సయాటికా-సంపూర్ణ హోమియో చికిత్స | Homeo treatment for sciatica | Sakshi
Sakshi News home page

సయాటికా-సంపూర్ణ హోమియో చికిత్స

Published Wed, Sep 11 2013 11:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

సయాటికా-సంపూర్ణ హోమియో చికిత్స

సయాటికా-సంపూర్ణ హోమియో చికిత్స

 సయాటికా... ఈ పదాన్ని ఈ ఆధునికయుగంలో యుక్త, మధ్యవయస్సు వారిలో విననివారు ఉండరు. ఈ నొప్పి వర్ణనాతీతంగా భరింపరానిదిగా ఉండటమే కాకుండా వారి దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దీనిబారిన పడినవారే. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (Buro of labour Stastics) ప్రకారం 62 శాతం వరకు ఈ నొప్పి వల్ల తమ విధులకు గైర్‌హజర్ అవుతున్నారు. సయాటికాను త్వరగా గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స, దైనందిన జీవితంలో మార్పులు, ఫిజియోథెరిపీ, హోమియో మందులు, యోగా ద్వారా దీనిని పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా సయాటికా అంటే ఆపరేషన్ వరకు పోతుందేమోనని, ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుందేమోనని భయపడుతుంటారు. కానీ హోమియోలో ఏ విధమైన దుష్ర్పభావం లేని చికిత్స అందరికీ అందుబాటులో ఉంది.
 
 శరీరంలో అన్నిటి కంటే పెద్దది సయాటికా నరం. కింది వీపు భాగం నుండి పిరుదుల నుండి కాలు వెనుక భాగంలో ప్రయాణించే ముఖ్యమైన నరం ఈ సయాటికా నరం.
 
 ఈ నరం ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది. (ఔ4, ఔ5, 1, 2, 3) వెన్నుపూస లోపల నుండి ప్రయాణించే నరాలపై ఒత్తిడి వలన కాలు వెనుక భాగం నొప్పికి గురవుతుంది. దానినే ‘సయాటికా నొప్పి’ అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై పిరుదుల నుండి తొడ, కాలు వెనుక భాగం, మడమల వరకు పాకే అవకాశం ఉంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవటం, మంటలు, నడకలో మార్పు లాంటి లక్షణాలు చూడవచ్చును.
 
 కారణాలు
 నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వటం వలన నొప్పి వస్తుంది.
 
 స్పైనల్ డిస్క్ హెర్నియోషన్: ఔ4, ఔ5, నరాల రూట్స్ ఒత్తిడికి గురై, సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి సయాటికా నొప్పి వస్తుంది.
 
 స్పైనల్ స్టినోసిన్: ఎముకల్లో ఏర్పడే ఒత్తిడి వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది. దానివలన సయాటికా నొప్పి వస్తుంది.
 
 పెరిఫార్మిస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పెరిఫార్మిస్ కండరం నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటికా నొప్పి వస్తుంది.
 
 సాక్రొఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగా పనిచేయక సయాటికా నొప్పి రావచ్చు.
 
 ప్రెగ్నెన్సీ : ప్రెగ్నెన్నీ చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన సయాటిక నొప్పి వస్తుంది.
 
 పరీక్షలు
 డాక్టర్ సమక్షంలో కొన్ని వ్యాయామాలతో కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు.  వాటితో సయాటికా నొప్పి నిర్థారణ అవుతుంది.
     
 ఎమ్‌ఆర్ స్కాన్-డిస్క్ హెర్నియోషన్, డిస్క్ ప్రొలాప్స్, నిర్ధారణ, ఏనర్స్‌రూట్ ఎక్కడ కంప్రెషన్ అవ్వబడిందో నిర్ధారణ చెయ్యవచ్చును.
     
 నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నొప్పి మాత్రలు తరచు వేసుకోవటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రావచ్చు. (అసిడిటీ, అల్సర్, పర్‌ఫొరేషన్)
 
 హోమియో మందులు వాటి లక్షణాలు
 రస్‌టాక్స్: ఇది కండరాలు వాచి కలుగజేసే నొప్పికి సరియైన మందు. నొప్పులు చల్లగాలికి ఎక్కువవుతాయి. ఎడమవైపు వచ్చే సయాటికా నొప్పికి మంచి మందు. నొప్పితో పాటు తిమ్మిర్లు, స్టిఫ్‌నెస్ ఉండి నొప్పి తొడల నుండి క్రిందికి వ్యాపిస్తుంది. కూర్చొని లేస్తే నొప్పి విపరీతంగా ఉంటుంది. కొద్దిసేపు నడిచిన తరువాత ఉపశమనం ఇచ్చే మంచి ఔషదం. రస్‌టాక్స్ సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్‌కు కూడా మంచిది.
 
 కిలోసింథ్: నరాలు లాగినట్లుగా ఉండటం, భరింపరాని నొప్పి. ఈ నొప్పి పిరుదుల నుండి మోకాలు, పాదం వరకు పాకుతుంది. కదలినా, ముట్టుకున్నా... చల్లటి వాతావరణంలో నొప్పి ఎక్కువ అవుతుంది. వేడి,కాపు, ఒత్తిడి వల్ల నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా కుడివైపు కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు.
 
 రోడోడెన్ డ్రెన్: సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఇది మంచి ఔషధం. నొప్పి ఎక్కువగా వేసవి వాతావరణంలో వస్తుంది. స్టిఫ్‌నెస్. ఎక్కువగా మెడ భాగంలో నొప్పి భుజాల వరకు పాకుతుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే నొప్పి.
 
 కాస్టికమ్: ముఖ్యంగా నరాల మీద పనిచేస్తుంది. కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి దాని లక్షణం. మెడ భాగంలో నొప్పి వుండి భుజాల మధ్య స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఎడమవైపు వచ్చే సయాటికా నొప్పికి మంచి ఔషధం.
 
 హోమియో వైద్య విధానం
 సయాటికా నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి చికిత్స ఇవ్వబడుతుంది. కారణాన్ని బట్టి పరీక్షలలో అంటే ఎక్స్‌రే, ఎమ్మారై లలో... వెన్నుపూసలో డిస్క్ మరియు నరంలో ఏ విధమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ చేశాక సయాటికాకు సంపూర్ణ చికిత్సతో పాటు, ఏ ఆపరేషనూ లేకుండా చికిత్స ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement