టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ను ఏ ఆతిథ్య దేశమైనాసరే ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ముందుగా నిర్వహించే ‘టార్చ్ రిలే’ను అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా అన్నీ ఆతిథ్య దేశాల్లోనూ ఇదే జరిగింది. కానీ కొత్తగా కరోనా మహమ్మారి దాపురించిందిగా... అందుకే అంతా ఆవిరైంది. అట్టహాసం అటకెక్కింది. అతిరథులు ఇంటి గుమ్మం కూడా దాట లేని పరిస్థితి. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ విదేశీ ప్రేక్షకులకు దూరమైంది. కేసుల పరంగా చూ స్తుంటే స్వదేశీ ప్రేక్షకులకు కూడా ‘నో ఎంట్రీ’ తప్పదేమో! ఇక టార్చ్ రిలే సంగతి చూస్తే అది కూడా మొక్కుబడిగా జరుగుతోంది. కరోనా జపాన్ కలల్ని చిదిమేస్తోంది.ఏ
కాగా, మంగళవారం ఒసాకా నగరంలో ఒలింపిక్స్ టార్చ్ రిలే జరిగింది. జపాన్‌లోని తీరప్రాంతంలో అతి పెద్ద మహానగరం ఒసాకా. ఆధునిక ఆర్కిటెక్చర్‌తో మేఘాలను ముద్దాడే ఆకాశ హర్మ్యాలతో ఈ నగరం విరాజిల్లుతుంది. ఇలాంటి మహానగరంలో టా ర్చ్ రిలే జరిగితే ఆ వేడుక ప్రి ఒలింపిక్స్‌ను తల పించాలిగా... కానీ మహమ్మారి వల్ల మంగళ వారం ఒసాకా సిటీ పార్క్‌లో జరిగిన క్రీడాజ్యోతి ఏకాకిలా తిరుగాడింది. కేవలం ఎంపిక చేసిన అతికొద్ది మంది జపాన్ అథ్లెట్లు మాత్రమే జ్యోతి నందుకున్నారు. కేసుల తీవ్రత ఈ నగరంలో ఎక్కువ ఉండటంతో ప్రజలెవర్నీ ఈవెంట్‌కు అను మతించలేదు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో ఒసాకాలోనే 1099 మంది వైరస్ బారిన పడటం ప్రభుత్వాధికారుల్ని కలవరపెడుతోంది.
చదవండి: కరోనా నాలుగో వేవ్: రద్దు, లేదంటే వాయిదా!
ఆసియా ప్లేయర్‌కు తొలిసారిగా టైటిల్.. సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment