హునాన్ ప్రావిన్స్‌కు నిమ్జ్‌లో భూ కేటాయింపులు!
సాక్షి, హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన కంపెనీకి మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూములు కేటాయించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆసక్తి కనబరుస్తోంది. ముంబైలో మేక్ ఇన్ ఇండియాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్‌ను శనివారం హునాన్ ప్రావిన్స్‌కు చెందిన 12 మంది ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో హునాన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, అందుకు 2,500 నుంచి 3 వేల ఎకరాలు కావాల్సిందిగా ప్రతినిధి బృందం విన్నవించింది. దీనికి స్పందించిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెదక్ జిల్లాలోని నిమ్జ్‌లో భూకేటాయింపులు చేస్తామన్నారు.