హైదరాబాద్: దేశవాసుల్లో సగానికి సగం మంది షాపింగ్‌ను ఈఎంఐ కార్డుపై లేదంటే రుణంపై చే యడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ వినియోగదారు ధోరణలుపై సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసింది.
► 25 శాతం మంది క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తామని చెప్పారు.
► బీఎన్‌పీఎల్ తదితర నూతనతరం సాధనాల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తామని చెప్పిన వారు 10 శాతంలోపు ఉన్నారు.
► 60 శాతం మంది ఎంబెడెడ్ ఫైనాన్స్ పట్ల ఆసక్తి చూపించారు. అంటే ఈ కామర్స్ సంస్థలే కొనుగోలు మొత్తాన్ని రుణ ఈఎంఐలుగా బదిలీ చేస్తా యి.
► 52 శాతం మంది హైదరాబాదీలు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఆర్థిక నిర్వహణ) పట్ల ఆసక్తి ప్రదర్శించారు.
► ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎంబెడెడ్ ఫైనాన్స్, ఈఎంఐ సాధనాల వినియోగం పట్ల హైదరబాదీలు తక్కువ ఆసక్తి చూపించారు.
► ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఆర్థిక అంశాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు.
► 54 శాతం మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నట్టు చెప్పారు.
► ఫిన్‌టెక్ వృద్ధి పట్ల 49 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.
► టైర్ 1, టైర్ 2 పట్టణాల్లో మూడొంతులు మంది జెనరేషన్ జెడ్/మిలీనియల్స్ డిజిటల్ లెండింగ్ (ఆన్‌లైన్ రుణ సదుపాయాలు) సేవల పట్ల సానుకూలంగా ఉన్నారు.
► దేశవ్యాప్తంగా 16 పట్టణాలకు చెందిన 1,600 మంది హోమ్ క్రెడిట్ కస్టమర్ల అభిప్రాయాను ఈ సర్వే కోసం తెలుసుకున్నారు.
► కరోనా అనంతరం ఆర్థిక అక్షరాస్యత కీలకమైన చర్చనీయాంశంగా మారినట్టు, దేశవ్యాప్తంగా 40 శాతం మంది ఆర్థిక అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపిస్తున్నట్టు హోమ్ క్రెడిట్ ఇండియా తెలిపింది.
ఈఎంఐ, రుణంపై షాపింగ్
Published Tue, Dec 20 2022 6:08 AM | Last Updated on Tue, Dec 20 2022 6:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment