కట్టుకున్న భర్తే రక్తం పంచిన తాతని తెలిసి..
ఒక దురదృష్టవంతుడున్నాడు. చిన్నాచితకా పనులుచేసుకుని జీవించే అతను పాతికేళ్లకే పెళ్లిచేసుకున్నాడు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఆ చిరాకును భార్యపై ప్రదర్శించేవాడు. కొన్నేళ్లు బాధలు భరించిన ఆమె పిల్లల్ని తీసుకుని అతని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెకోసం చాలా ఎళ్లు వెతికివెతికి చివరికి దొరకదని డిసైడై.. రెండో పెళ్లిచేసుకున్నాడు. గంపెడుమంది పిల్లల్ని కని కొన్నేళ్లు హ్యాపీగానే ఉన్నాడు. గొడవల కారణంగా రెండో భార్యా అతణ్ని వదిలేసింది. తర్వాత రెండేళ్లకు అతనికి లాటరీలో జాక్ పాట్ తగిలింది. మిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడింది. దీంతో 67 ఏళ్ల ముదిమిలో మళ్లీ పెళ్లిచేసుకోవాలనే కోరిక కలిగింది.
ఓ డేటింగ్ సైట్ ద్వారా 24 ఏళ్ల యువతి పరిచయం అయిందతనికి. 'అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల'నే సామెతలు అమెరికాలో లేవు కాబట్టి కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లికి సిద్ధపడ్డారు. పైగా అప్పటికే చెడు తిరుగుళ్ల కారణంగా ఇంటివాళ్లు గెంటేయడంతో రోడ్డునపడ్డ ఆ యువతి ముసలాయనతో పెళ్లికి ఓకే చెప్పింది. పెళ్లైన నాలుగు నెలల తర్వాత భర్త కుటుంబాలకు సంబంధించిన ఫోటోలు చూసిన ఆమెకు ఒక్కసారి షాక్ తగిలింది. అతని మొదటి భార్య పిల్లల్లో ఒకరు తన తండ్రి అని గుర్తించింది. నిజానిజాల్ని నిర్థారణ చేసుకున్న తర్వాత ఆమెకు అర్థమయిందేమంటే.. 'కట్టుకున్న భర్తే రక్తం పంచిన తాతయ్య'అని!
అయితే.. ఈ చేదు నిజం తెలుకున్న తర్వాత కూడా ఆ ఇద్దరూ కలిసే ఉండాలని నిర్ణయించుకోవడం గమనార్హం! ఆసియా దేశాలతో పోల్చుకుంటే పశ్చిమదేశాల్లో వివాహ బంధాలు విచిత్రంగా ఉంటాయని అందరికీ తెలుసుగానీ ఈ ఫ్లోరిడా జంటది మాత్రం అంతకంటే విచిత్రం. అన్నట్లు తాము తెల్సుకున్న నిజాన్ని మనసులోనే దాచుకోకుండా మీడియాకు సైతం చెప్పేసిందా జంట! ఫ్లోరిడా సన్ పోస్ట్ అనే వార్తా సంస్థ ఈ విచిత్ర బంధాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఓఎంజీ!