ఉప సర్పంచ్‌కు అత్తింటి వేధింపులు
శ్రీకాకుళం: మహిళా ఉపసర్పంచ్‌కు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తుంగపేటలో చోటు చేసుకుంది. గ్రామ ఉపసర్పంచ్ భర్త పేరు సుధీర్. ఆయన టీడీపీ నేత. ప్రభుత్వ విప్ కూన రవికి సన్నిహితుడు. దాంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.