hotel mourya
-
ఆ హోటల్లో ట్రంప్ విడిది.. ఒక రాత్రి ఖర్చు..
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం పలకడానికి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అగ్రజుని హోదాకు తగ్గట్లు మార్పు చేర్పులతో ఆకట్టుకునేలా ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ట్రంప్ భారత్ రాక సందర్బంగా ఆయనకు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ట్రంప్ దంపతులు బస చేయబోయే హోట్‌ల్ గదికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ దంపతులు అహ్మదాబాద్, ఆగ్రా పర్యటనల అనంతరం ఢిల్లీకి చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. వీరికోసం ఢిల్లీ ఐటీసీ మౌర్యా హోటల్లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్‌చేసింది. ఒక రాత్రికి ఆ సూట్లో ఉండటానికి అయ్యే ఖర్చు అక్షరాల 8 లక్షల రూపాయలు. అమ్మో అంత ఖర్చా! అంటూ నెటిజన్లు కూడా నోరెళ్లబెతున్నారు. ‘పెద్దన్నంటే మాటలు కాదుగా మరి.. ఆ మాత్రం ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (ట్రంప్ పర్యటన : సీక్రెట్ ఏజెన్సీ పనేంటంటే..) ఇంతకీ ఆ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ ప్రత్యేకతలేంటంటే.. సిల్క్ ప్యానెల్డ్ గోడలు, వుడెన్ ఫ్లోరింగ్, అదిరిపోయే కళాకృతులు, సౌకర్యవంతమైన లివింగ్ రూం, ప్రత్యేకమైన డైనింగ్ గది, విలాసవంతమైన రెస్ట్‌రూం, మినీ స్పా, పర్శనల్ జిమ్ ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన 55 అంగుళాల హై డెఫినిషన్ టీవీ, ఐపాడ్ డాకింగ్ స్టేషన్, ఆహారాన్ని పరీక్షించేందుకు మైక్రోబయోలాజికల్ లాబొరేటరీ, బయట వైపు గాలి విషతుల్యంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం స్వచ్ఛమైన గాలిని అందించే ఫిల్టర్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్‌లు బస చేశారు. కాగా, మరి కొద్ది గంటల్లో ట్రంప్ భారత గడ్డమీద అడుగుపెట్టనున్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ట్రంప్ దంపతులు అహ్మదాబాద్ చేరుకుంటారు. అహ్మదాబాద్ పర్యటన ముగిసిన వెంటనే కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రా సందర్శనకు వెళతారు. ( ‘మేడమ్ ఎక్కడా!!’? ) చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ -
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి
- ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే సహించం - ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సంతకాల సేకరణ - ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ కర్నూలు(అర్బన్): ఆర్యవైశ్యుల్లోని పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీజీ భరత్ తెలిపారు. ఆర్యవైశ్యులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్ పరిణయ హాలులో ఆదివారం జిల్లా ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాయతీగా పన్నులు చెల్లించేది ఆర్యవైశ్యులే అయినా అనేక మంది పేదలున్నారని, వారి కోసం రూ.1000 కోట్లతో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైతే లక్షల సంఖ్యలో సంతకాలు సేకరించడంతో పాటు పాలక, ప్రతిపక్ష నేతలకు ఉత్తరాలు రాస్తామని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ శాతం ఉన్న బ్రాహ్మణులకు రూ.75 కోట్లు, కాపులకు రూ.1000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 10 శాతంగా ఉన్న ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీరాలన్నారు. ఈ నేపథ్యంలోనే సమితి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన ఇల్లూరు సుధాకర్, ఎం విఠల్‌శెట్టి, కోశాధికారి సత్యనారాయణ, అదనపు కార్యదర్శిగా జవహర్‌బాబుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇల్లూరు సుధాకర్ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ చిన్న వ్యాపారులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్యవైశ్యులను ఎకనామికల్ బ్యాక్వర్డ్గా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కమిటీ నేతలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీజీ శివరాజ్, పెండేకంటి కిరణ్, విట్టా రమేష్, మహిళా అధ్యక్షురాలు టి. జ్ఞానేశ్వరి, పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి కిరణ్, ఇల్లూరు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.