horror drama
-
కరోనా : రిలాక్స్ అవ్వాలంటే జపాన్‌కి..
టోక్యో : కరోనా మహమ్మారి కంటే భయమే ఎక్కువ ప్రమాదకరం. తమకు కరోనా సోకుతుందేమా అన్న భయంతోనే కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు చూశాం. దీంతో కోవిడ్ నుంచి దృష్టి మళ్లించి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో జపాన్‌లోని ఓ ఈవెంట్ మేనేజింగ్ సంస్థ దీనికి అనుగుణంగా ఓ హార్రర్ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ శవపేటికలో పడుకుంటే భయానక అరుపులు వినిపిస్తాయి. అంతేకాకుండా ఈ పెట్టె బయటినుంచి కొందరు వ్యక్తులు దెయ్యాలుగా మిమ్మల్ని భయపెడుతుంటారు. " స్కేర్ స్క్వాడ్'' పేరుతో ఉండే ఈ షోలో 15 నిమిషాల సేపు గడపొచ్చు. దీంతో కోవిడ్ అనే భయం నుంచి కాసేపు ఉపశమనం పొందవచ్చు అని ఈవెంట్ నిర్వాహకులు కెంటా ఇవానా తెలిపారు. (ఆకలి చచ్చిపోయింది.. ఇంకోసారి ఇలా చేయకండి) కరోనా వల్ల ప్రజల్లో నెలకొన్న ఒత్తిడిని వదిలించేందుకు మాదో చిన్న ప్రయత్నం అని అన్నారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించేలా ప్లాస్టిక్ షీల్డ్‌లు, గ్లవుజులు వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వారాంతాల్లో నిర్వహించే ఈ హార్రర్ షోలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వారు సైతం ప్రత్యామ్నాయలను వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలకు ఉపశమనంతో పాటు తమకు కూడా మంచి ఆదాయం లభిస్తోందని తెలిపారు. 'శవపేటికలో పడుకున్నాక అసలు భయట ఏం జరుగుతుంది, కోవిడ్ పరిస్థితులు అన్న ఆలోచనలు ఏమీ రాలేదు. అక్కడ ఉన్నంతసేపు హార్రర్ సినిమాని ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తుంది. చాలా రిలాక్స్ అయ్యాను' అని ఓ కస్టమర్ వివరించారు. ఇక జపాన్‌లో గడిచిన 24 గంటల్లో 1034 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. (డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్ సిగ్నల్!) -
‘రచయిత’ మూవీ రివ్యూ
టైటిల్ : రచయిత జానర్ : పీరియాడిక్ డ్రామా తారాగణం : విద్యాసాగర్ రాజు, సంచితా పదుకొనే, శ్రీధర్ వర్మ సంగీతం : షాన్ రెహమాన్ దర్శకత్వం : విద్యాసాగర్ రాజు నిర్మాత : కళ్యాణ్ దూళిపాల్ల ప్రయోగాత్మక చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో అదే జానర్ లో తెరకెక్కిన మరో ఆసక్తికర చిత్రం రచయిత. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. 1954 నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచితా పదుకొనే కీలక పాత్రలో నటించారు. పాటల రచయిత చంద్రబోస్, సీనియర్ నటుడు జగపతి బాబులు సపోర్ట్ చేయటంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన రచయిత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? ఈ ప్రయోగం ఎంత వరకు ఫలించింది..? కథ : ఆదిత్య వర్మ(విద్యాసాగర్ రాజు) ప్రముఖ కథా రచయిత. ఎన్నో విజయవంతమైన కథలు రాసిన ఆదిత్య వర్మ తన కొత్త కథను భయం నేపథ్యంలో రాయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం జనజీవనానికి దూరంగా ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. అదే సమయంలో 13 ఏళ్ల తన ప్రేమను గెలిపించుకునేందుకు పద్మావతి(సంచిత పదుకొనే) తల్లిదండ్రులను కలుస్తాడు. అప్పటికే పద్మావతికి మనోహర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అవుతుంది. కానీ ఓ ప్రమాదంలో మనోహర్ చనిపోవటంతో ఆ విషయాలను ఆదిత్య వర్మకు చెప్పకుండా పద్మావతిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఆమె తల్లిదండ్రులు. ఊరు మారితే ఆమె ఆలోచనలు మారుతాయన్న నమ్మకంతో ఆదిత్య వర్మతో పాటు పంపిస్తారు. పద్మావతి తన గతాన్ని మర్చిపోయి ఆదిత్య వర్మకు దగ్గరయ్యే సమయంలోనే ఆదిత్య వర్మ తన కథ మొదలు పెడతాడు. పద్మావతి జీవితంలో జరిగిన సంఘటనలే ఆదిత్య కథగా రాస్తుండటంతో పద్మావతిలో భయం మొదలవుతుంది. ఆదిత్య వర్మ రాసిన కథ ప్రకారం చనిపోయిన మనోహర్ తనకోసం ఆత్మగా మారాడని భయపడుతుంది. నిజంగానే మనోహర్ దెయ్యంగా మారాడా..? అసలు మనోహర్ ఎలా చనిపోయాడు..? చివరకు ఆదిత్య వర్మ, దీపికలు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా ప్రధానంగా రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కీలకమయిన రచయిత పాత్రలో విద్యాసాగర్ రాజు మంచి నటన కనబరిచాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ తో కథను ముందుకు నడిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సంచిత పదుకొనే మంచి నటన కనబరించింది. భయానికి, ప్రేమకు మధ్య నలిగిపోయే అమ్మాయి పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. 50ల కాలం నాటి అమ్మాయిగా హుందాగా కనిపించి మెప్పించింది. అదే సమయంలో గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీధర్ వర్మ పరవాలేదనిపించాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఆదిత్య వర్మ దగ్గర శిష్యరికం చేసేందుకు వచ్చిన నటుడు మాత్రం తన అతితో కాస్త విసిగిస్తాడు. విశ్లేషణ : ఓ రీవేంజ్ డ్రామాకు 1954 నాటి నేపథ్యం తీసుకున్న దర్శకుడు కథనాన్ని ఆసక్తికరంగా నడిపించటంలో విజయం సాధించాడు. ఆ కాలం నాటి పరిస్థితులను, దుస్తులు, వాతావరణం చూపించేందుకు చిత్రయూనిట్ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అయితే డిటెయిలింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహిరంచి ఉంటే బాగుండేది. తను చెప్పాలను కున్న విషయాన్ని ప్రేక్షకులకు పోయటిక్‌గా చెప్పాలన్న ఉద్దేశంతో అవసరానికి మించిన డైలాగ్ లు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో పాత్రలు అవసరానికి మించి డైలాగ్ లు చెప్తూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. కొన్ని సందర్భాల్లో నటీనటుల హావభావాలు కూడా 50ల కాలం నాటి సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తాయి. గ్రాఫిక్స్ మాత్రం ఆకట్టుకునేలా లేవు. కారు ప్రయాణంలో వచ్చే సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి. షాన్ రెహమాన్ అందించిన స్వరాలతో పాటు చంద్రబోస్ సాహిత్యం బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు, సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా, కథనం పాటలు మైనస్ పాయింట్స్ : కొన్ని సన్నివేశాల్లో విసిగించే డైలాగ్స్ గ్రాఫిక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
హారర్ చిత్రంలో శ్రావ్య
ఇటీవల కోలీవుడ్‌లో ప్రేమ, హాస్యం,యాక్షన్ కథా చిత్రాలు వస్తున్నా హారర్ కథా చిత్రాలదే హవా అని చెప్పక తప్పదు. ఆ కోవలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ గోవింద్ స్టూడియో పతాకంపై విక్రమ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నటి శ్రావ్య దెయ్యంగా పాత్రను పోషిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో రతన్మైళి, సుజాకుమార్, రాంజీ, చిత్రాలక్ష్మణన్, ఎంఎస్.భాస్కర్, లివింగ్స్టన్, శ్యామ్,వైయాపురి, విజయరాజ్కీర్తీ, ఆర్.వినోద్‌కుమార్, రేఖ, నిరోషా, మధుమిత నటిస్తున్నారు. ఇంతకుముందు 13ఆమ్ పక్కం పార్క చిత్రాన్ని తెరకెక్కించిన పుగళ్మణి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ 13వ తేదీ శుక్రవారం సైతానులకు సంతోషాన్ని, సకల శక్తిని అందించే రోజు అంటారన్నారు. అలాంటి రోజున హీరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ ముహూర్తాన పెళ్లి పీటలపై కూర్చుంటాడని చెప్పారు. అప్పుడు పెళ్లి కూతురు రూపంలో ఒక రక్తపిశాచి వచ్చి కూర్చుంటుందన్నారు.అయితే ఆ వివాహాన్ని ఆపడానికి 13 దెయ్యాలు ప్రయత్నిస్తాయన్నారు. వాటి ప్రయత్నం ఫలించిందా? అసలు అలాంటి ముహూర్తంలో హీరో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? ఆ పిశాచితో అతని పెళ్లి అయ్యిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ చిత్రం అని చెప్పారు. ఆద్యంతం ఆసక్తికరంగా హారర్ సన్నివేశాలతో భయం పుట్టించే ఈ చిత్రంలో మరో ముఖ్య అంశం 150 అడుగు పొడవైన దేవతా విగ్రహ శిల చోటు చేసుకోవడం అన్నారు. ఇది చిత్రం చూసే ప్రేక్షకులకు పూనం వచ్చే విధంగా ఉంటుందన్నారు. తాజ్‌నూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.