Hostel Room
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్ మోహన్‌సింగ్ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్ మోహన్‌సింగ్ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్ అ«ధికారి, నిర్మల్) కూతురు రాథోడ్ దీప్తి(19) కళాశాల హాస్టల్లోనే ఉంటూ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీజీవీపీ, టీఎస్ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసినట్టు తెలిపారు. -
ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హత్నూర (సంగారెడ్డి): వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ పంచాయతీ రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా.. కల్వకుర్తికి చెందిన అనకాపల్లి రాజశేఖర్, అరబింద దంపతుల కుతూరు సహస్ర(17) రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కొద్ది నెలల నుంచి కళాశాలలో సీనియర్ విద్యార్థినులు తనను తరచూ ఇబ్బంది పెడుతున్నానని, తనకు కళాశాల కూడా నచ్చడం లేదని సహస్ర తండ్రి రాజశేఖర్‌కు చెప్పింది. దీంతో 15 రోజుల కిందట రాజశేఖర్ కళాశాల ఏఓ భిక్షపతితో మాట్లాడారు. ఈ మేరకు హాస్టల్లో మహిళా వార్డెన్ లేకపోవడంతో తన ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలే తెలియక సహస్ర ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే గదిలో ఉంటున్న తోటి విద్యార్థిని స్రవంతి ఫ్యాన్‌కు వేలాడుతున్న సహస్రను చూసి కేకలు వేయగా మిగతా మేల్కొని ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే ఏఓ భిక్షపతి వచ్చి యాజమన్యంతో పాటు విద్యార్థిని తండ్రి రాజశేఖర్‌కు ఫోన్లో సమాచారమిచ్చారు. దీంతో వారు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, సహస్ర మతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. ‘ఈ కళాశాల నచ్చడం లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితులు లేరు. ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్తుదామంటే.. ఫ్యామిలీ ఇబ్బందులు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న. వీలైతే నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చూసుకోండి. వాడిని మాత్రం హాస్టల్లో వేయకండి’ అంటూ ఉందని పోలీసులు తెలిపారు. అయితే, కళాశాల యాజమాన్యం, ఏఓ భిక్షపతి వేధింపులే తన కుతూరు ఆత్మహత్యకు కారణమని సహస్ర తండ్రి రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి: నగరంలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ హస్టల్ గదిలో విద్యార్థిని శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు కాలేజీ సిబ్బందికి తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని పేరు స్వాతి అని పోలీసులు తెలిపారు. ఆమెది కడప జిల్లా స్వస్థలం అని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కుమార్తె మృతికి హాస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. -
భూకంపం భయంతో దూకేసింది
శ్రీనగర్: దేశాన్ని కుదిపేసిన భూకంపం కశ్మీర్‌లోని కాలేజీలు, ఇతర విద్యాలయాల్లో కూడా ఉద్రిక్తతను రాజేసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఓ కాలేజీ విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఓ అమ్మాయి కాలేజీ హాస్టల్ మొదటి అంతస్తు నుంచి దూకేసింది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకపోయినా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎంఎ రోడ్ విమెన్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ అమ్మాయిలంతా వైవా టెస్టుకు ప్రిపేర్ అవుతున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో ఆకస్మాత్తుగా భూమి కంపించడాన్ని గమనించిన విద్యార్థినులు బయటికి పరుగులు తీశారు. బీఎ మొదటి సంవత్సరం చదువుతున్న మరో అమ్మాయి మాత్రం ఈ గందరగోళంలో హాస్టల్ భవనం నుంచి దూకేసింది. ఈ వార్తను ధ్రువీకరించిన కాలేజీ ప్రిన్సిపల్.. ఆమెను ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాకు చెందిన అమ్మాయిగా గుర్తించామని, ఆమె బంధువులకు సమాచారం అందించామని తెలిపారు. అటు భూకంపం వార్తలతో తల్లిదండ్రులు కూడా స్కూళ్లకు పరుగులు పెట్టారు. తమ బిడ్డలను కళ్లారా చూసేదాకా వారి ప్రాణాలు నిలువలేదు. తాను స్కూలుకెళ్లేసరికి పిల్లలు, టీచర్లు అంతా షాక్ లో ఉన్నారని, అక్కడి పరిస్థితి అంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని జావేద్ అహ్మద్ అనే పేరెంట్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు పరిస్థితి అదుపులో ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షా ఫజల్ తెలిపారు. విద్యాలయాల నుంచి నివేదికలు సేకరిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
సేలం: సేలంలోని ఓ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి పోసుకుని వేలాడుతున్న స్థితి అనుమానాలకు తావిస్తోంది. సేలం శంకగిరికి చెందిన పన్నీరు సెల్వం, ఉమా దంపతుల కుమార్తె ప్రియదర్శిని చిన్నప్పం పట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో తొ మ్మిదో తరగతి చదువుతోంది. శుక్రవారం ఆమెను ఆ పాఠశాల్లో చేర్పిం చారు. ఆ పాఠశాలకు చెందిన హాస్టల్లో ఆమెకు బస సౌకర్యం కల్పించా రు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉద యం ప్రియదర్శిని శవంగా మారింది. దుపట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ హాస్టల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, కిటికీలకు ఉ న్న ఇనుప రాడ్డు సాయంతో దుపట్టా ను ఉపయోగించి గొంతు బిగిసి ఉం డడం, రెండు కాళ్ల మోకాళ్లు నేలను తాకుతుండడంతో అనుమానాలు బ యల్దేరాయి. అయితే, స్కూలుకు ఆల స్యంగా వెళ్లినందుకు టీచరు మందలించినట్టు అందుకే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టుగా హాస్టల్ వర్గా లు పేర్కొంటున్నాయి. అయితే, ఆ బాలిక మృతి మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తూ ఆ పరిసరవాసులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కారుల్ని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమిం చాల్సి వచ్చింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.