house collapes
-
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
రాజస్థాన్లో ఘోర ప్రమాదం : ముగ్గురి దుర్మరణం..
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదంచోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భవంతి, నిన్న రాత్రి(ఆదివారం) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగినప్పుడు భవనంలో 8 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక పీబీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ క్రమంలో ముగ్గురు కూలీలు అప్పటికే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, భవంతి కూలడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, ట్రాఫిక్ నియంత్రించడం వంటి సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నాలుగు రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే.. -
టౌటే ఎఫెక్ట్: కుప్పకూలిన ఇల్లు.. నలుగురి ప్రాణాలు
లక్నో: టౌటే తుఫాను ప్రభావంతో ఎడతెరపి లేకుండ కురుస్తున్న వర్షంతో ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు భయాందోళనగా మారాయి. ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈ వర్షం ప్రభావంతో ఓ ఇల్లు ఆ కుటుంబమంతా మృత్యువాత పడింది. అయితే ఆ కుటుంబంలోని ఇద్దరు బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న తల్లి అఫ్సానా, ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడు దుర్మరణం చెందారు. ఇంటి పైకప్పు వారిపై పడడంతో శిథిలాల కింద వారు శవాలుగా తేలారు. సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్న పోలీసులు వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లోని తండ్రి, మరో కుమారుడు బయటకు వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బయటపడ్డ పురాతన నాణేలు
దహెగాం (సిర్పూర్) : ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా పురాతన నాణేల కుండలు బయటపడ్డాయి. కుమురం భీం జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన జునగరి గంగ మ్మ ఇంటిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు వెల్ములే సురేశ్, రమేశ్ కొనుగోలు చేశారు. ఇల్లును కూల్చి కొత్తగా నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో పాత ఇంటిని కూల్చివేస్తుండగా గోడలో ఉన్న పురాతన నాణేల కుండలు పగిలి బయటపడ్డాయి. రాగి, వెండి, ఇత్తడివి కలిపి మొత్తం 1365 నాణేలు లభ్యమయ్యాయి. వీటిపై 1862, 1885, 1899, 1907 సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. ఈ నాణేలపై బ్రిటిష్ చక్రవర్తి విక్టోరియా మహారాణి, చార్మినార్, హెడ్వట్ సెవెన్ పేర్లు ఉన్నాయి. నాణేలను పెంచికల్పేట్ తహసీల్దార్ రియాజ్ అలీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. ఇంకేమైనా నాణేలు లభించాయా? అనే అనుమానంతో పోలీసులు.. సురేశ్, రమేశ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. -
వర్షానికి కూలిన ఇళ్లు
పెద్దేముల్: వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దేముల్ మండల జైరాం తండాలో రూప్సింగ్నాయక్, కిషన్నాయక్కు చెందిన రెండు ఇళ్లతోపాటు పెద్దేముల్ గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల రెవెన్యూ కార్యదర్శులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వర్షాలకు కులిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారంతో పాటు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి మహేందర్రెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చుస్తానని ఓంలానాయక్తండా ఎంపీటీసీ సభ్యుడు గెమ్యానాయక్ తెలిపారు.