సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో కాషాయ రంగు వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. ముఖ్యమంత్రి కార్యాలయం సహా పలు ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగును పులిమేశారు. తాజాగా లక్నోలోకి పలు పార్కులకు రోడ్డు డివైడర్లకు అదే కలర్ పెయింట్ వేశారు.
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ కార్యాలయాలపై కాషాయ రంగును అద్దేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు వంద ప్రాథమిక పాఠశాలలు, పోలీస్ స్టేషన్లకు అదే కలర్ పెయింట్ వేశారు.
యోగి ఆదిత్యానథ్‌కు ఇష్టకమైన రంగుపైనే ఇక ప్రభుత్వ పథకాల ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలావుండగా.. యోగి ఆదిత్యనాథ్ పదవీకాలం పూర్తయ్యేనాటికి రాష్ట్రమంతా కాషాయరంగులోకి మారుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment