Homeo treatment
-
బాబుకు ఆటిజమ్... తగ్గుతుందా?
మా బాబుకు నాలుగేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ కనిపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా? ఆటిజమ్ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటేనే నాకు వణుకు వచేస్తోంది. హోమియోలో ఆపరేషన్ లేకుండా చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలపాళ్లు తగ్గడంవల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ రాత్రంతా గురక... మర్నాడంతా మగత పల్మునాలజి కౌన్సెలింగ్స్ నా వయసు 52 ఏళ్లు. ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి రాత్రిళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయి ఉంటోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టమవుతోంది. నిద్రలో పెద్ద శబ్దంలో గురక పెడుతున్నట్లు ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఇక మర్నాడు పగలంతా బాగా అలసటగా ఉంటోంది. నా సమస్య ఏమిటి? ఇదేమైనా ప్రమాదమా? గురక రాకుండా చేయలేమా? స్లీప్ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారిలో నిద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి... అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్పియాలో సంభవించే చాలా ప్రమాదకరమైన పరిణామం అన్నమాట. కారణాలు, పరిణామాలు : టాన్సిల్స్, సైనసైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గండెజబ్బులు ఉన్నవారికి స్లీప్ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం / చికిత్స : ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగానే తీసుకునేలా జాగ్రత్త పడాలి.ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చికిత్స విషయానికి వస్తే స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ డాక్టరుకు చూపించుకోండి. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి
నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ∙సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వైద్యరంగానికి స్ఫూర్తిదాయకం
కోవెలకుంట్ల/ రూరల్: హోమియో వైద్య పితామహుడు డాక్టర్ హానెమన్ విగ్రహం మారుమూల గ్రామమైన గుళ్లదూర్తి ఏర్పాటు చేయడం వైద్యరంగానికి గర్వకారణమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రామాచారి అన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హానెమన్ విగ్రహం సొంత గ్రామంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన డాక్టర్ ప్రసాద్‌రెడ్డికి రావడం అభినందనీయమన్నారు. వైద్య రంగానికే ఇది స్ఫూర్తిదాయకమన్నారు. హోమియో వైద్యం అన్ని విధాలుగా అభివృద్ధి చెంద టానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గంలో క్లినిక్ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన సహా యాన్ని చేస్తానన్నారు. ఏ వృత్తినైనా దైవం గా భావించి పనిచేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని సినీ దర్శకుడు రామచంద్రారావు అన్నారు. తన తండ్రి కాతా అయ్యపురెడ్డి జిల్లాలో మొదటిసారిగా హోమియో వైద్యాన్ని వ్యాప్తి చేశారని డాక్టర్ ప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు. తండ్రి జ్ఞాపకార్థం తనకు జన్మనిచ్చిన గడ్డలో వైద్యపితామహుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు. హోమియోతో సైనస్ నయం సినీ నటుడు సునీల్ తన ప్రసంగంతో జనాలను ఉర్రూతలూగించారు. చమక్కులు, జోకులతో జనాలను కడుపుబ్బా నవ్వించారు. కోనసీమవాసులకు కంగారెక్కువని, రాయలసీమ వాసులకు ధైర్యమెక్కువని అభిప్రాయపడ్డారు. తాను సినీ రంగంలోకి రాకమునుపు డయాగ్నటిక్ సెంటర్లో నెలకు రూ. 1200 వేతనంతో పనిచేసేవాడినని చెప్పారు. డాక్టర్ వద్దకు వచ్చే వృద్ధ రోగులను త్వరగా వైద్యం అందాలన్న ఉద్దేశంతో మొదటి పది నంబర్లు అలాగే ఉంచేవాడినన్నారు. పెద్దల ఆశీస్సులతోనే తాను సినీ రంగంలో రాణిస్తున్నానని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సందర్భంగా రాయలసీమలో సైకిల్ తొక్కిన అనుభవం ఉందని గుర్తుచేశారు. తాను సైనస్‌తో ఇబ్బంది పడుతుండేవాడినని, హోమియో డాక్టర్ సాయిప్రసాదరెడ్డి వైద్యంతో దాని నుంచి విముక్తి కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సి మాజీ వైస్ చాన్స్‌లర్ భూమయ్య, రిపోర్టర్ ఎడిట ర్ సాయికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలోసిస్) - హోమియో చికిత్స
ఈమధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్యక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. కారణం: మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే ‘సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు. లక్షణాలు: మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది. వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది. చేయి పైకిఎత్తడం కష్టమవుతుంది. జాగ్రత్తలు సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు, వాహనం నడిపేటప్పుడు నిటారుగా ఉండేవిధంగా సరైన భంగిమలో కూర్చోవాలి బరువులు ఎక్కువగా లేపకూడదు పడుకునేటప్పుడు తలకింద ఎత్తై దిండ్లు వాడకూడదు మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు చేయాలి సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. హోమియో చికిత్సా విధానం హోమియోపతి వైద్యవిధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్‌కి పూర్తి ఉపశమనం కలిగించే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విధానంలో కేవలం లక్షణాలు తగ్గించడం కాకుండా, లక్షణాలకు కారణాలను, వ్యక్తి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి తగిన ఔషధాన్ని వైద్యులుసూచిస్తుంటారు. సాధారణంగా వాడే మందులు... బ్రయోనియా: మెడ కదిలించడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. విశ్రాంతితో నొప్పి తగ్గుతుంది. వీరికి మలబద్దకంతో పాటు మెడనొప్పి వస్తుంది. దాహం అధికంగా ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. ఈ లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకరం. స్పైజీలియం: నొప్పి మెడ నుంచి మొదలై ఎడమభుజంలో ఎక్కువగా ఉంటే ఈ మందు పనిచేస్తుంది. కాల్మియా: కుడిభుజం వైపు నొప్పి ఎక్కువగా ఉంటే ఇది ప్రయోజనకారి. కోనియం: మెడనొప్పితో పాటు కళ్లు తిరిగినట్లనిపిస్తుంది. వృద్ధుల్లో వచ్చే మెడనొప్పికి ఉపయోగం. ఇవేకాకుండా హైపరికం, రాస్టాక్ మొదలైన మందులను వాటి వాటి లక్షణాల ఆధారంగా వైద్యుల సూచనమేరకు వాడితే మెడనొప్పి నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, ఫోన్: 7416 107107 / 7416 102 102 -
సయాటికా-సంపూర్ణ హోమియో చికిత్స
సయాటికా... ఈ పదాన్ని ఈ ఆధునికయుగంలో యుక్త, మధ్యవయస్సు వారిలో విననివారు ఉండరు. ఈ నొప్పి వర్ణనాతీతంగా భరింపరానిదిగా ఉండటమే కాకుండా వారి దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దీనిబారిన పడినవారే. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (Buro of labour Stastics) ప్రకారం 62 శాతం వరకు ఈ నొప్పి వల్ల తమ విధులకు గైర్హజర్ అవుతున్నారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స, దైనందిన జీవితంలో మార్పులు, ఫిజియోథెరిపీ, హోమియో మందులు, యోగా ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా సయాటికా అంటే ఆపరేషన్ వరకు పోతుందేమోనని, ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుందేమోనని భయపడుతుంటారు. కానీ హోమియోలో ఏ విధమైన దుష్ర్పభావం లేని చికిత్స అందరికీ అందుబాటులో ఉంది. శరీరంలో అన్నిటి కంటే పెద్దది సయాటికా నరం. కింది వీపు భాగం నుండి పిరుదుల నుండి కాలు వెనుక భాగంలో ప్రయాణించే ముఖ్యమైన నరం ఈ సయాటికా నరం. ఈ నరం ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. (ఔ4, ఔ5, 1, 2, 3) వెన్నుపూస లోపల నుండి ప్రయాణించే నరాలపై ఒత్తిడి వలన కాలు వెనుక భాగం నొప్పికి గురవుతుంది. దానినే ‘సయాటికా నొప్పి’ అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై పిరుదుల నుండి తొడ, కాలు వెనుక భాగం, మడమల వరకు పాకే అవకాశం ఉంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవటం, మంటలు, నడకలో మార్పు లాంటి లక్షణాలు చూడవచ్చును. కారణాలు నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వటం వలన నొప్పి వస్తుంది. స్పైనల్ డిస్క్ హెర్నియోషన్: ఔ4, ఔ5, నరాల రూట్స్ ఒత్తిడికి గురై, సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది. స్పైనల్ స్టినోసిన్: ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది. దానివలన సయాటికా నొప్పి వస్తుంది. పెరిఫార్మిస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది. సాక్రొఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగా పనిచేయక సయాటికా నొప్పి రావచ్చు. ప్రెగ్నెన్సీ : ప్రెగ్నెన్నీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన సయాటిక నొప్పి వస్తుంది. పరీక్షలు డాక్టర్ సమక్షంలో కొన్ని వ్యాయామాలతో కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. వాటితో సయాటికా నొప్పి నిర్థారణ అవుతుంది. ఎమ్ఆర్ స్కాన్-డిస్క్ హెర్నియోషన్, డిస్క్ ప్రొలాప్స్, నిర్ధారణ, ఏనర్స్రూట్ ఎక్కడ కంప్రెషన్ అవ్వబడిందో నిర్ధారణ చెయ్యవచ్చును. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నొప్పి మాత్రలు తరచు వేసుకోవటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. (అసిడిటీ, అల్సర్, పర్ఫొరేషన్) హోమియో మందులు వాటి లక్షణాలు రస్టాక్స్: ఇది కండరాలు వాచి కలుగజేసే నొప్పికి సరియైన మందు. నొప్పులు చల్లగాలికి ఎక్కువవుతాయి. ఎడమవైపు వచ్చే సయాటికా నొప్పికి మంచి మందు. నొప్పితో పాటు తిమ్మిర్లు, స్టిఫ్నెస్ ఉండి నొప్పి తొడల నుండి క్రిందికి వ్యాపిస్తుంది. కూర్చొని లేస్తే నొప్పి విపరీతంగా ఉంటుంది. కొద్దిసేపు నడిచిన తరువాత ఉపశమనం ఇచ్చే మంచి ఔషదం. రస్టాక్స్ సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్‌కు కూడా మంచిది. కిలోసింథ్: నరాలు లాగినట్లుగా ఉండటం, భరింపరాని నొప్పి. ఈ నొప్పి పిరుదుల నుండి మోకాలు, పాదం వరకు పాకుతుంది. కదలినా, ముట్టుకున్నా... చల్లటి వాతావరణంలో నొప్పి ఎక్కువ అవుతుంది. వేడి,కాపు, ఒత్తిడి వల్ల నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కుడివైపు కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు. రోడోడెన్ డ్రెన్: సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఇది మంచి ఔషధం. నొప్పి ఎక్కువగా వేసవి వాతావరణంలో వస్తుంది. స్టిఫ్నెస్. ఎక్కువగా మెడ భాగంలో నొప్పి భుజాల వరకు పాకుతుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే నొప్పి. కాస్టికమ్: ముఖ్యంగా నరాల మీద పనిచేస్తుంది. కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి దాని లక్షణం. మెడ భాగంలో నొప్పి వుండి భుజాల మధ్య స్టిఫ్నెస్ ఉంటుంది. ఎడమవైపు వచ్చే సయాటికా నొప్పికి మంచి ఔషధం. హోమియో వైద్య విధానం సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఇవ్వబడుతుంది. కారణాన్ని బట్టి పరీక్షలలో అంటే ఎక్స్‌రే, ఎమ్మారై లలో... వెన్నుపూసలో డిస్క్ మరియు నరంలో ఏ విధమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ చేశాక సయాటికాకు సంపూర్ణ చికిత్సతో పాటు, ఏ ఆపరేషనూ లేకుండా చికిత్స ఉంది.