పాలిటెక్నిక్ ప్రాంగణంలో బీసీ హాస్టళ్లు
ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు
హన్మకొండ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ పాలిటెక్నిక్ కశాళాల ఆవరణలో కొత్తగా రెండు బీసీ సంక్షేమ హాస్టల్ భవనాలు నిర్మిం చనున్నారు. ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు కేటాయిస్తారు. ఒక్కో భవన నిర్మాణానికి కేంద్ర సాంకేతిక విద్యాశాఖ నుంచి రూ.2.50 కోట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రెండు హాస్టళ్లలో బీసీలతో పా టు ఇతర విద్యార్థులకు సమానంగా సీట్లు కే టాయిస్తారు. ఒక్కో హాస్టల్లో విద్యార్ధుల గరి ష్ట పరిమితి 100 మందిగా ఉంటుంది. అయి తే ప్రస్తుతం పాలిటెక్నిక్ ప్రాంగణంలో నిర్మిం చబోయే హాస్టళ్లలో విద్యార్థుల పరిమితిలో మినహాయింపు ఇస్తున్నారు. ఒక్కో హాస్టల్లో 200 మంది ఉండే అవకాశం ఉంటుంది. వీరిలో సగం మంది పాలిటెక్నిక్, మిగతా సగం ఇతర కళాశాలల్లో చదివేవారు ఉండేలా పాలిటెక్నిక్, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. భవనాల నిర్వహణ బాధ్యతలు బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తుంది.
గ్రేటర్లో కొత్తగా నాలుగు హాస్టళ్లు..
జిల్లాలో ఇప్పటికే కాలేజీ హాస్టళ్లు ఉన్నప్పటికీ నగరంలో విద్యార్థులకు సరిపడనంతగా లేవు. దీంతో గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా కాలేజీ హాస్టళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని బీసీ సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రెండు బాలుర, రెండు బాలికల కాలేజీ హాస్టళ్ల చొప్పున అవసరమని నివేదిక పంతున్నట్లు డీబీసీడబ్ల్యూఓ హృషికేష్‌రెడ్డి తెలిపారు. ఇంతకాలం బీమారంలో కొనసాగిన వర్ధన్నపేట నియోజక వర్గ బాలికల కళాశాల హాస్టల్‌ను న్యూశాయంపేటలోని కొత్త భవనంలోకి మార్చినట్లు చెప్పారు.