
టోక్యో ఒలింపిక్స్ 2020 జ్యోతి బయల్దేరిన నాటి దృశ్యం
టోక్యో: గత సంవత్సరం నుంచి ఈ ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడమో... లేక మరోసారి వాయిదా వేయడమో చేయాలంటూ 70 శాతం మంది జపాన్ వాసులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. జపాన్‌లో కరోనా నాలుగో వేవ్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణపై మీ అభిప్రాయం ఏమిటంటూ క్యోడో అనే న్యూస్ ఏజెన్సీ ఏప్రిల్ 10, 12 తేదీల్లో ఒక సర్వేను నిర్వహించింది.
ఇందులో పాల్గొన్న జపనీయుల్లో... 39.2 శాతం మంది ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడాన్ని సమర్థించగా... 32.8 శాతం ప్రజలు మరో వాయిదాను కోరుకున్నారు. కేవలం 24.5 శాతం మంది మాత్రమే అనుకున్న షెడ్యూల్‌లోనే క్రీడలను నిర్వహించాలని కోరుకున్నారు. విశ్వ క్రీడల కౌంట్‌డౌన్ 100 రోజులకు చేరుకోగా... సోమవారం నుంచి నెల రోజుల పాటు పాక్షిక–అత్యవసర పరిస్థితిని విధిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి ఈ మెగా ఈవెంట్ జరిగే విషయంపై సందిగ్ధత నెలకొంది.
చదవండి: ఏంటి బాబూ.. ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా?!
ఒలింపిక్స్ బెర్త్‌కు కాంస్యాలు సరిపోలేదు
Comments
Please login to add a commentAdd a comment