విద్యుదాఘాతంతో వైద్య విద్యార్థి మృతి
నెల్లిమర్ల (విజయనగరం) : హోమియో వైద్య విద్యార్థి ఒకరు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో వంశీకుమార్ అనే యువకుడు హోమియో ఫైనలియర్ చదువుతున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కళాశాలకు సమీపంలోనే ఉండే తన గదిలో స్నానం చేయడానికి నీటి వాల్వ్ తిప్పగా దానికి కరెంట్ ఎర్త్ అయి షాక్తో పడిపోయాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్థారించారు. కాగా వంశీకుమార్ హైదరాబాద్ వాసి అని తెలిసింది.