రుజ్ అనే అమెరికన్ చిత్రం ద్వారా నెపోలియన్ హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కోలీవుడ్‌లో ప్రతి నాయకుడిగా రంగప్రవేశం చేసి, ఆ తరువాత కథానాయకుడిగా దక్షిణాదిలోని పలు భాషల్లో శతాధిక చిత్రాల్లో నటించిన ఈయన రాజకీయరంగప్రవేశం చేసి ఎంపీ గానూ, కేంద్రమంత్రిగానూ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలోనే ఎక్కువగా నివశిస్తున్న నెపోలియన్ తొలిసారిగా హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. డెవిల్స్ నైట్ అనే హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన టెల్ గణేశన్ కైపా ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎమ్మీ నామినేటెట్ దర్శకుడు శ్యామ్ లోగన్ కరేలి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు జెసీ జెన్సన్, బాబీలెనిన్, జాక్ సీ, ఫార్మన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇది హర్రర్ కథా చిత్రం అని సోమవారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నెపోలియన్ తెలిపారు. -
దీపికా హాలీవుడ్ మూవీ ట్రైలర్
-
ఆకాశంలో అగ్నిజ్వాలలు
మూడువందల మంది ప్రయాణీకులతో ఆ విమానం ఆకాశానికి ఎగిరింది. సురక్షితంగా గమ్యం చేరుకుంటుందనే సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. దాంతో సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఏరోప్లేన్ వర్సెస్ వోల్కనోస్’. ఈ చిత్రాన్ని ‘అగ్ని జ్వాలలు’ పేరుతో శ్రీ వెంకటసాయి ఫిలింస్ అధినేత ముత్యాల రామదాసు తెలుగులోకి విడు దల చేస్తున్నారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ -‘‘మరణానికి చేరువ అవుతున్నామనే సమయంలో విమానంలోని ప్రయాణీకులను ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎలా కాపాడాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏప్రిల్ 4న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి జేమ్స్ కాన్‌డెలిక్, జాన్ కాన్‌డెలిక్ దర్శకులు.