టోక్యో : కరోనా మహమ్మారి కంటే భయమే ఎక్కువ ప్రమాదకరం. తమకు కరోనా సోకుతుందేమా అన్న భయంతోనే కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు చూశాం. దీంతో కోవిడ్ నుంచి దృష్టి మళ్లించి ప్రజల్లో భయాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో జపాన్‌లోని ఓ ఈవెంట్ మేనేజింగ్ సంస్థ దీనికి అనుగుణంగా ఓ హార్రర్ షోను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా కస్టమర్ శవపేటికలో పడుకుంటే భయానక అరుపులు వినిపిస్తాయి. అంతేకాకుండా ఈ పెట్టె బయటినుంచి కొందరు వ్యక్తులు దెయ్యాలుగా మిమ్మల్ని భయపెడుతుంటారు. " స్కేర్ స్క్వాడ్'' పేరుతో ఉండే ఈ షోలో 15 నిమిషాల సేపు గడపొచ్చు. దీంతో కోవిడ్ అనే భయం నుంచి కాసేపు ఉపశమనం పొందవచ్చు అని ఈవెంట్ నిర్వాహకులు కెంటా ఇవానా తెలిపారు. (ఆకలి చచ్చిపోయింది.. ఇంకోసారి ఇలా చేయకండి)
కరోనా వల్ల ప్రజల్లో నెలకొన్న ఒత్తిడిని వదిలించేందుకు మాదో చిన్న ప్రయత్నం అని అన్నారు. అంతేకాకుండా సామాజిక దూరం పాటించేలా ప్లాస్టిక్ షీల్డ్‌లు, గ్లవుజులు వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వారాంతాల్లో నిర్వహించే ఈ హార్రర్ షోలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వారు సైతం ప్రత్యామ్నాయలను వెతుక్కుంటున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజలకు ఉపశమనంతో పాటు తమకు కూడా మంచి ఆదాయం లభిస్తోందని తెలిపారు. 'శవపేటికలో పడుకున్నాక అసలు భయట ఏం జరుగుతుంది, కోవిడ్ పరిస్థితులు అన్న ఆలోచనలు ఏమీ రాలేదు. అక్కడ ఉన్నంతసేపు హార్రర్ సినిమాని ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తుంది. చాలా రిలాక్స్ అయ్యాను' అని ఓ కస్టమర్ వివరించారు. ఇక జపాన్‌లో గడిచిన 24 గంటల్లో 1034 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. (డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్ సిగ్నల్!)
Comments
Please login to add a commentAdd a comment