ఆ పోలీసులపై హత్య కేసు పెట్టాలి
మానవహక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి వి.ఎస్. కృష్ణ డిమాండ్
పాడేరు: ఆంధ్ర– ఒడిశా సరిహద్దులోని రామగుడ అటవీ ప్రాంతంలో గత నెల 24 నుంచి జరిగిన ఎన్కౌంటర్లపై సీబీఐ విచారణ జరిపిం చాలని మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వి.ఎస్. కృష్ణ డిమాండ్ చేశారు. మానవహక్కుల వేదిక బృంద సభ్యులు ఎన్కౌంటర్ జరిగిన ప్రాం తాన్ని శుక్రవారం సందర్శించారు. శనివారం
విశాఖ జిల్లా పాడేరులో కృష్ణ విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా పోలీసులు వారిపై ఏకపక్షంగా కాల్పులు జరిపారని, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. ఆత్మరక్షణ కోసమే తాము మావోయిస్టులపై కాల్పులు జరిపారని పోలీసులు కట్టుకథ చెబుతున్నారన్నారు. మావోయిస్టులు, గిరిజనులను హతమార్చిన పోలీసులపై చిత్రకొండ పోలీస్ స్టేషన్లో హత్యానేరం కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. సాధారణ పౌరులకులానే పోలీసులకు కూడా చట్టాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆండ్రపల్లి, పనసపుట్టు, డుడుంబ పంచాయతీలకు చెందిన 13 మంది గిరిజనులు కనిపించకుండా పోయారని తెలి పారు. వీరు కూడా చనిపోయి ఉండచ్చని ఆయా గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై సీబీ ఐ విచారణ లేదా ప్రత్యేక అధికారులతో దర్యా ప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నా రు. ఈ సమావేశంలో మావనహక్కుల వేదిక సభ్యులు కె.సుధ, వై.రాజేష్ పాల్గొన్నారు.