Huj House
-
నిన్న హజ్ బిల్డింగ్.. నేడు పోలీస్ స్టేషన్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి సర్కార్ రాష్ట్రాన్ని కాషాయమయం చేస్తోంది. యూపీ లో యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకూ బుక్లెట్స్, స్కూల్ బ్యాగ్‌లు, టవళ్లు, కుర్చీలు, బస్సులకే పరిమితమైన కాషాయీ కరణ పోలీసు స్టేషన్లకు, హజ్ కార్యాలయాలకు చేరింది. తాజాగా లక్నోలో సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ పోలీసు స్టేషన్‌కు ఉన్న భవనం రంగును యోగి ప్రభుత్వం మార్చివేసింది. సాధారణంగా పోలీసు స్టేషన్లకు పసుపు, ఎరుపు రంగులు ఉంటాయి. కానీ, యోగి ప్రభుత్వం లేత కాషాయరంగును లక్నో పోలీసు స్టేషన్‌కు వేయించింది. గత ఏడాది సీఎం కార్యాలయం లాల్ బహుదూర్ శాస్త్రి భవన్‌కు, నిన్న లక్నోలోని హజ్ కార్యాలయం సరిహద్దు గోడకు యోగి ప్రభుత్వం కాషాయ రంగు వేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముస్లిం సంఘాలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి. -
హజ్ కార్యాలయానికీ కాషాయ రంగు
లక్నో: ఉత్తరప్రదేశ్ హజ్ కార్యాలయం ప్రహరీ గోడలు రాత్రికి రాత్రే కాషాయ రంగు సంతరించుకున్నాయి. సెక్రటేరియట్ భవనానికి కాషాయ రంగు వేయించిన కొద్ది రోజులకే సీఎం యోగి దృష్టి హజ్ కార్యాలయంపై పడింది. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మొహసిన్ రజాను వివరణ కోరగా.. హజ్ కార్యాలయం ముందు ఉన్న ప్రహరీ గోడలపై మాత్రమే కొత్త రంగు వేశారన్నారు. భవనం వెలుపల, లోపల ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. అయినా, దీనిని సమస్యగా చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. కాషాయం జాతి వ్యతిరేక రంగు కాదు కదా అని అన్నారు. కాంతికి, శక్తికి సంకేతం కాషాయం అని వివరణ ఇచ్చారు. -
హజ్‌హౌస్ వద్ద విద్యుత్ ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి హ జ్హౌస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని కండ్వా జిల్లాకు చెందిన రూపేందర్(22) కౌశిల్(21) రింకేష్(22), సుశీల్యాదవ్(22)లు మృతి చెందగా, నగీన్, మునీష్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మునీష్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఉస్మానియాలో చికిత్సలు అందిస్తున్నారు. వీరంతా జూబ్ల్లీబస్స్టేషన్ వద్ద జమ్నా సర్కస్ లో పని చేసేందుకు నెల రోజుల కిందట వచ్చి, తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బయలు దేరారు. హజ్‌హౌస్ వద్దకు చేరుకోగానే భారీ వర్షం కురియడంతో రక్షణ కోసం పక్కనే ఉన్న బస్టాప్‌లో నిలబడ్డారు. భారీ వర్షానికి బస్టాప్ ముందు వరదనీరు వచ్చిచేరింది. ఇదే సమయంలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్న కరెంటు వైరు ఊడిపోయి హజ్‌యాత్ర కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లపై పడింది. దీంతో బస్టాప్‌లోని ఇనుప పైపులకు విద్యుత్ సరఫరా జరిగి వాటికి ఆనుకుని నిల్చున్న వారికి విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెడ్విన్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అందులో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని ఉస్మానియాకు తరలించగా, వారిలో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మేయర్ మాజిద్‌హుస్సేన్, డీజీపీ అనురాగ్‌శర్మ సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశాలు జారీ చేశారు.