హజ్‌ కార్యాలయానికీ కాషాయ రంగు | Lucknow's Haj House painted saffron by Uttar Pradesh's BJP government | Sakshi
Sakshi News home page

హజ్‌ కార్యాలయానికీ కాషాయ రంగు

Published Sat, Jan 6 2018 3:31 AM | Last Updated on Sat, Jan 6 2018 3:31 AM

Lucknow's Haj House painted saffron by Uttar Pradesh's BJP government - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ హజ్‌ కార్యాలయం ప్రహరీ గోడలు రాత్రికి రాత్రే కాషాయ రంగు సంతరించుకున్నాయి. సెక్రటేరియట్‌ భవనానికి కాషాయ రంగు వేయించిన కొద్ది రోజులకే సీఎం యోగి దృష్టి హజ్‌ కార్యాలయంపై పడింది. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మొహసిన్‌ రజాను వివరణ కోరగా.. హజ్‌ కార్యాలయం ముందు ఉన్న ప్రహరీ గోడలపై మాత్రమే కొత్త రంగు వేశారన్నారు. భవనం వెలుపల, లోపల ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. అయినా, దీనిని సమస్యగా చేస్తున్నారెందుకని ప్రశ్నించారు. కాషాయం జాతి వ్యతిరేక రంగు కాదు కదా అని అన్నారు. కాంతికి, శక్తికి సంకేతం కాషాయం అని వివరణ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement