Anjankumar Yadav
-
హైదరాబాద్ అభివృద్ధిని.. ఏ శక్తులూ అడ్డుకోలేవు
కవాడిగూడ (హైదరాబాద్): మురికి కూపంగా మారిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పి0చాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజల జీవన ప్రమా ణాలను మెరుగుపరుస్తామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని ఏ శక్తులూ అడ్డుకోలేవని.. నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో యాదవులు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించే సదర్ ఉత్సవాలు ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ ఉత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, స్పీకర్ ప్రసాద్‌కుమార్, నేతలు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా దున్నపోతుల విన్యాసాలు, యాదవుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జంట నగరాలలోని యాదవులు దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి బ్యాండ్‌మేళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వేల మంది యాదవులు కూడా హాజరయ్యారు. యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానంహైదరాబాద్ మహానగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్ కొనియాడారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని.. యాదవులు రాజకీయంగా ఎదగాలనే అనిల్‌కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపామని చెప్పారు. రాబోయే రోజుల్లో యాదవ సామాజిక వర్గానికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గం ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇక నుంచి ఏటా సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. శ్రీకృష్ణుడు యాదవులను ఆశీర్వదించినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు చేసే విధంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో పూర్వకాలం నుంచీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉందని, అందుకు తోడ్పడే పశువులను యాదవులు ప్రాణసమానంగా పూజించడం గొప్ప సంస్కృతి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,, కాంగ్రెస్ సీనియర్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, కృష్ణాయాదవ్, ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పబ్‌లు బంద్ చేయండి
సాక్షి ,హైదరాబాద్: విదేశీ సంస్కృతి, డ్రగ్స్‌లను అలవాటు చేస్తున్న పబ్‌లను తక్షణమే మూసేయాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పబ్‌లు, క్లబ్‌లు సగానికి పైగా కేసీఆర్, కేటీఆర్ సంబంధీకులవేనని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. డ్రగ్స్ సరఫరా కేంద్రాలుగా పబ్‌లు మారాయన్నారు. టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లోనే పబ్, క్లబ్‌ల నిర్వహణ ఇష్టానుసారంగా కొనసాగుతోందని ఆరోపించారు. పబ్‌లను మూసివేయకుంటే ఉద్యమం చేపడుతామన్నారు. నాలుగేళ్ల పాలనలో భూ ఆక్రమణ దందా, సారా, పేకాట బంద్ చేశామని ఓవైపు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు అవి యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. పేదలు ఉపశమనం కోసం మద్యం సేవిస్తే నోట్లో పైపులు పెట్టి జరిమానాలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అదే పబ్‌లకు వెళ్లే వారి జోలికి మాత్రం వెళ్లట్లేదని దుయ్యబట్టారు. పదేళ్లు ఎంపీగా పనిచేసినా తనకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో కనీసం ఐదు సెంట్ల భూమి లేదని, అదే టీఆర్ఎస్ నేతలకు నాలుగున్నరేళ్లలో కోట్లు విలువ చేసే స్థలాలు, భవన సముదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పేద ప్రజలు ఉండే గోషామహల్, నాంపల్లిలో ట్రాఫిక్ వారు డ్రంకెన్ డ్రైవ్ పేరిట టెస్టులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అవే పరీక్షలను జూబ్లీహిల్స్ ,బంజారాహిల్స్‌లో ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనన్నారు. -
దానం ఓ బచ్చా; ఆయనతో ఏమీ కాదు..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి దానం నాగేందర్‌పై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘దానం ఓ బచ్చాగాడు. అతను చెప్పడం వల్లనే నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారనడం హస్యాస్పదం’ అని అంజన్‌కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాగేందర్ కాంగ్రెస్‌ను వీడడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. అయినా, ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్ పార్టీని వీడడం ఒకందుకు మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని చెప్పుకు తిరుగుతున్న దానంకు సిగ్గుండాలని అన్నారు. హైదరాబాద్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కబ్జాదారున్ని ఎందుకు చేర్చుకున్నారు..? ‘దానం నాగేందర్ భూ కబ్జాదారుడని హోం మంత్రి గతంలో అన్నారు. అలాంటి కబ్జాదారున్ని పార్టీలో ఎందుకు చేర్చుకున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్పై మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని చెప్పుకుంటున్న దానం.. టీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధికి కేటాయించిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పొన్నం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు దాసోహం.. దానం ఒక బీసీ అయివుండి అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్ విమర్శించారు. బీసీ సమస్యలపై ఏనాడూ పోరాడని దానం తనకు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
పాత.. కొత్త కలబోత
ఇదీ కాంగ్రెస్ జాబితా.. లోక్‌సభ అభ్యర్థుల ఖరారు మల్కాజిగిరి, సికింద్రాబాద్ సీట్లు సిట్టింగ్‌లకే.. హైదరాబాద్‌కు కృష్ణారెడ్డి చేవెళ్లలో కార్తీక్‌రెడ్డి.. జైపాల్ మహబూబ్‌నగర్‌కు.. ‘అసెంబ్లీ’ వీడని ఉత్కంఠ సాక్షి, సిటీబ్యూరో: కొన్ని కొత్త ముఖాలు.. ఇంకొన్ని పాత ముఖాలు.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు సిట్టింగ్‌లైన సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌ల పేర్లే ఖరారయ్యాయి. చేవెళ్లలో సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డికి అవకాశమివ్వగా, అక్కడి సిట్టింగ్ ఎంపీ జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ టికెట్‌ను కేటాయించింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సామ కృష్ణారెడ్డిని పోటీకి దించింది. అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనను చివరి నిమిషంలో రద్దు చేయడంతో పార్టీ వర్గాలను నిరాశ పరిచింది. మల్కాజిగిరి ‘సర్వే’దే.. మంత్రి సర్వే సత్యనారాయణ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. జనరల్ స్థానమైన మల్కాజిగిర లోక్‌సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు ఆయన పలుకుబడి ముందు నిలవలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికే ఖ రారైంది. తొలుత ఇక్కడి నుంచి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది. చేవెళ్లకు కార్తీక్.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలనే అభిలాషను కార్తీక్‌రెడ్డి నెరవేర్చుకున్నారు. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్ కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జైపాల్ తప్పుకున్నప్పటికీ, అక్కడి నుంచి బరిలోకి దిగడానికి మర్రి శశిధర్‌రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీటును కార్తీక్రెడ్డికే కేటాయించారు. మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిపేరు : సర్వే సత్యనారాయణ పుట్టిన తేదీ : 4 ఏప్రిల్, 1954 విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ భార్యా : సునీత పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రాజకీయ నేపథ్యం : 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగి ఎస్ఎఐల్ ట్రేడ్ యూనియన్ నాయకునిగా పని చేశారు. 1985-89 మధ్య కాలంలో సిద్ధిపేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. 2004, 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ అభ్యర్థి పేరు : సామ కృష్ణారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పుట్టినతేదీ : 01-17-1963 విద్యార్హత :బీకాం నివాసం :నగరి అపార్ట్మెంట్, వినయ్‌నగర్ కాలనీ, ఐఎస్ సదన్ భార్య పేరు : విజయలక్ష్మి పిల్లలు :రేష్మిరెడ్డి, రోహిణిరెడ్డి, భానుప్రతాప్ రాజకీయ నేపథ్యం : 1984లో ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 2003లో రంగారెడ్డిజిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక. 2010లో నగర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా ఎన్నికై ఇంకా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థిపేరు : ఎం.అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ నివాసం : గొల్లకిడికి, పురానాపూల్ (పాతబస్తీ) విద్యార్హత : బీఏ భార్య : నాగమణి, పిల్లలు : ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు రాజకీయ నేపథ్యం : 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో తొలిసారిగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ప్రత్యర్థి దత్తాత్రేయపై విజయం సాధించారు. 2009 మరోసారి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మూడోసారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. -
అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
-
అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడి అరెస్ట్
హైదరాబాద్: పరారీలో ఉన్న ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్సేనీఆలం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వంశీపై దాడి చేసిన ఉదంతంలో అరవింద్ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. ఆదివారం రాత్రి కానిస్టేబుల్‌పై అరవింద్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై హోలీ ఆడుతూ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో అతడిపై విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడంపై సెక్షన్ 332, భయబ్రాంతులకు గురిచేయడంపై సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా, కానిస్టేబుల్ వంశీపై ఎంపీ కుమారుడు దాడికి పాల్పడడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. వంశీని వారు సోమవారం పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. -
సిట్టింగ్‌లకు ఫిటింగ్
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య కలహం ముదిరి పాకాన పడుతోంది. ఎమ్మెల్యేలను మార్చాలంటూ ఎంపీ.. ఎంపీని మార్చాలంటూ ఎమ్మెల్యేలు ఎత్తుకు పై ఎత్తులు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభల పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్‌లు అధిష్టానం వద్ద పావులు కదుపుతుండగా.. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. అక్కడి ఎంపీ జైపాల్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభా స్థానం నుంచి తిరిగి పోటీ చేసే అంశం సందిగ్ధంగా ఉండటంతో.. ఆయా శాసనసభా నియోజకవర్గాల పరిధిలో అయోమయ పరిస్థితి నెలకొంది. మల్కాజిగిరిలో పోటాపోటీ జాబితా మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని శాసనసభా స్థానాలకు ఎంపీ సర్వే సత్యనారాయణ తనదైన జాబితాను సిద్ధం చేశారు. అన్ని స్థానాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల పేర్లను ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్దగోని రాంమోహన్‌గౌడ్, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డికి ప్రత్యర్థి వర్గంగా ముద్రపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో ఎమ్మెల్యే రాజేందర్‌ను వ్యతిరేకించే జీహెచ్ఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీధర్, కంటోన్మెంట్లో ఎమ్మెల్యే శంకర్రావు అంటే పడని బోర్డు వైస్ చైర్మన్ జయప్రకాష్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్, కొలను హన్మంతరెడ్డిలలో ఒకరి పేర్లను సర్వే ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రతిపాదిస్తున్నారు. దీంతో తమ నియోకజవర్గాల్లో గ్రూపులకు కారణమైన ఎంపీ సర్వేను ఈ సారి తప్పక మార్చాల్సిందేనంటూ ఎమ్మెల్యేలు ఇటీవల ఏఐసీసీ ప్రముఖులను కలిసి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. సర్వే స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరికిచ్చినా పరవాలేదని పేర్కొంటున్నట్లు సమాచారం. పావులు కదుపుతున్న అంజన్ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో తనదైన ముద్ర ఉండాలంటూ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ సిటింగ్‌లను ఎవరినీ కదిపే పరిస్థితి లేకపోవటంతో.. కనీసం పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు లేని అంబర్‌పేట, ముషీరాబాద్, నాంపల్లి స్థానాల్లో రెండు చోట్ల తాను సూచించే అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ అంజన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో ఎక్కడ అవకాశం ఉన్నా తన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్ పేరును ప్రతిపాదించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. చేవెళ్లలో మొదలైన టికెట్ల హైడ్రామా చేవెళ్ల లోక్‌సభ పరిధిలో నగరానికి చెందిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానం నుంచి జైపాల్‌రెడ్డి తిరిగి పోటీ చేసే అంశం ఇంకా తేలకపోవటంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో పూర్తి అయోమయం నెలకొంది. పార్లమెంటు పరిశీలకులు వచ్చిన సందర్భాల్లో జైపాల్‌రెడ్డి తరపున ఆయన అనుచరులు తిరిగి జైపాల్‌రెడ్డికే అవకాశం కల్పించాలని అర్జీలు ఇచ్చారు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి తప్పుకొంటే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్లమెంటు స్థానానికి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ టికెట్‌పై పూర్తి ధీమాతో ఉన్నా, మరో నాయకుడు నాగేందర్ యాదవ్ టికెట్ కోసం నగరానికి చెందిన మంత్రిని నమ్ముకున్నారు. -
అక్షర రుషికి అంతిమ వీడ్కోలు
సీతాఫల్మండి, న్యూస్‌లైన్: మురికివాడల్లో అక్షర యజ్ఞం చేసి ఎందరో పేద విద్యార్థులను విజేతలుగా మలిచిన రుషి, అమరావతి విద్యాసంస్థల స్థాపకులు వట్టిపల్లి కోటేశ్వరరెడ్డికి విద్యార్థులు, అభిమానులు, నాయకులు నివాళులు అర్పించారు. ఆదివారం అకాల మృతి చెందిన కోటిరెడ్డి సారు మృతదేహాన్ని సోమవారం ఆయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా రామాపురానికి తరలించారు. ఈ సందర్భంగా సాగిన యాత్రలో పలు పార్టీల నాయకులు, ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే పెద్దన్న వెళ్లిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ మాస్టారిని కడసారి చూడాలని వచ్చినవారితో వీధులు జనసంద్రమయ్యాయి. కోటిరెడ్డి మాస్టారి మృతికి సంతాపంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. చిలకలగూడ, సీతాఫల్మండి, తదితర ప్రాంతాల్లోని దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. మాస్టారికి నేతల నివాళి కోటేశ్వర్‌రెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న పలుపార్టీల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు పద్మారావు, వైఎస్సార్సీపీ గ్రేటర్ కన్వీనర్ ఆదం విజయకుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణి, రవిప్రసాద్‌గౌడ్, డీఈఓ సుబ్బారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల జేఏసీ చైర్మన్ కోట్ల నిరంజన్‌రెడ్డి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. -
అంబరాన్నంటిన సదర్ సంబరం
డప్పు చప్పుళ్లు ఓ వైపు.. యువత నృత్యాలు మరోవైపు.. ఎటు చూసినా ఉత్సాహమే..! నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన సదర్ సంబరాలు అంబరాన్నంటాయి. దున్నపోతుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలు వహ్వా అనిపించాయి. ప్రజాప్రతినిధులు ఆనందంతో చిందులేశారు. ఖైరతాబాద్ గ్రంథాలయం చౌరస్తాలో సదర్ సంబరం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి దానం నాగేందర్, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ గ్రంథాలయం చౌరస్తాలో నిర్వహించిన సదర్ వేడుకలను తిలకిస్తున్న జనంఖైరతాబాద్: దున్నపోతును గాల్లోకి లేపుతూ..ఈస్ట్‌మారేడ్‌పల్లి: దున్నపోతుకు అలంకరణ చేస్తూఖైరతాబాద్: నృత్యం చేస్తున్న మంత్రి దానం, ఎంపీ అంజన్ కుమార్కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద సదర్ వేడుకకు హాజరైన జనంకార్వాన్ తాళ్లగడ్డలో నెమలి ఈకలతో అలంకరించిన దున్నపోతుదున్నపోతుతో గ్రేటర్ హైదరాబాద్ యాదవ సేనఅధ్యక్షుడు పింజర్ల శంకర్ యాదవ్అంబర్పేట: దున్నపోతుపై కర్రసాము చేస్తూకార్వాన్లో దున్నపోతుపైకి ఎక్కిన చిన్నారి , దున్నపోతుపైకి ఎక్కి నృత్యం చేస్తూ