లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి సర్కార్ రాష్ట్రాన్ని కాషాయమయం చేస్తోంది. యూపీ లో యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకూ బుక్‌లెట్స్, స్కూల్ బ్యాగ్‌లు, టవళ్లు, కుర్చీలు, బస్సులకే పరిమితమైన కాషాయీ కరణ పోలీసు స్టేషన్లకు, హజ్ కార్యాలయాలకు చేరింది.
తాజాగా లక్నోలో సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ పోలీసు స్టేషన్‌కు ఉన్న భవనం రంగును యోగి ప్రభుత్వం మార్చివేసింది. సాధారణంగా పోలీసు స్టేషన్లకు పసుపు, ఎరుపు రంగులు ఉంటాయి. కానీ, యోగి ప్రభుత్వం లేత కాషాయరంగును లక్నో పోలీసు స్టేషన్‌కు వేయించింది. గత ఏడాది సీఎం కార్యాలయం లాల్ బహుదూర్ శాస్త్రి భవన్‌కు, నిన్న లక్నోలోని హజ్ కార్యాలయం సరిహద్దు గోడకు యోగి ప్రభుత్వం కాషాయ రంగు వేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముస్లిం సంఘాలు తీవ్రంగా విరుచుకు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment