Home Credit
-
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సొంతిల్లు సామాన్యుడి కల. రోజురోజుకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంది. దాంతో రియల్టీ వ్యాపారులు, గృహాలు నిర్మిస్తున్న డెవలపర్లు వాటిని కొనుగోలు చేయాలనుకునేవారిని వివిధ మార్గాల ద్వారా ఆకర్షిస్తున్నారు. దాంతో మరింత సమయం వేచిచూస్తే ధరలు పెరుగుతాయనే భావనతో ఎలాగోలా అప్పు చేసైనా గృహాలు కొంటున్నారు. అలా ఏటా వినియోగదారులు తీసుకుంటున్న గృహ రుణాలు బ్యాంకుల వద్ద పేరుకుపోతున్నాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రికార్డు స్థాయిలో రూ.10లక్షల కోట్ల గృహ నిర్మాణ రంగ రుణాలు పెరిగాయి.ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు2024 మార్చి నెల వరకు గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం తెలిసింది. 2022 మార్చి నాటికి రూ.17,26,697 కోట్ల బకాయిలు ఉండగా, 2023 మార్చి నాటికి రూ.19,88,532 కోట్లకు, 2024 మార్చి నాటికి రూ.27,22,720 కోట్లకు చేరాయని పేర్కొంది. వాణిజ్య స్థిరాస్తి రుణ బకాయిలు 2024 మార్చి నాటికి రూ.4,48,145 కోట్లకు చేరాయని, 2022 మార్చిలో రూ.2,97,231 కోట్లుగా ఉన్నాయని వెల్లడించింది. -
ఈఎంఐ, రుణంపై షాపింగ్
హైదరాబాద్: దేశవాసుల్లో సగానికి సగం మంది షాపింగ్‌ను ఈఎంఐ కార్డుపై లేదంటే రుణంపై చే యడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ వినియోగదారు ధోరణలుపై సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది. ► 25 శాతం మంది క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తామని చెప్పారు. ► బీఎన్‌పీఎల్ తదితర నూతనతరం సాధనాల ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తామని చెప్పిన వారు 10 శాతంలోపు ఉన్నారు. ► 60 శాతం మంది ఎంబెడెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి చూపించారు. అంటే ఈ కామర్స్ సంస్థలే కొనుగోలు మొత్తాన్ని రుణ ఈఎంఐలుగా బదిలీ చేస్తా యి. ► 52 శాతం మంది హైదరాబాదీలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఆర్థిక నిర్వహణ) పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ► ఆన్లైన్ షాపింగ్‌కు ఎంబెడెడ్ ఫైనాన్స్, ఈఎంఐ సాధనాల వినియోగం పట్ల హైదరబాదీలు తక్కువ ఆసక్తి చూపించారు. ► ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆర్థిక అంశాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ► 54 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నట్టు చెప్పారు. ► ఫిన్‌టెక్ వృద్ధి పట్ల 49 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. ► టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో మూడొంతులు మంది జెనరేషన్ జెడ్/మిలీనియల్స్ డిజిటల్ లెండింగ్ (ఆన్లైన్ రుణ సదుపాయాలు) సేవల పట్ల సానుకూలంగా ఉన్నారు. ► దేశవ్యాప్తంగా 16 పట్టణాలకు చెందిన 1,600 మంది హోమ్ క్రెడిట్ కస్టమర్ల అభిప్రాయాను ఈ సర్వే కోసం తెలుసుకున్నారు. ► కరోనా అనంతరం ఆర్థిక అక్షరాస్యత కీలకమైన చర్చనీయాంశంగా మారినట్టు, దేశవ్యాప్తంగా 40 శాతం మంది ఆర్థిక అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపిస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది. -
జియోనీ ఫోన్లకు ‘హోమ్ క్రెడిట్’ వడ్డీ లేని రుణం
హైదరాబాద్: బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీ అయిన హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్, మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియోనీ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎటువంటి వడ్డీ లేకుండా హోమ్ క్రెడిట్ రుణం సమకూరుస్తుంది. దేశవ్యాప్తంగా 1,000కిపైగా రిటైల్ దుకాణాల్లో ఈ సౌకర్యం ఉంటుందని హోమ్ క్రెడిట్ సీఎంవో థామస్ తెలిపారు. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు.