Hussaini Alam police station
-
పాతబస్తీలో కాల్పుల కలకలం
హైదరాబాద్: పాతబస్తీలోని హస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ స్థల విషయమై సాదేశ్, షేక్ ఉమర్ అనే ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. మాటామాటా పెరిగి ఇద్దరూ ఒకరినొకరు తోసేసుకున్నారు. ఇందులో సాదేఖ్ అనే వ్యక్తి తన వద్ద నున్న పిస్టల్‌తో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సాదేఖ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నున్న పాయింట్ 32 పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చార్మినార్‌లో సందర్శకుడి అదృశ్యం
బహదూర్‌పురా : చార్మినార్‌ను చూసేందుకు వచ్చిన ఓ సందర్శకుడు అదృశ్యమైన ఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం...గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అరబ్ మహ్మద్ హుస్సేనీ కాలాపత్తర్‌లో నివాసం ఉండే సోదరుడి ఇంటికి తండ్రి హుస్సేనీ మహ్మద్ (51)తో కలిసి ఈనెల 6న వచ్చాడు. 7న కుమారుడితో కలిసి హుస్సేనీ మహ్మద్ చార్మినార్ సందర్శనకు వెళ్లాడు. చార్మినార్ సందర్శన పూర్తయ్యాక 2.30 గంటలకు సమీపంలోని పాన్‌షాప్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుమారుడు చార్మినార్ చుట్టు పక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తన తండ్రి హుస్సేనీ మహ్మద్ కనిపించడంలేదంటూ కుమారుడు గురువారం హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
-
అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
హైదరాబాద్: పరారీలో ఉన్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీఆలం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వంశీపై దాడి చేసిన ఉదంతంలో అరవింద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఆదివారం రాత్రి కానిస్టేబుల్‌పై అరవింద్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై హోలీ ఆడుతూ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో అతడిపై విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడంపై సెక్షన్ 332, భయబ్రాంతులకు గురిచేయడంపై సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా, కానిస్టేబుల్ వంశీపై ఎంపీ కుమారుడు దాడికి పాల్పడడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. వంశీని వారు సోమవారం పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.