HR policy
-
Harsh Goenka: కార్పోరేట్ సెక్టార్లో హెచ్ఆర్ పాత్ర ఏంటంటే?
ఓ స్థాయికి చేరుకున్న ఈ సంస్థలో అయినా యాజమాన్యం, ఉద్యోగులకు వారధిగా పని చేసేది హ్యుమన్ రిసోర్స్ (హెచ్ఆర్) డిపార్ట్మెంట్. ఎంతో శ్రమించి పని చేసే ఈ డిపార్ట్‌మెంట్‌పై సోషల్ మీడియాలో నిత్యం జోకులు, మీమ్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా హెచ్ఆర్ పని తీరు ఎలా ఉంటుంది. కార్పోరేట్ వరల్డ్‌లో వారి పాత్ర ఎలా ఉంటోందో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్‌గోయెంకా సరదాగా ట్విటర్లో స్వామి హర్షానంద అవతారంలో వివరించారు. స్వామి హర్షానంద అభిప్రాయం ప్రకారం కార్పోరేట్ ప్రపంచంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేక రకలైన పాత్రలను పోషిస్తుంది. ఇందులో ముఖ్యమైన వాటిలో అనధికారిక లాయర్, సైకియాట్రిస్ట్, ఈవెంట్ ఆర్గనైజర్, టీచర్, సమస్యల పరిష్కార కర్త, కెరీర్ ప్లానర్, డిటెక్టివ్ వంటివి ఉన్నాయి. ఇన్ని పాత్రలు సమర్థంగా పోషించే అతను ఉద్యోగులకు జీతాలిచ్చేప్పుడు పినాసిగా మారిపోతాదంటూ చమత్కరించారు హర్ష్ గోయెంకా. హర్ష్‌గోయెంకా ట్వీట్‌కు నెటిజన్లు కూడా సరదాగా రిప్లై ఇస్తున్నారు. కొందరు చాలా మంది స్వామి హర్షానంద అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు మాత్రం.. ఉద్యోగులు తమనే టార్గెట్ చేస్తారని, కానీ జీతం పెంచడం తమ చేతిలో ఉండదని అది హెచ్‌వోడీల ఇష్టమని చెబుతున్నారు. ఎన్నో పనులు సమర్థంగా పని చేస్తున్నా.. నిందలు తమపైనే పడతాయంటున్నారు. I asked Swami Harshanand “Swami, please explain to me the role of HR in the corporate context?” He thought for a while and answered “HR is the unofficial lawyer, psychiatrist, event organizer, teacher, conflict solver, career planner, detective and distributor of peanuts.” — Harsh Goenka (@hvgoenka) May 10, 2022 చదవండి: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్ మహీంద్రా -
‘బోనస్‌లు తిరిగి ఇచ్చేయండి’.. ఉద్యోగులకు కంపెనీ షాక్!
దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీని ఏడాది మధ్యలో వీడుతున్న ఉద్యోగులను.. బోనస్ కింద చెల్లించిందంతా తిరిగి ఇచ్చేయమంటూ వేధిస్తోందన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు ప్రకటన ఇచ్చుకుంటున్నప్పటికీ.. అది ఉద్యోగులకు పూర్తి ఊరట ఇచ్చేదిగా లేదని తెలుస్తోంది!. తాజాగా భారత ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెసీఎల్పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజైన్లు చేసి కంపెనీని వీడుతున్న ఉద్యోగులను ‘పర్ఫార్మెన్స్ బోనస్’ ఇచ్చిందంతా.. తిరిగి చెల్లించాకే బయటకు వెళ్లాలని కోరుతోంది. ఈ మేరకు హెచ్ఆర్ పాలసీలోని రూల్‌ను చూపించడంతో ఉద్యోగులు ఖంగుతింటున్నారు. ఈ విషయంపై ఐటీ ఎంప్లాయిస్ యూనియన్లను ఉద్యోగులు ఆశ్రయించినట్లు సమాచారం. లేబర్ మినిస్టర్ భూపేందర్ యాదవ్‌కి, హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌కి సైతం లేఖలు రాశారు పుణే ఐటీ యూనియన్ ప్రతినిధి హర్మీత్ సలూజ. డబ్బులు తిరిగి చెల్లించని ఉద్యోగుల ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇవ్వకుండా కంపెనీ వేధిస్తోందని సలూజ ఆ లేఖలో ప్రస్తావించారు. హెచ్‌సీఎల్ ప్రకటన అయితే హెచ్‌సీఎల్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతోంది. ఉద్యోగులకు తెలియకుండా తామేం చేయట్లేదని పేర్కొంది. మంత్లీ బేసిస్ మీద చెల్లించే అడ్వాన్స్ విషయంలో హెచ్ఆర్ పాలసీ ప్రకారం.. అదీ ఉద్యోగులు సంతకాలు చేసిన కాలమ్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేసింది. నవంబర్ 2021న ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం.. సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2022 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి.. ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ (EFB) రికవరీ చేస్తామని తెలిపింది. ఇక వివాదాస్పదం కావడంతో ఆఘమేఘాల మీద ఆ పాలసీని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. వెనక్కి తగ్గలేదు! వివాదాస్పద ఈ పాలసీ విషయంలో హెచ్‌సీఎల్ ఒక స్పష్టమైన ప్రకటనంటూ ఇవ్వకపోవడం గమనార్హం. దశాబ్దానికి పైగా జూనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు జీతం కాకుండా.. అడ్వాన్స్‌గా చెల్లింపులు అందుకుంటున్నారు. అలాగే ఇకపై కంపెనీ మా ఉద్యోగుల కోసం ముందస్తు వేరియబుల్ చెల్లింపును కొనసాగిస్తుంది. అంతేకాదు డిసెంబర్ 22, 2021 నుంచి రికవరీలను కూడా మాఫీ చేసిందని హెచ్‌సీఎల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఇక్కడే గందరగోళం నెలకొంది. ఈఎఫ్‌బీ రికవరీ పాలసీని మాత్రమే హెచ్‌సీఎల్ వెనక్కి తీసుకుందని.. ఏపీఎంబీ (Advance Monthly Performance Bonus) విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సలూజ చెప్తున్నారు. ఈఎఫ్‌బీ అనేది ఉద్యోగులందరికీ వర్తించే బోనస్ కాగా.. ఏఎంపీబీ మాత్రం ప్రత్యేకించి ప్రాజెక్టుల కోసం పని చేసే ఉద్యోగులందరికీ జారీ చేస్తున్న బోనస్. సో.. రిజైన్ చేసిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న మాట!. -
వర్క్ ఫ్రం హోం.. ‘బాబోయ్ మాకొద్దు’
సాక్షి, వెబ్‌డెస్క్: కోల్‌కతా బేస్డ్ ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వర్క్‌ఫ్రం బెటరా ? లేక ఆఫీస్ నుంచి పని బెటరా అని అర్థం వచ్చేలా గ్రాఫ్లతో కూడిన ఫోటోలను షేర్ చేశారు. బిజినెస్ టైకూన్ సంధించిన ఈ ప్రశ్నకు ఉద్యోగులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు. ఏది బెటర్ కోవిడ్ తీవ్రత తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా ఊపందుకోవడంతో అనేక కంపెనీలు తిరిగి ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలంటూ ఉద్యోగులకు సూచించగా మరికొన్ని కంపెనీలు వర్క్‌ఫ్రం హోం గడువు పెంచాయి. ఎక్కువ శాతం కంపెనీలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసుకునేలా హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. మొత్తంగా ఐటీ, మీడియా, బిజినెస్ సెక్టార్లో వర్క్‌ఫ్రం హోం అనే అంశంపై చర్చ బాగా జరుగుతోంది. అమ్మో ! వర్క్‌ఫ్రం హోం ఆనంద్ మహీంద్రా తరహాలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష్ గోయెంకా వర్క్‌ఫ్రం హోం, ఆఫీస్ వర్క్‌పై ట్వీట్ వదిలారు. ఇందులో ఆఫీస్ వర్క్ అయితే ట్రాఫిక్‌లో ఎంత సేపు ఉంటాం, కో వర్కర్లతో ముచ్చట్లు, లంచ్‌టైం, టీ టైంలో ఎంత సేపు ఉంటమనే విషయాలు గ్రాఫ్‌లో చెప్పారు. ఈ పనులన్నీ పోను ఆఫీసులో పని చేసేది చాలా తక్కువ సమయం అన్నట్టుగా ఫోటో పెట్టారు. అదే వర్క్‌ఫ్రం హోం అయితే వర్క్ తప్ప మరేం ఉండదంటూ చమత్కరించారు. మరికొందరు వర్క్‌ఫ్రం హోంలో వర్క్ మాత్రమే ఉంటున్నా అది కేవలం ఆఫీస్ పని ఒక్కటే కాదని, ఇంటి పనులు, సినిమాలు చూడటం వంటి పనులు కూడా ఉంటున్నాయన్నారు. వర్క్‌ఫ్రం హోంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. It has become reality now. Employees requesting to HR for office opening so that they can work for 8 hours instead of 24 hours. pic.twitter.com/Dm8pYXywie — Talkative $ (@Talkativedollar) August 16, 2021 ఆఫీసే బెటర్ హార్స్ గోయెంకా ఈ ట్వీట్ చేయడం ఆలస్యం నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇప్పటికే ఆఫీసులు ఓపెన్ చేయాలంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను కోరుతున్నా మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. వర్క్‌ఫ్రం హోంలో వర్క్‌లోడ్ ఎక్కువైపోయిందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అయ్యాయి. మరికొందరు ఆఫీస్‌లో పని ముగిస్తే పర్సనల్ లైఫ్ ఉంటుందని, కానీ వర్క్‌ఫ్రం హోంలో 24 గంటలు ఆఫీస్ పనే అవుతోందంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద వర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీస్ పనే బాగుందంటూ దానికి తగ్గట్టుగా ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు. pic.twitter.com/TcUG3LT9I2 — prashant (@chanchvayu) August 16, 2021 -
ఎస్వీబీసీ చానెల్‌కు హెచ్ఆర్ పాలసీ: టీటీడీ
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు తొలిసారి హెచ్ఆర్ పాలసీని ఆమోదిస్తూ ఎస్వీబీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ఎస్వీబీసీ బోర్డు సమావేశం జరిగింది. భక్తులకు మరింత మెరుగ్గా ప్రసారాలు అందించేందుకు హెచ్డి ఛానల్ ప్రారంభానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఎస్వీబీసీ రేడియో ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలని, వీటిలో భక్తితోపాటు సంగీతం, సాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. ఇంకా వెలుగులోకి రాని తాళ్లపాక అన్నమయ్య అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సాహిత్యం, శ్రీ పురందరదాసుల కీర్తనలను పరిష్కరించి ఎస్వీబీసీ ద్వారా భక్తులకు చేరువ చేయాలని టీటీడీ ఈఓ సూచించారు. ఎస్వీబీసీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసి ధర్మప్రచార కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎస్వీబీసీ ప్రారంభం నుంచి హెచ్ఆర్ పాలసీ లేనందువల్ల ఆ విషయంపై బోర్డు సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదించింది. -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ..!
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహిళల సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్న ఇందిరాకాంత్రి పథం ఉద్యోగులకు ఏళ్లు గడిచినా వెట్టిచాకిరీ మాత్రం తప్పడం లేదు. కనీస వేతన చట్టం వీరికి అమలు చేయకపోవడంతో చాలీచాలని జీతంతో కుటుంబాల్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పథకం రూపురేఖలు మారినా... 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వెలుగు పథకం రూపురేఖలు మారిపోయాయి. వెలుగు పథకం కాస్త ఇందిరాక్రాంతి పథంగా మారిపోయింది. పథకంలో గతంలో పనిచేసిన ఎగువ స్థాయి సిబ్బంది అయిన డీపీఎం, ఏపీఎం, మండల సమన్వయ కర్తలకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేశారు. కానీ దిగువ స్థాయి సిబ్బంది అయిన కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలు నేటికి హెచ్ఆర్ పాలసీకి నోచుకోలేదు. మండల సమాఖ్య ఆధీనంలో పనిచేస్తున్న వీరికి అరకొర జీతభత్యాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నందున రేపోమాపో ఉద్యోగ భద్రత కల్పిస్తారేమో అని ఆశతో ఉద్యోగులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారు. పని భారం గ్రామ స్థాయిలో మహిళల వారం మీటింగుల సమాచారాన్ని సేకరించి ఒక్కో స్వయం సహాయక సంఘాల లెక్కల వివరాలు, సభ్యుల వివరాలు, ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు కంప్యూటర్లో పొందు పరుస్తూ అధికారులు కోరిన విధంగా వారికి రిపోర్టులు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ కార్యక్రమాల విధులు నిర్వహిస్తున్నారు. దీపం పథకం, స్త్రీనిధి, అమృతహస్తం, పావలా వడ్డీ, అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర ప్రభుత్వ ముఖ్య పథకాలను పేదల దరికి చేర్చడానికి వీరు నిరంతర కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లాలో మొత్తం 647 మంది తాత్కాలిక ఉద్యోగులు మండల సమాఖ్యల పరిధిలో వారి సేవలందిస్తున్నారు. వీరిలో 567 మంది కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు వివిధ రకాల పని చేస్తుండగా వీరికి రూ.1200 నుంచి 2వేల వరకు జీతం అందిస్తున్నారు. కాగా మండల సమాఖ్య అకౌంటెంట్లు 18 మందికి రూ.3,500, 21 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. అటెండర్లు 18 మందికి రూ.2,500 చెల్లిస్తున్నారు. 12 మంది బ్యాంకు మిత్ర, నలుగురు బీమా మిత్రలకు బ్యాంకు లింకేజీ, క్లెయిముల ఆధారంగా వేతనం చెల్లిస్తున్నారు. క్లస్టరు యాక్టివిస్టులుగా, జాబ్ రిసోర్స్‌పర్సన్‌గా, డిజెబిలిటీ వర్కర్లుగా, మాస్టర్ బుక్ కీపర్లుగా ఏడుగురు పనిచేస్తుండగా వీరికి కొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. వారికిచ్చే ఆ కొంత కూడా నెలకు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.