Husband and wife to commit suicide
-
లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య
మైసూరు: లాక్‌డౌన్‌తో వ్యాపారం లేక పాన్ బ్రోకర్ ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది మండి మోహల్లా పరిధిలోని అక్బర్ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ (37) లాక్డౌన్ కారణంగా వ్యాపారం లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి: తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురయిన ఆ భార్యాభర్తలు మనస్తాపం చెందారు. ప్రేమ పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందని కానిస్టేబుల్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకుంది. కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె ఉన్నారు. అయితే వారం కిందట వారి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహ చేసుకోవడంతో తమ పరువు పోయిందని నారాయణతో పాటు ఆయన భార్య రాజేశ్వరి కూడా భావిస్తున్నారు. అదే బాధతో మంగళవారం ఆ దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. -
అయ్యో.. చికెన్ గొడవ ఎంతపని చేసింది!
డిస్పూర్: ఇంట్లో భర్త మాంసాహరం వండించడంతో గొడవపడ్డ అనంతరం కొత్తజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్యభర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇసానగర్ పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ‘లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్(22), రేష్మా(19)ను జూన్ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్ కావడంతో తన భర్త సోమవారం చికెన్ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. (ఆన్లైన్ చదువు: స్మార్ట్ ఫోన్ లేదని.. ) దీంతో రేష్మా అతడిని నిలదీయడంతో ఇద్దరూ గొడవడ్డారు. అనంతరం రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్ తండ్రి శివనాథ్ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. ప్రస్తుతం గురుదయాళ్ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇసానగర్ పోలీస్టేషన్ హౌజ్ ఆఫీసర్ సునిల్ సింగ్ మాట్లాడుతూ... రేష్మాకు, గురుదయాళ్‌కు ఇటీవల వివాహం జరిగిందని చెప్పారు. సోమవారం రాత్రి ఇంట్లో నాన్‌వెజ్ వండొద్దని గొడవ పడిన అనంతరం భార్యభర్తలిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా భార్య రేష్మా మృతిచెందగా.. భర్త గురుదయాళ్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి స్టేట్మెంట్ తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. -
ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య
కాళేశ్వరం/మహదేవపూర్: కార్తీకమాసం ఏకాదశి ఉదయం 5 గంటల తర్వాత మంచి ముహూర్తం. అప్పుడు చనిపోతే ఆత్మలైనా సంతోషంగా ఉంటాయి. తమ జీవిత చరమాంకంలో సరిగ్గా చూసుకోని కుమారుడు, కోడలికి ఇబ్బందులు రావొద్దనే భావనతో ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తాము చనిపోయాక అంత్యక్రియల నిమిత్తం ఎవరికీ అవస్థ కలగొద్దని రూ.10 వేల నగదును భర్త తన నడుముకు కట్టుకోగా.. ఇద్దరూ కొత్త బట్టలు ధరించి పురుగుల మందు తాగారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని ఎలికేశ్వరంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులకు కుమారుడు సత్యం, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న పొలాన్ని కుమారుడికి ఇచ్చి.. వారు కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. తరచూ సాలయ్య దంపతులను కుమారుడు, కోడలు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇరుగుపొరుగు వచ్చే సరికి రాధమ్మ మృతి చెందగా, సాలయ్య కొనఊపిరితో ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒకరిపైన ఆధారపడి బతకొద్దనే తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
భార్యాభర్తల ఆత్మహత్య
యర్రగుంటపల్లి (చింతలపూడి) : క్షణికావేశం.. అన్యోన్యంగా ఉంటున్న భార్యాభర్తలను బలిగొంది. రెక్కలుముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కూలి పనులతో చెమటోడ్చి సంపాదిస్తున్న డబ్బును భర్త వ్యసనాలకు ఖర్చు చేస్తుండటాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. తనతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా తన మాట వినకపోవడంతో కలత చెందింది. ఇదే విషయమై మరోసారి గొడవ జరిగి భర్త డబ్బు తీసుకుని ఊరు వెళ్లిపోవడంతో మరింత వేదనకు గురైంది. దీంతో ఉరివేసుకుని తనువు చాలించింది. విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన భర్త విగతజీవురాలై ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. దీంతో తానూ బలవన్మరణానికి ఒడిగట్టాడు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన వీరవెంకటలక్ష్మి (25)కి కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన కుప్పాల మంగారావు (30)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా వీరు యర్రగుంటపల్లి వచ్చి నివాసం ఉంటున్నారు. కేబుల్ కోసం గోతులు, కాలువ తవ్వకాలకు కూలి పనులకు భార్యభర్తలు వెళుతుంటారు. వీరికి ఏడేళ్ల వయస్సున్న కుమారుడు మురళి, ఐదేళ్ల కుమార్తె అంజలి ఉన్నారు.ఇదిలా ఉండగా భర్త మంగారావు వ్యసనాలకు బానిసై డబ్బు దుబారా చేస్తున్నాడని భార్య పలుమార్లు అతనిని వారించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వీరిద్దరి మధ్య ఇదే విషయంపై మరోసారి గొడవపడ్డారు. దీంతో భర్త మంగారావు ఇంట్లో రూ.ఐదువేలు తీసుకుని తన తల్లిదండ్రులు ఉంటున్న మర్లపాలెం వెళ్లాడు. ఈ డబ్బును కూడా వ్యసనాల కోసమే తీసుకువెళ్లాడని మనస్తాపంతో శుక్రవారం తెల్లవారుఝామున భార్య వీరవెంకటలక్ష్మి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు చూసి భర్తకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న భర్త.. భార్య మృతదేహం చూసి చలించిపోయాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకున్నాడు. అక్కడే ఉన్న బంధువులు ఇది గ్రహించేలోగానే మంగారావు మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీఆర్వో ఇచ్చిన సమాచారంతో ఎస్సై వీఎస్ వీరభద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన చిన్నారులు తల్లిదండ్రులు మృతి చెందడంతో మురళి, అంజలి అనాథలయ్యారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వారిని దిక్కులేనివారిగా మార్చింది. ఇక తమ ఆలనాపాలనా ఎవరు చూస్తారన్న దిగులు ఆ చిన్నారుల్లో కనిపించింది. అమ్మానాన్న మృతదేహాలను చూసి తల్లడిల్లుతున్న ఆ పసి హృదయాలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. విగత జీవులై పడి ఉన్న తల్లిదండ్రుల వద్ద చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. భార్యభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.