ఆ ఒక్కరోజే 41వేల బైకుల అమ్మకం!
అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం సర్వసాధారణం. అందుకే దాన్ని ఆడవాళ్ల పండుగ అనుకుంటారు. కానీ, బంగారమే కాదు.. వివిధ రకాల వస్తువులు, వాహనాల కొనుగోళ్లకు కూడా ఆ రోజును శుభముహర్తంగా భావిస్తారు.
అందుకే.. అక్షయ తృతీయ రోజున.. అంటే ఏప్రిల్ 21న హోండా మోటార్ సైకిల్స్ కంపెనీ ఏకంగా 41వేల బైకులు అమ్మింది. గత సంవత్సరం ఇదే రోజున జరిగిన అమ్మకాలతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరుగుదల కనిపించినట్లు హోండా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ ఎస్ గెలెరియా తెలిపారు.