వర్ణం: అశ్వసామర్థ్యం
మనిషికి కావాల్సిన ముఖ్యమైన మూడు... కూడు, గూడు, గుడ్డ అయితే, మరి నాలుగోది? వినోదం! ఎన్నో రూపాల్లో వినోదం పొందుతాడు మనిషి. ఈ గుర్రాల పోట్లాట కూడా అట్లాంటిదే! ఫిలిప్పీన్స్లోని మగైండనావో ప్రాంతంలోనిదీ దృశ్యం. పది లక్షలకు మించని జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో టీవీ, సినిమాలు, ఇంటర్నెట్ ఏమీలేవు. శతాబ్దాలుగా ఈ వినోదక్రీడ సాగుతోంది. అక్కడ మహిళలు, పిల్లలు కూడా గుర్రం వేసుకుని వెళ్లిపోగలరు.