Husband and wife burned alive
-
హత్యాయత్నం కేసులో ఐదుగురికి పదేళ్ల జైలు
విజయవాడ లీగల్: భార్యాభర్తలను హత్య చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా దాఖలైన కేసులో ఐదుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.ప్రతిభాదేవి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన జూలూరి రమాదేవితో జూలూరి హనుమంతరావుకు రెండో వివాహం జరిగింది. ఈ వివాహం హనుమంతరావు మొదటి భార్య పిల్లలకు ఇష్టం లేదు. ఆస్తి వ్యవహారాల్లో వారికి తండ్రి హనుమంతరావుతో విభేదాలున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన హనుమంతరావు కుమార్తె కొడుకు గూడూరు సత్యనారాయణ అలియాస్ మణికంఠ హనుమంతరావు వద్ద ఉండేవాడు. రమాదేవితో రెండో వివాహం తర్వాత సత్యనారాయణతో పాటు తమ పిల్లలను కూడా హనుమంతరావు దూరం పెట్టాడు. దీంతో మొదటి భార్య కుమారులయిన జూలూరి సుబ్బారావు, మాధవరావు తమ మేనల్లుడు సత్యనారాయణతో కలసి హనుమంతరావు, రమాదేవి హత్యకు కుట్ర పన్నారు. సత్యనారాయణ తమ స్వగ్రామమైన దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన తన స్నేహితులు తెనాలికి చెందిన గూడూరు వినయ్‌కుమార్, వీణను 2014 అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం ముందుగా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చాడు. పథకంలో భాగంగా గూడూరు వినయ్‌కుమార్, వీణ కలసి రమాదేవి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు. అనంతరం తాము తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిలో నుంచి పెట్రోల్ బాటిల్‌ను తీసి రమాదేవి, హనుమంతరావుపై పోసి నిప్పంటించి పారిపోయారు. కాలిన గాయాలతో దంపతులిద్దరూ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులైన సుబ్బారావు, మాధవరావు, సత్యనారాయణ, వినయ్ కుమార్, వీణపై 307, 326, 452, 436, 120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సీఎంఎస్ పోలీసులు 24 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ జి.దైవప్రసాద్ విచారించారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
తొలుత గొంతు కోసి హత్య చేసి.. ఆ తరువాత..
సాక్షి, నెక్కొండ(వరంగల్): వృద్ధ తల్లిదండ్రులపై మమకారాన్ని మరచిన కన్న కొడుకు, మనువడు కలిసి కిరాతకంగా గొంతు కోసి కడతేర్చిన ఘటనలో నిందితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాలో వృద్ధ దంపతులు భూక్యా దస్రూ – బాజిని స్వయాన కుమారుడు, మనవడు కలిసి బుధవారం రాత్రి సజీవ దహనం చేసిన విషయం విదితమే. అయితే, సజీవ దహనం కాదని.. తొలుత గొంతు కోసి హత్య చేశాక.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారని తేలింది. ముందుగా నిందితులు కేతురాం, వెంకన్నలు బుధవారం సాయంత్రం భూక్యా దస్రూ – బాజి ఇంటికి వెళ్లి వెళ్లగానే దస్రూపై దాడికి పాల్పడి గొంతు కోశాడు. ఆ తరువాత తల్లి బాజిపై దాడికి పాల్పడుతుండగా ప్రాధేయపడినా గొంతు కోసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎవరికి అనుమానం కలగకుండా ఉండేందుకు ఇంట్లో, శవాలను మం చంపై ఉంచి పెట్రోలు పోసి, నిప్పు అంటించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిందితుల కు గాయాలయ్యాయని వారు చెప్పారు. వృద్ధ దంపతులు వారి పనులు వారే చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవారని.. అలాంటిది సజీవ దహనం చేస్తే కనుక కేకలు వినిపించేవని తండా వాసులు చెబుతున్నారు. హత్య చేశాక మంచంపై వేసి పెట్రోలు వేసి నిప్పు అంటివచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది..! నెక్కొండ మండలం మడిపల్లి పరిధిలోని భూక్యా తండాకు చెందిన దస్రూకు ఇద్దరు కుమారులు కేతురాం, వీరన్నతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. దస్రూకు ఉన్న భూమిలో పెద్దకొడుకు కేతురాంకు 3–30 ఎకరాలు, చిన్నకొడుకు వీరన్నకు 4 ఎకరాలు బీడు భూమి పంచి ఇచ్చాడు. అయితే కానిస్టేబుల్ అయిన వీరన్న భార్య ఝాన్సీతో ఏర్పడిన గొడవలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే తన నాలుగు ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు. దీంతో ఏడేళ్ల క్రితం దస్రూ మూడో కుమార్తె భద్రమ్మ ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. వీరన్న రెండో వివాహం చేసుకున్న కొన్నేళ్లకు అనారోగ్యంతో మృతి చెందాడు. తన తమ్ముడికి అర ఎకరం భూమి ఎక్కువ ఇచ్చావని. సోదరి అయిన భద్రమ్మ కొనుగోలు చేసిన భూమి విషయంలో అప్పటి నుంచి కేతురాం గొడవ చేస్తున్నాడు. భూమి సాగు చేసినేందుకు వచ్చిన క్రమంలో కేతురాం కుటుంబ సభ్యులు దాడి చేశారని భద్రమ్మ పేర్కొన్నారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు వేశామని తెలిపింది. తరచూ గొడవలు జరుగుతుండడంతో ఈనెల 30న బుధవారం నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్.. దస్రూ, బాజి, కుమార్తె భద్రమ్మ కుటుంబ సభ్యులు, కేతురాం కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులను పిలిచి విచారణ చేశారు. భద్రమ్మ దగ్గర నాలుగు ఎకరాల భూమికి రిజిస్ట్రేషన్ ఉందని, ఆమెకే సాగు హక్కు ఉందని స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారమైందని భావించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత తండాకు వెళ్తే గొడవలు జరుగుతాయని పోలీసులు చెప్పడంతో భద్రమ్మ తాము నివాసముంటున్న ఖమ్మం వెళ్లిపోయింది. ఇంతలోనే సాయంత్రం తన తల్లిదండ్రులను కేతరాం, వెంకన్న పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు చేతబడి చేయించారని అనుమానం కేతురాం చిన్నకుమారుడు బాలకృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మూఢనమ్మకాలను నమ్మిన కేతురాం తన తల్లిదండ్రులే చేతబడి చేయించారని అనుమానం పెంచుకున్నాడు. అటు భూమి విషయం కొడుకు అనారోగ్యం విషయంలో తనకు అన్యాయం జరిగిందని కేతురాం కక్ష కట్టి కన్న తల్లిదండ్రులనే కడ తేర్చారని తండాలో చర్చించుకుంటున్నారు. తండ్రి వద్ద ఉన్న భూమిలో వాటా ఇవ్వాలని కొంత కాలంగా కేతురాం ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దస్రూ తన వాటాగా ఉంచుకున్న 2–5 ఎకరాల భూమిలో చిన్న కోడలుకు అర ఎకరం ఇవ్వగా అమ్ముకుంది. అలాగే, కేతురాంకు అర ఎకరం ఇచ్చి, మరో అర ఎకరం దస్రూ అమ్మకున్నాడు. మిగిలిన ఎకరం భూమితో పాటు దస్రూ నివసిస్తున్న ఇంటిని ఇప్పుడే తన పేర చేయాలని కేతురాం కొంతకాలంగా పట్టుబడుతున్నాడు. తన తదనంతరం మాత్రమే ఇస్తానని దస్రూ చెప్పడంతో కేతురాం కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. కాగా, నిందితులను కఠనంగా శిక్షించాలని దస్రు కుమార్తెలు కమలమ్మ, భద్రమ్మ, యాకమ్మ కుటుంబ సభ్యులు విలపిస్తూ కోరారు. భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ పెద్దన్నకుమార్, ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
అంతు చూసిన అనుమానాల కార్చిచ్చు!
భార్యభర్తలు సజీవదహనం అనుమానాలే ఆత్మహత్యకు పురిగొలిపాయా? అనాథలైన ఇద్దరు కుమార్తెలు ప్రేమించుకోడానికి రెండు మనసులు చాలు. పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కావాలి... అని రాశాడొక సినీ రచయిత. పెద్దలు చేసిన పెళ్లిని కాదనుకుంది. కూతురితో సహా ప్రియుడి చెంతకు చేరింది. అతనితో మరో కూతురికి జన్మనిచ్చింది. ఏడేళ్లు బాగానే గడిచింది. బుధవారం అర్ధరాత్రి ఆ ఇంట్లో లేచిన మంటల్లో ఇద్దరి జీవితాలకు తెర పడింది. ఏమైంది... ఏం జరిగింది... అనుమానమే ఇద్దరి అన్యోన్యతను చీల్చిందా... అందమైన కుటుంబంలో విభేదాల కార్చిచ్చుకు మరే కారణమైనా ఉందా... కారణాలేవైనా రెండు నిండు జీవితాలు బూడిదయ్యాయి. ఏ పాపం తెలియని ఇద్దరు చిట్టితల్లులు అనాథలయ్యారు. మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో బుధవారం అర్థరాత్రి ముత్యాలు శ్రీను, పంపాన సత్యవతి దంపతుల సజీవ దహనం అత్యంత విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నం: సాలిపేట ప్రాంతానికి చెందిన ముత్యాలు శ్రీను, పంపాన సత్యవతి క్లాస్మేట్లు. పదో తరగతి నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కానీ పంపాన సత్యవతికి ఆమె తల్లితండ్రులు మల్కాపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఒక గౌతమి అనే కుమార్తె జన్మించింది. కానీ సత్యవతి మొదటి భర్త నుంచి విడిపోయి ఏడేళ్ల క్రితమే శ్రీను దగ్గరకు వచ్చేసింది. చేసేదిలేక అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమ వ్యవహారానికి అడ్డు చెప్పలేదు. ఆ తరువాత శ్రీను, సత్యవతికి హరిణి అనే కుమార్తె జన్మించింది. దీంతో సత్యవతి తల్లిదండ్రులు మొదటి అమ్మాయి గౌతమిని తమ వద్దే పెంచుకుంటున్నారు. ఇలా ఏడేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వేరే వ్యక్తి స్కూటర్‌పై వెళ్లడంతో కలతలు నగరంలోని నివసిస్తున్న శ్రీను ప్రముఖ వస్త్ర దుకాణంలో, సత్యవతి సిరిపురంలోని ఓ బ్యూటీ ప్లార్లర్లో పనిచేస్తున్నారు. రోజూ భార్యను సిరిపురంలో దించి తన విధులకు వెళ్లడం శ్రీనుకు అలవాటు. నెలరోజుల క్రితం సత్యవతి వేరే వ్యక్తి స్కూటర్‌పై వెళ్లడాన్ని శ్రీను చూశాడని... అప్పటినుంచి ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయని సమీప బంధువులు చెబుతున్నారు. దీంతో దంపతులు వారం రోజుల క్రితమే మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీ బ్లాకు నంబర్ 155లో ఎఫ్ఎఫ్ 5 ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పెద్ద కూతురి పుట్టిన రోజు చేసి... అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న పెద్ద కూతురు గౌతమి పదో సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరిగాయి. వేడుకల కోసం చిన్న కూతురు హరిణితో కలసి సత్యవతి తల్లి ఇంటికి వెళ్లింది. వేడుకలకు హాజరుకాని శ్రీను రాత్రి భార్యను తీసుకొచ్చేందుకు మాత్రం అక్కడికి వెళ్లాడు. చిన్న కూతురు హరిణిని అక్కడే వదిలేసి భార్యభర్తలు మారికవలసలోని ఇంటికి వచ్చేశారు. అర్థరాత్రి అఘాయిత్యం: రాత్రి ఒంటిగంట ప్రాంతంలో శ్రీను ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. సమీపంలో నివసిస్తున్న శంకర్, పార్వతీశం, త్రినాథ్ అనే యువకులు బయటికొచ్చి చూసేసరికి ఇల్లు కాలిపోతోంది. వెంటనే వారు శ్రీను ఇంటికి వెళ్లి చూస్తే లోపల గడియ పెట్టి ఉంది. బలవంతంగా తలుపులను నెట్టేసరికి మంటలు దట్టంగా వ్యాపించడం... ముందుగదిలో గ్యాస్ సిలిండర్ ఉండటంతో భయపడి కిందకు వచ్చి 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పింది. అప్పటికే శ్రీను, సత్యవతి శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పీఎంపాలెం ఎస్ఐ ఎం. మహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల బంధుమిత్రులకు నమాచారం అందించారు. శ్రీను, సత్యవతి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. అమ్మ కావాలి: సంఘటన స్థలం వద్ద చిన్న కూతురు హరిణి తల్లి సత్యవతి కోసం విలపిం చిన తీరు కంటతడి పెట్టించింది. అమ్మను చూ పించండని విలపిస్తున్న ఆ చిన్నారిని ఓదార్చ డం ఎవరి తరం కాలేదు. శ్రీను, సత్యవతి మరణించడం వెనుక గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ మహేష్ చెప్పారు.