ఆకాశంలో అగ్నిజ్వాలలు | Muthyala Ramadasu directing new movie from hollywood in telugu verision | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అగ్నిజ్వాలలు

Published Sat, Mar 29 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

ఆకాశంలో అగ్నిజ్వాలలు

ఆకాశంలో అగ్నిజ్వాలలు

మూడువందల మంది ప్రయాణీకులతో ఆ విమానం ఆకాశానికి ఎగిరింది. సురక్షితంగా గమ్యం చేరుకుంటుందనే సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. దాంతో సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఏరోప్లేన్ వర్సెస్ వోల్కనోస్’. ఈ చిత్రాన్ని ‘అగ్ని జ్వాలలు’ పేరుతో శ్రీ వెంకటసాయి ఫిలింస్ అధినేత ముత్యాల రామదాసు  తెలుగులోకి విడు దల చేస్తున్నారు.
 
 ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ -‘‘మరణానికి చేరువ అవుతున్నామనే సమయంలో విమానంలోని ప్రయాణీకులను ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎలా కాపాడాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏప్రిల్ 4న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి జేమ్స్ కాన్‌డెలిక్, జాన్ కాన్‌డెలిక్ దర్శకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement