కళ్లెదుటే డబ్బులున్నా చలించని ధనాజీ.. | dhanaji Jagdale honest of returning 40 thousand rupees | Sakshi
Sakshi News home page

నిజాయితీయే నిలబెడుతుంది..

Published Mon, Nov 4 2019 6:05 AM | Last Updated on Mon, Nov 4 2019 8:18 AM

dhanaji Jagdale honest of returning 40 thousand rupees - Sakshi

పుణే: ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతున్నా కొందరు మాత్రం దాని మోజుకు దూరంగానే ఉంటారు. అలాంటి కోవలోకే వస్తాడు మహారాష్ట్రలోని సతారాకు చెందిన ధనాజీ జగ్దలే. తనకు ఓ బస్టాప్‌లో దొరికిన రూ.40 వేలను  సొంతదారుకే తిరిగి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి రూ.వేయి బహుమతిగా ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించి, బస్సు చార్జీలకు కేవలం 7 రూపాయలు చాలన్నాడు. ధనాజీ నిజాయితీ మెచ్చిన సతారా ఎమ్మెల్యే శివేంద్రరాజే భోసలే, మాజీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే, మరికొన్ని సంస్థలు అతనికి సన్మానం చేశాయి.  ఎన్నారై ఒకరు రూ.5 లక్షలు ధనాజీకి బహుమతిగా ఇవ్వడానికి ముందుకురాగా ఆ సొమ్మును కూడా తీసుకోలేదు. ఒకరి డబ్బు తో తనకు సంతృప్తి కలగదని, మనుషులు నిజాయితీతో బతకాలని ధనాజీ సందేశమిచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement