డప్పు చప్పుళ్లు ఓ వైపు.. యువత నృత్యాలు మరోవైపు.. ఎటు చూసినా ఉత్సాహమే..! నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన సదర్ సంబరాలు అంబరాన్నంటాయి.
డప్పు చప్పుళ్లు ఓ వైపు.. యువత నృత్యాలు మరోవైపు.. ఎటు చూసినా ఉత్సాహమే..! నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన సదర్ సంబరాలు అంబరాన్నంటాయి. దున్నపోతుల అలంకరణలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలు వహ్వా అనిపించాయి. ప్రజాప్రతినిధులు ఆనందంతో చిందులేశారు. ఖైరతాబాద్ గ్రంథాలయం చౌరస్తాలో సదర్ సంబరం అత్యంత వైభవంగా జరిగింది. మంత్రి దానం నాగేందర్, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ గ్రంథాలయం చౌరస్తాలో నిర్వహించిన సదర్ వేడుకలను తిలకిస్తున్న జనం
ఖైరతాబాద్: దున్నపోతును గాల్లోకి లేపుతూ..
ఈస్ట్‌మారేడ్‌పల్లి: దున్నపోతుకు అలంకరణ చేస్తూ
ఖైరతాబాద్: నృత్యం చేస్తున్న మంత్రి దానం, ఎంపీ అంజన్ కుమార్
కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద సదర్ వేడుకకు హాజరైన జనం
కార్వాన్ తాళ్లగడ్డలో నెమలి ఈకలతో అలంకరించిన దున్నపోతు
దున్నపోతుతో గ్రేటర్ హైదరాబాద్ యాదవ సేనఅధ్యక్షుడు పింజర్ల శంకర్ యాదవ్
అంబర్‌పేట: దున్నపోతుపై కర్రసాము చేస్తూ
కార్వాన్లో దున్నపోతుపైకి ఎక్కిన చిన్నారి , దున్నపోతుపైకి ఎక్కి నృత్యం చేస్తూ