మీకు తెలుసా?
సూపర్... పారితోషికం
హాలీవుడ్ చిత్రాల్లో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే క్యారెక్టర్స్‌లో సూపర్ మ్యాన్ ఒకటి. 1978లో వచ్చిన తొలి ‘సూపర్ మ్యాన్’ చిత్రంలో అప్పటి ప్రముఖ నటుడు మార్లిన్ బ్రాండో సూపర్‌మ్యాన్‌కు తండ్రిగా కీలక పాత్ర చేశారు. ఆ పాత్ర తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఆయన 16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారు. అప్పట్లో 350 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం అంతకు ఐదింతలకు పైగా వసూలు చేసింది.