సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ
సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు గానీ.. బాలీవుడ్ భామలు సౌత్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. టెక్నికల్ గానే కాక కలెక్షన్ల పరంగా కూడా సౌత్ సినిమాలు బాలీవుడ్‌తో పోటి పడుతున్నాయి. దీంతో బాలీవుడ్ బ్యూటీస్ మన సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ముఖ్యంగా టాప్ స్టార్స్ సినిమాల్లో బాలీవుడ్ తారలు నటిస్తే బిజినెస్‌కు కూడా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో మన మేకర్స్ నార్త్ భామల కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు కూడా బాలీవుడ్ భామనే హీరోయిన్గా ఫైనల్ చేశారు. కబాలి తరువాత పా రంజిత్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్న రజనీ ముందుగా విద్యాబాలన్‌ను తీసుకోవాలని భావించాడు. కానీ ఫైనల్‌గా హాట్ బ్యూటీ హుమా ఖురేషిని ఫైనల్ చేశారు. ధనుష్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.