Honest person
-
పంజాబ్‌కు నిజాయితీపరుడైన సీఎం వస్తున్నారు
అమృత్సర్: పంజాబ్‌కు ఎన్నో ఏళ్ల తర్వాత నిజాయితీ పరుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ నిజాయితీతో కూడిన పాలనను అందిస్తుందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్‌తో కలిసి ఆదివారం ఆయన ఆప్ ఆధ్వర్యంలో అమృత్‌సర్‌లో చేపట్టిన రోడ్ షోలో పాల్గొన్నారు. తమ పార్టీకి ఘన విజయం సమకూర్చిన పంజాబ్ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయితీ పరుడైన వ్యక్తి సీఎం అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మాన్ చాలా నిజాయితీ పరుడు. నిజాయితీతో కూడిన పాలనను ప్రభుత్వం అందిస్తుంది. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను గౌరవిస్తుంది’ అని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలెవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే జైలుకు పంపిస్తామన్నారు. మాన్ ఒక్కరేకాదు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఇక ముఖ్యమంత్రేనన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్ బీర్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జిత్ చన్నీ, విక్రమ్ సింగ్ మజితియా వంటి స్వార్థపూరిత రాజకీయ నేతలకు పంజాబ్ ప్రజలు ఓటమి రుచి చూపించారని, ఇది కేవలం పంజాబీలకే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
యువకుడి నిజాయితీ: రూ.1.50లక్షలు తిరిగిచ్చాడు
టీ.నగర్: రోడ్డుపై పోగొట్టుకున్న లక్షన్నర రూపాయలను సంబంధిత వ్యక్తికి అప్పగించిన యువకుడిని పోలీసులు ప్రశంసించారు. మైలాడుదురై జిల్లా, తరంగంబాడి సమీపాన ఉన్న వెల్‌లైకోవిల్‌కు చెందిన వ్యక్తి రజనీసెల్వం. ఇతని భార్య సర్గుణ. వీరు తమ బిడ్డతోపాటు మోటార్‌సైకిల్‌పై వివాహపు నగల కొనుగోలుకు కారైక్కాల్ వెళ్లారు. ఆ సమయంలో చిన్న హ్యాండ్‌బ్యాగ్‌లో రూ.90 వేల నగదు, రూ.60 వేల విలువైన వెండి నగలు తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా సర్గుణ చేతిలోనున్న హ్యాండ్‌బ్యాగ్ హఠాత్తుగా కనిపించలేదు. భార్యాభర్తలు రోడ్డంతా వెదికినా లభించలేదు. దీనిగురించి వారు పొరైయూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సమయంలో దంపతులు పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను తరంగంపాడికి చెందిన యువకుడు క్రిస్టన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఇన్స్పెక్టర్ పెరియసామి, ఎస్ఐలు వెంకటాచలం, మురుగవేల్ కన్నన్ సమక్షంలో రజినీసెల్వం, సర్గుణ దంపతులకు రూ.లక్షన్నర విలువైన నగదు, నగలున్న హ్యాండ్‌బ్యాగ్‌ను క్రిస్టన్ అప్పగించాడు. ఆ యువకుడికి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, యువకుడు క్రిస్టన్‌ను పోలీసులు, స్థానికులు ప్రశంసించారు. -
కళ్లెదుటే డబ్బులున్నా చలించని ధనాజీ..
పుణే: ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతున్నా కొందరు మాత్రం దాని మోజుకు దూరంగానే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మహారాష్ట్రలోని సతారాకు చెందిన ధనాజీ జగ్దలే. తనకు ఓ బస్టాప్‌లో దొరికిన రూ.40 వేలను సొంతదారుకే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి రూ.వేయి బహుమతిగా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి, బస్సు చార్జీలకు కేవలం 7 రూపాయలు చాలన్నాడు. ధనాజీ నిజాయితీ మెచ్చిన సతారా ఎమ్మెల్యే శివేంద్రరాజే భోసలే, మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మరికొన్ని సంస్థలు అతనికి సన్మానం చేశాయి. ఎన్నారై ఒకరు రూ.5 లక్షలు ధనాజీకి బహుమతిగా ఇవ్వడానికి ముందుకురాగా ఆ సొమ్మును కూడా తీసుకోలేదు. ఒకరి డబ్బు తో తనకు సంతృప్తి కలగదని, మనుషులు నిజాయితీతో బతకాలని ధనాజీ సందేశమిచ్చాడు. -
నాపై... మీడియానే బురద జల్లుతోంది : కావూరి
విజయవాడ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజాయితీగా రాజకీయాల్లో ఉన్న తనపై మీడియా బురద జల్లుతోందని కావూరి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మీడియానే భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఓ ఛానల్ తనపై దుష్రచారం చేస్తోందని కావూరి సాంబశివరావు చెప్పినట్టు సమాచారం. -
నిజాయితీపరుడే.. కానీ ప్రధానిగా వద్దు!
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ రాజకీయ నేతల్లో అత్యంత నిజాయితీపరుడని, అయితే ఆయనకు శక్తిసామర్థ్యాలు లేవని, పనితీరు పేలవమని ఓ సర్వేలో తేలింది. మరో దఫా ఆయన ప్రధానిగా వద్దని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్లు ఇండియా టుడే-‘సీ’ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తే మన్మోహన్ ప్రధానిగా వద్దేవద్దని అత్యధిక మంది(60 శాతం) చెప్పారు. 30 శాతం మంది మాత్రమే ఆయన తిరిగి ప్రధాని కావాలన్నారు. నిజాయితీని పక్కనపెడితే ప్రధాని అభ్యర్థి విషయంలో మాత్రం గుజరాత్ సీఎం, బీజేపీ ఎన్నికల సారథి నరేంద్ర మోడీ.. మన్మోహన్‌నే కాకుండా మిగతా రాజకీయ నేతలందరినీ మించిపోయారు. అవినీతి సర్కారుకు నేతృత్వం.. ఈ నెల 2-10 మధ్య జరిగిన ఈ సర్వేలో దేశంలోని 28 రాష్ట్రాల నుంచి 15,815 మంది పాల్గొన్నారు. మన్మోహన్ అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడని 17 శాతం మంది ఒప్పుకున్నారు. ఆయన ప్రజలకు తాను చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా చేరవేయలేరని 21 శాతం, అవినీతి సర్కారుకు నేతృత్వం వహిస్తున్నారని 20 శాతం, అధికారం లేదని 21 శాతం, ఈ లోపాలన్నీ ఉన్నాయని 21 శాతం మంది తేల్చిచెప్పారు. కాగా, నిజాయితీ విషయంలో 16 శాతం మంది మద్దతుతో మోడీ, మన్మోహన్ తర్వాతి స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నిజాయితీపరులని 9 శాతం, అద్వానీ నిజాయితీపరుడని 6 శాతం మంది చెప్పారు. మన్మోహన్ పనితీరు పేలవంగా ఉందని 45 శాతం మంది అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పనితీరూ ఇలాగే ఉందని 43 శాతం మంది చెప్పారు. జనాదరణ తగ్గినా మోడీకే పట్టం.. మోడీ ప్రధాని కావాలని సర్వేలో పాల్గొన్న 45 శాతం మంది చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఇండియా టుడే-‘సీ’ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేతో పోలిస్తే వీరి సంఖ్య తగ్గడం గమనార్హం. ఆ సర్వేలో మోడీ ప్రధాని కావాలని 57 శాతం మంది చెప్పారు. తాజా సర్వేలో మోడీకి జనాదరణ తగ్గినా బీజేపీవైపు మొగ్గుచూపినవారి శాతం మాత్రం పెరిగింది. గత సర్వేలో ఆ పార్టీ సుస్థిర ప్రభ్వుత్వం అందిస్తుందని 24 శాతం మంది చెప్పగా తాజా సర్వేలో అది 33 శాతానికి పెరిగింది. రాహుల్ ప్రధాని కావాలని 32 శాతం మంది కోరుకున్నారు. గత సర్వేలో వీరి సంఖ్య 41 శాతం. బీజేపీ నుంచి ప్రధాని పదవికి మోడీనే పోటీ పడాలని తాజా సర్వేలో 51 శాతం మంది, అద్వానీ పోటీ పడాలని 18 శాతం మంది కోరుకున్నారు. కాంగ్రెస్‌లో ప్రధాని పదవికి రాహులే తగినవాడని 44 శాతం మంది, మన్మోహన్ మళ్లీ ఆ పదవి చేపట్టాలని 15 శాతం మంది చెప్పారు. మోడీ సుపరిపాలన అందిస్తున్నారని 25 శాతం, అభివృద్ధి సాధిస్తున్నారని 25 శాతం మంది చెప్పారు. గుజరాత్ అల్లర్లకు ఆయన క్షమాపణ చెప్పాలని 51 శాతం, వద్దని 38 శాతం మంది అన్నారు.