husband commits suicide
-
భార్య మాట్లాడకుండా మౌనం.. భర్త బలవన్మరణం
అనంతపురం: భార్య మాట్లాడకుండా మౌనం వహించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి గ్రామానికి చెందిన వంశరాజుల రామన్న కుమార్తె లక్ష్మికి ఉరవకొండకు చెందిన మారన్న పెద్ద కుమారుడు మల్లికార్జున (26)తో 2020లో వివాహమైంది. వీరికి 8 నెలల వయసున్న కుమార్తె ఉంది. ఎలక్ట్రికల్ పనులతో పాటు వెహికల్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడడంతో మానేయాలని భార్య కోరింది. సరేనంటూ అంగీకరించిన మల్లికార్జున అప్పుడప్పుడు మద్యం తాగి ఇంటికి చేరుకునేవాడు. ఈ నెల 13న భర్తతో కలసి యాడికిలోని పుట్టింటికి లక్ష్మి వచ్చింది. మూడు రోజుల పాటు ఎంతో సరదాగా గడిపారు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున మద్యం సేవించి ఇంటికి చేరుకోవడంతో పుట్టింటి వారి ముందు తన పరువు పోయిందంటూ లక్ష్మి బాధపడింది. తన భర్త గురించి ఎంతో మంచిగా తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, ఈ రోజు తాగి వచ్చి పరువు తీశావంటూ మదనపడుతూ తనతో మాట్లాడవద్దంటూ మౌనం దాల్చింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లికార్జున అదే రోజు రాత్రి 10 గంటలకు తండ్రి మారన్నకు ఫోన్ చేసి లక్ష్మి తనతో మాట్లాడడం లేదని, ఇక తాను బతికి ఉండడం వృథాగా భావించి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. వెంటనే కోడలికి మారన్న ఫోన్ చేసి విషయం తెలపడంతో రామన్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. చివరకు ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ కట్టడంలో లుంగీతో వేసుకున్న ఉరికి వేలాడుతున్న మల్లికార్జునను గమనించి, స్థానికుల సాయంతో కిందకు దించారు. కొన ఊపిరితో ఉండడం గమనించి వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు నిర్ధారించారు. కోడలు ద్వారా సమాచారం అందుకున్న మారన్న కుటుంబసభ్యులు యాడికికి వచ్చి మల్లికార్జున మృతదేహంపై పడి బోరున విలపించారు. మృతుడి తండ్రి మారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు. -
భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య.. కారణం ఇదే..
సంతబొమ్మాళి(శ్రీకాకుళం జిల్లా): అరవై ఏళ్ల జీవితం.. ముప్పై ఏళ్ల దాంపత్యం.. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసి పంపిన అనుభవం.. మద్యం సీసా ముందు ఇవన్నీ బలాదూర్ అయిపోయాయి. మందు మత్తులో తన భార్యను హత్య చేసిన ఓ వృద్ధుడు.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మండలంలోని నౌపడ పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జగన్నాథపురం గ్రామానికి చెందిన దాసరి సింహాద్రి (60), ఉమ (50)లకు 30 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ధర్మారావు ఉన్నా రు. కుమార్తెలకు వివాహమై అత్తారింటికి వెళ్లిపోగా, కుమారుడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులిద్దరూ ఊరిలోనే కూలి పనులు చేసుకుంటూ బతుకున్నారు. సింహాద్రికి తాగుడు అలవాటు ఉంది. దీని వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ తగువులు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సింహాద్రి భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత భార్య ఉమ నిద్రపోయారు. అయితే మద్యం మత్తులో ఉన్న సింహాద్రి కూరగాయలు కోసే కత్తితో ఉమ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మత్తు దిగడంతో భయపడి పక్కనే వంటపాకలో ఉన్న దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు కుళాయి నీరు వచ్చినా ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో వీధిలో మహిళలు ఉమను పిలిచేందుకు వెళ్లారు. ఇంటిలోపల చూస్తే సింహాద్రి ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన మహిళలు స్థానికులకు, సర్పంచ్ భర్త పి. రవికుమార్ రెడ్డికి తెలియజేయటంతో ఆయన పో లీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. ఈ సమాచారంతో టెక్కలి సీఐ చంద్రమౌళి, నౌపడ ఎస్ఐ మహమ్మద్ అలీ, తహసీల్దార్ చలమయ్యలు సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. గొంతు కోసిన కత్తిని, పరిసరాలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా!.. సినిమా స్టైల్లో.. -
భార్య ఛాటింగ్ చేయొద్దన్నందుకు భర్త ఆత్మహత్య
మారేడుపల్లి : తరచుగా ఫోన్లో ఛాటింగ్ చేస్తున్న భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన మేరకు.. సంజీవయ్యనగర్‌కు చెందిన శివకుమార్ అలియాస్ చిన్నా (27) ఎలక్ట్రీషియన్. ఇతనికి గత నెల ఆగస్టు 15న లహరి అనే యువతితో వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. శివకుమార్ తరచుగా ఫోన్లో ఛాటింగ్ చేస్తుండడంతో భార్య మందలించింది. మూడు రోజులుగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం శివకుమార్ మరోరూమ్లోకి వెళ్లి తలుపులు బిగించుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంతకూ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో తలుపులను పగులగొట్టి చూడగా శివకుమార్ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే శివకుమార్ మరణించడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై బోరున విలపించారు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
భార్య కాపురానికి రావట్లేదని..
అశ్వరావుపేట(కొత్తగూడెం): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి నాగరాజు(23)కు ఏడాది క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఎన్ని రోజులైన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురైన నాగరాజు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.