hooks
-
హుక్..క్విక్..
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్, ప్రత్యేక క్యూఆర్ కోడ్ కేటాయింపుతో పాటు ఈసారి ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేసిన 38 క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్) అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. క్విక్ రిలీజ్ డివైజ్ (క్యూఆర్డీ) పేరుతో నగరానికి చెందిన శ్రీచక్ర ఇంజనీరింగ్ సంస్థ నిర్వాహకుడు మురళీధర్ డిజైన్ చేసి ఈ హుక్స్ కారణంగా విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడం తేలికైంది. గతేడాది ప్రయోగాత్మకంగా వాడిన ఈ హుక్స్ను ఈ ఏడాది పూర్తి స్థాయిలో వినియోగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న 38 క్రేన్లకు వీటిని ఏర్పాటు చేశారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేస్తున్నారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిన వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే రిలీజ్ అవుతాయి. విగ్రహాన్ని ఎక్కించే సమయాన్ని మినహాయిస్తే గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తవుతోంది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీ–లింక్ చేయాల్సి ఉండేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం ఉండేది. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేయగా, క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇతే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. -
ప్రెట్టీ పేపర్ క్లిప్స్
పిల్లలు హోం వర్క్ రాసుకునేటప్పుడు, ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు పేపర్స్ ఎగిరిపోకుండా ఏం వాడుతారు? మమ్మీ లేదా డాడీ ఇంట్లో సరుకుల చిట్టీ రాస్తున్నప్పుడు పేపర్లు అటూ ఇటూ పోకుండా ఉండేందుకు ఏం చేస్తారు? ఈ రెండింటికీ సమాధానం.. ‘పేపర్ క్లిప్స్’ వాడుతారు. ప్రస్తుతం ఇవి స్టీల్, గోల్డ్ కలర్లోనే కాక వివిధ రంగుల్లోనూ దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడేంటి అంటారా? ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూస్తే ఈ పేపర్ క్లిప్స్ టాపిక్ ఎందుకో అర్థమవుతుంది. ఆ జ్యుయెలరీ అంతా పేపర్ క్లిప్స్‌తో తయారు చేసినవే.. మీకూ కావాలా? అయితే ట్రై చేయండి.. కావలసినవి: పేపర్ క్లిప్స్, వివిధ రంగుల టేపులు, హుక్స్ (ఇయర్ రింగ్స్, చెయిన్ తయారీకి), పూసలు (కావాలనుకుంటేనే) తయారీ విధానం: ముందుగా బ్రేస్లెట్, చెయిన్ తయారీ చూద్దాం.. కొన్ని పేపర్ క్లిప్స్‌ను తీసుకొని, కొన్నిటికి బ్లూ కలర్ టేప్, మరికొన్నిటికి ఆరెంజ్ కలర్ టేప్‌ను చుట్టండి. తర్వాత వాటిని ఒకదానికొకటి తగిలించండి. అలా మీకు కావలసిన సైజులో బ్రేస్లెట్, చెయిన్‌ను తయారు చేశాక, వాటి చివరి క్లిప్‌కు మొదటి క్లిప్‌ను తగిలిస్తే సరి. చాలా సులభంగా ఉంది కదూ వీటి తయారీ. అలాగే రంగురంగుల క్లిప్స్‌ను గుత్తిగా చేసి, వాటికి పూసలు తగిలించి హుక్ పెట్టేస్తే అందమైన ఇయర్ రింగ్స్ కూడా రెడీ అవుతాయి. అంతేకాకుండా గోల్డ్ కలర్ క్లిప్స్‌ను తీసుకొని ఒకదానికొకటి వరుసగా తగిలించుకుంటూ పోతే.. ఎంతో అందమైన నెక్లేస్ తయారవుతుంది. ఇంకెందుకు వెయిటింగ్.. ఇంట్లో ఉన్న పేపర్ క్లిప్స్ తీసుకొని జ్యుయెలరీ మేకింగ్ స్టార్ట్ చేయండి.