వరకట్నం హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ముంబై: అదనపు కట్నం అడిగినంత తీసుకులేదని తన భార్యను చంపి బావిలో పడవేసిన కేసులో భర్తతోపాటు అతడి కుటుంబసభ్యులు మరో ముగ్గురికి బాంబే హైకోర్టు జీవితఖైదు విధించింది. కొత్తాపూర్ జిల్లా గంగానగర్ లోని హుపరీ వద్ద 2001లో లక్ష్మి అనే మహిళను అనిల్ వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె ప్రసవం సమయంలో ఖర్చులకుగాను రూ.25 వేలు, బంగారం నగలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. ఆమె పుట్టింటి నుంచి అడిగిన మేర తీసుకురాకపోవడంతో వేధించడం మొదలుపెట్టారు.
కాగా, 2006 అక్టోబర్ 14న ప్రమాదవశాత్తు బావిలో పడి లక్ష్మి మృతిచెందిందని ఆమె తల్లికి అనిల్ ఫోన్ చేసి చెప్పాడు. కాగా పోస్ట్మార్టం నివేదికలో ఆమెను కర్రతో మోది చంపినట్లు వెల్లడైంది. లక్ష్మి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. హైకోర్టులో పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తులు పి.డి.కోడె, విజయ తహిల్మ్రణి తమ తీర్పును వెల్లడిస్తూ నిందితులపై ఆరోపణలు రుజువైనందున మృతుడి భర్త అనిల్తోపాటు అతడి సోదరి, తల్లిదండ్రులను దోషులుగా పేర్కొంటూ వారికి యావజ్జీవ కారాగారశిక్షను ఖరారుచేశారు.