house full 3
-
ఇన్సూరెన్స్ కోసం స్టార్ హీరో ఆందోళన
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆందోళన చెందుతున్నాడు. స్టంట్స్ చేసే హీరోలు, ఇతర స్టంట్ మాస్టర్స్ కు ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. స్టంట్స్ చేసే హీరోలలో అక్షయ్ పేరు కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా అక్షయ్ బాటలోనే నడుస్తున్నాడు. స్టంట్స్ చేసే వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా చిన్న విషయమేనని చెప్పాడు. అంతకు మించి వారి కోసం ఏదైనా ఉండాలని, అదే బీమా పాలసీ అని అంటున్నాడు. సాజిత్ ఫర్హాద్ దర్శకత్వం వహించిన 'హౌస్ ఫుల్ 3' ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నాడు అక్షయ్. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, లిసా హేడాన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ లో పద్ధతి మారాలని సూచించాడు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేతత్వాన్ని తాను ఇష్టపడతానని చెప్పాడు. కామెడీ చేయడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నాడు. రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న 'డిష్యుం' సినిమాలో ఆయన గే పాత్రలో కనిపించనున్నాడు. అబుదాబీలో జరుగుతున్న షూటింగ్ లో వరుణ్ దవన్, జాన్ అబ్రహం తో కలిసి నటించనున్నాడని సమాచారం. వరుణ్ దవన్, జాన్ అబ్రహంతో కలిసి అబుదాబీలో షూటింగ్ లో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. మార్షల్ ఆర్ట్ ఫైట్స్, తనదైన శైలి స్టంట్స్ తో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ మాస్ హీరో గే పాత్రలో ఎంత మేరకు రాణిస్తాడోనని బాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
'యాక్షన్ కాదు.. కామెడీ చేయాలని ఉంది'
ముంబయి: హృతిక్ రోషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది డ్యాన్స్‌లు.. అదిరిపోయే స్టెప్పులు.. ఆ తర్వాత యాక్షన్, రోమాన్స్. కానీ, ఆయనలో ఇప్పటి వరక కామెడీ యాంగిల్ చూడనే లేదు. అయితే త్వరలోనే తన అభిమానులకు ఆ కోరిక తీరబోతుండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు యాక్షన్, రోమాన్స్ చిత్రాలతో మాత్రమే తన అభిమానులను కనువిందుచేసి భారీ హిట్లు కొట్టిన ఈ ప్రముఖ బాలీవుడ్ హీరో కుదిరితే కామెడీ చిత్రం చేస్తానంటున్నాడు. ఇటీవల విడుదలైన హౌజ్ ఫుల్ 3 చిత్ర ట్రైలర్ చూసి ఉబ్బి తబ్బిబ్బు అయిన ఆయన తనకు ఈ చిత్ర ట్రైలర్ ఎంతో నచ్చిందని, ట్రైలర్ అదుర్స్ అని పొగిడాడు. అందులోని కామెడీ అదిరిపోయిందని, ట్రైలర్ పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని, ఆ సినిమా రాగానే చూస్తానని, ఎప్పుడెప్పుడు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్, నర్గీస్ ఫక్రీ, అభిషేక్ బచ్చన్ల కామెడీని చూస్తానా అని ఎదురుచూస్తున్నాని చెప్పాడు. వారు చేసే కామెడీ నుంచి స్ఫూర్తిపొంది తన అభిమానులకోసం ఓ కామెడీ సినిమా చేయాలని భావిస్తున్నాని చెప్పాడు. జూన్ 3న హౌజ్ ఫుల్ 3 చిత్రం విడుదలకానుంది.