నేడు, రేపు ‘సాక్షి’ ప్రాపర్టీ షో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరంలో సొంతిల్లు ఉండాలనుకునే వారి కోసం ‘సాక్షి’ సదవకాశాన్ని కల్పిస్తోంది. శని, ఆది వారాల్లో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఉ. 10 గంటలకు ‘ప్రాపర్టీ షో’ నిర్వహించనుంది. తెలంగాణ రాష్టం ఏర్పడి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ప్రాపర్టీ షో ఇదే.
అపర్ణ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్‌గా, హిల్ కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ కో- స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో నగరంలోని పలు నిర్మాణ సంస్థలు తమ ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, ఇండివిడ్యువల్ హౌస్‌ల నమూనాలను ప్రదర్శించనున్నాయి.