అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్ | anjan kumar yadav son arvind yadav held | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 18 2014 4:59 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

పరారీలో ఉన్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్‌ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీఆలం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వంశీపై దాడి చేసిన ఉదంతంలో అరవింద్‌ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఆదివారం రాత్రి కానిస్టేబుల్‌పై అరవింద్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్లో నడిరోడ్డుపై హోలీ ఆడుతూ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో అతడిపై విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడంపై సెక్షన్ 332, భయబ్రాంతులకు గురిచేయడంపై సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా, కానిస్టేబుల్ వంశీపై ఎంపీ కుమారుడు దాడికి పాల్పడడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. వంశీని వారు సోమవారం పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement