Honorary wages
-
రూ.5 వేలు జీతంతో మాజీ జడ్జిని అవమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా నియమితులయ్యే హైకోర్టు పూర్వ న్యాయమూర్తి గౌరవ వేతనం రూ.5 వేలుగా నిర్ణయించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా న్యాయవాదిగా ఎన్రోల్ అయిన యువ న్యాయవాది కూడా ఆ వేతనానికి విధులు నిర్వహించడని మండిపడింది. సర్కారు ఇచ్చే రూ.5 వేల కోసం పూర్వ హైకోర్టు న్యాయమూర్తులు ఎదురు చూస్తుంటారని భావిస్తున్నారా అంటూ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ తరహా చర్యలు పూర్వ న్యాయమూర్తులను అవమానపర్చడమేనంటూ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. అప్పీల్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించేందుకు పూర్వ న్యాయమూర్తి పేరు సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అయితే అందులో గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. ఈ లేఖను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధమైన సంస్థల చైర్మన్లుగా నియమితులయ్యే పూర్వ న్యాయమూర్తులకు... వారు సర్వీసులో ఉన్నప్పుడు పొందిన చివరి వేతనాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. ఈ నెల 27లోగా అప్పిలేట్ అథారిటీ చైర్మన్‌గా నియమించే వారికి కొత్త వేతనాన్ని నిర్ణయిస్తూ జీవో జారీచేయాలని స్పష్టం చేసింది. ఈ జీవో ఆధారంగా పూర్వ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలంటూ మరోసారి లేఖ రాయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. చదవండి: బరాబర్ ఆ నీళ్లు మావే! చదవండి: ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం -
10 నెలలుగా ‘గౌరవం’ లేదు!
నిధుల విడుదల్లో సర్కారు జాప్యం సకాలంలో అందని వేతనాలు ఇబ్బందుల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జోగిపేట: అందోలు నియోజకవర్గంలో అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాలున్నాయి. గ్రామ ప్రథమ పౌరుడిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గౌరవ వేతనాలు సకాలంలో చెల్లించకుండా ఆ గౌరవ పరుస్తోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే సర్పంచ్‌లు, ఎంపీటీసీలను మనస్తాపానికి గురిచేస్తోంది. ఎంపీటీసీలు, సర్పంచ్ల ఒత్తిడి మేరకు గౌరవ వేతనాన్ని రూ.5 వేలకు పెంచింది. గతంలతో ఎంపీటీసీలకు రూ.750 , సర్పంచ్‌లకు రూ.650 నెలసరి గౌరవ వేతనం ఉండగా తెలంగాణ ప్రభత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన తర్వాత 2015 సెప్టెంబర్ వరకే గౌరవ వేతనాలకు సంబంధించి నిధులను విడుదల చేసింది. 2016 ఆగస్టు వరకు చెల్లించాల్సిన 10 నెలల గౌరవ వేతనం విడుదల్లో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీల రవాణా చార్జీలను చెల్లించడంలేదు. ఇతర సదుపాయాలు కూడా కల్పించడం లేదు. సర్పంచ్‌లు అందుబాటులో లేని గ్రామాల్లో పాలన బాధ్యతలు భుజాన వేసుకునే ఉప సర్పంచ్‌లకు నయాపైసా విదల్చడం లేదు. మండలం సర్పంచ్‌లు ఎంపీటీసీలు అందోలు 21 10 పుల్కల్ 25 15 అల్లాదుర్గం 21 13 రేగోడ్ 19 10 రాయికోడ్ 25 12 మునిపల్లి 25 10 టేక్మాల్ 18 10 ప్రతి నెలా ఇవ్వాలి గతంలో ఉన్న వేతనాన్ని ప్రభుత్వం ఐదు వేల రూపాయలకు పెంచినందుకు సంతోషం. నెలనెలా పంపిణీ చేయకపోవడం ఇబ్బందిగా ఉంది. గౌరవ వేతనాన్ని ప్రతి నెలా చెల్లిస్తే గ్రామాల్లో సర్పంచ్‌లు చురుకుగా విధులు నిర్వర్తించడానికి ఆసక్తి చూపుతారు. - లక్ష్మి, రాంసానిపల్లి సర్పంచ్ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి 10 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయడంలో ఎంపీటీసీల పాత్ర ఎంతగానో ఉంది. ఎంపీటీసీల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. - రమేశ్‌గౌడ్, డాకూరు ఎంపీటీసీ నిధులు రాగానే చెల్లిస్తాం సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉంది. నిధులు రాగానే ప్రజాప్రతినిధులకు అందజేస్తాం. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ల సకాలంలో విడుదలయ్యేలా చూస్తాం. - కరుణశీల, అందోలు ఎంపీడీఓ -
32,000 కుటుంబాలకు పస్తులే
వీఆర్వో, వీఆర్ఏలకు అందని గౌరవ వేతనాలు హైదరాబాద్: గ్రామాల్లో పాలనకు కళ్లు, చెవులైన వీఆర్వోలు, వీఆర్ఏలను రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి రోజు కూడా పస్తులు ఉంచుతోంది. ఏకంగా 32 వేల మంది వీఆర్వోలు, వీఆర్ఏలకు డిసెంబర్ నెల గౌరవ వేతనాలు చెల్లించలేదు. వీరికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువగానే ఉంటుంది. వీరి గురించి రెవెన్యూ, ఆర్థిక శాఖలు పట్టించుకోవటం లేదు. వీరికి వేతనాలు రాకపోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయం ఓ కారణం కాగా ప్రస్తుతం నాల్గో త్రైమాసిక నిధుల విడుదలను నిలుపుదల చేయడం మరో కారణం. ఆర్థికశాఖకు అందని ప్రతిపాదనలు: వీఆర్వోలకు నెలకు రూ.13 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీఆర్ఏలకు నెలకు రూ.3,000 చొప్పున చెల్లిస్తున్నారు. గతంలో వీరికి 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను చెల్లించారు. అయితే వీఆర్వోలు, వీఆర్ ఏలు రెగ్యులర్ ఉద్యోగులు కానందున వారికి 010 పద్దు నుంచి వేతనాలు ఇవ్వరాదంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. 010 పద్దు నుంచి వేతనాలు రద్దు చేయడంతో డిసెంబర్ నెల వేతనం జనవరి 1వ తేదీన అందలేదు. రెవెన్యూ శాఖకు కేటాయించిన 284 పద్దు నుంచి వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసిక నిధులపై ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. గత మూడు త్రైమాసికాలకు చెందిన నిధుల వ్యయం ఆధారంగానే నాల్గో త్రైమాసిక నిధుల విడుదల విషయాన్ని ఆర్థికశాఖ నిర్ధారిస్తుంది. నిధుల విడుదలకు సీసీఎల్ఏ నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంటుంది. జనవరి నెల సగం కావస్తున్నా ఇంతవరకు ఈ ప్రతిపాదనలు వెళ్లలేదు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులను వివరణ కోరగా నిధులు విడుదల కోసం సంబంధిత శాఖ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని, వస్తే పరిశీలిస్తామని తెలిపారు. -
‘సర్పంచ్’లుగాఏడాది
ఆదిలాబాద్ అర్బన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు పదవీ చేపట్టి శనివారంతో ఏడాది పూర్తి అయ్యింది. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గతేడాది జూన్, జూలై నెలల్లో ఆరు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 2, 2013న కొత్తగా గెలుపొందిన వారు సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్, సార్వత్రిక, స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇంతలోనే ఏడాది గడిచింది. కొత్త ప్రభుత్వం జూన్ 2న కొలువుదీరింది. కానీ, ఏడాది గడుస్తున్నా సర్పంచ్‌లకు రావాల్సిన గౌరవ వేతనాలు రాలేదు. వస్తాయో.. రావో కూడా తెలియని పరిస్థితి. వేతనాలు చెల్లించాలని, పంచాయతీ అభివృద్ధికి రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తే అభివృద్ధికి దోహదపడుతుందని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం పంచాయతీలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. హామీల అమలులో విఫలం పంచాయతీలను అభివృద్ధి చెందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని పలువురు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. సాధారణ ఎన్నికలకు పది నెలల ముందే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. కొత్త సర్పంచ్‌లు పదవీ చేపట్టినా నిధుల విడుదల జాప్యం జరిగింది. దీంతో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్‌లు విఫలమయ్యారు. దీనికి కారణం.. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడమే. అయితే కొందరు సర్పంచ్‌లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తమ సొంత ఖర్చులతో గ్రామాల్లో బోర్వెల్లకు మరమ్మతులు, డ్రెయినేజీల పూడికతీత లాంటి చిన్న చిన్న పనులు చేయించుకుంటూ వచ్చారు. మొదటి సారిగా మే 17, 2014న జిల్లాకు రూ.19.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు సర్పంచ్‌లకు పూర్తిగా వినియోగంలోకి వచ్చాయి. వీటిని ఆయా గ్రామ పంచాయతీ జనాభా ప్రతిపాదికన విడుదల చేసేందుకు మరో నెల సమయం పట్టింది. ప్రస్తుతం గ్రామాలకు అభివృద్ధి నిధులు వచ్చి నెల రోజులు అవుతుందన్న మాట. అంటే ఏడాదిలో ప్రభుత్వం ఒక్కసారే అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వీధిదీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయి. డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయి. అభివృద్ధి పనులు మాత్రం జరగడం లేదు. రావాల్సిన వేతనాలు రూ.48.29 లక్షలు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ సర్పంచ్‌గా పదవీ చేపట్టి ఏడాది గడుస్తున్నా సర్పంచ్‌లకు రావాల్సిన గౌరవ వేతనం రాలేదు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు రూ.1,500, మైనర్ జీపీ సర్పంచ్‌లకు రూ.1000 ప్రతి నెల వేతనంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో సగం ప్రభుత్వం చెల్లిస్తే మిగతా సగం జీపీ నుంచి పొందాల్సి ఉంటుంది. ఏడాదిలో 11 నెలలకు సంబంధించిన వేతనాలు రూ.48.29 లక్షలు ప్రభుత్వం నుంచి సర్పంచ్‌లకు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారే పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే.. సర్పంచ్‌లకు ఒకే నెలకు సంబంధించిన వేతనం ఇవ్వడం శోచనీయం. కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.