Hutch dog
-
స్ప్రే కొడితే.. మీ వెంటే..
వాషింగ్టన్: ఒకే ఒక్క స్ప్రే మీకు.. మీ పెంపుడు శునకానికి మధ్య బంధాన్ని మరింత పెంపొందిస్తుందట. హచ్ డాగ్ మాదిరిగా మీ వెంట పడేలా చేస్తుందట. టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా పిట్యుటరీ గ్రంధి నుంచి ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ విడుదలవుతుంది. అయితే దీనిని స్ప్రే రూపంలో రూపొందించి వివిధ జాతులకు చెందిన 16 పెంపుడు శునకాలపై పరిశోధనలు జరిపారు. తోటి శునకాలతో పాటు యజమానితో శునకాలు ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలించారు. అయితే ఆక్సిటోసిన్ స్ప్రే విడుదలైన తర్వాత శునకాల ప్రవర్తనలో చాలా మార్పు కనిపించిందట. యజమానిపై అమితమైన ప్రేమ కురిపించడం, ఉత్తేజంగా ఉండటం గుర్తించారు. శునకాల గుండె వేగంలో మార్పులనూ గమనించారు. ఆక్సిటోసిన్ స్ప్రే శునకాల మెదడుపై పనిచేయడమే కాక ఆక్సిటోసిన్ వ్యవస్థను ఉత్తేజపరచినట్టు గుర్తించామని పరి శోధనకు నేతృత్వం వహించిన మిహో నాగసావా వెల్లడించారు. అయితే ఈ స్ప్రేకు శత్రువులను మిత్రులుగా మార్చే సామర్థ్యం లేదని, కానీ స్నేహబంధాన్ని, కుటుంబ సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని చెప్పారు. -
ఒక్క స్ప్రే కొడితే.. శునకం మీ వెంటే!
వాషింగ్టన్: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనేది మనం ఇంతవరకూ విన్నాం. అయితే ఒకే ఒక్క స్ప్రే మీకు.. మీ పెంపుడు శునకానికి మధ్య బంధాన్ని మరింత పెంపొందిస్తోంది. హచ్ డాగ్ మాదిరిగా మనల్ని వాచ్ చేస్తుందట. ఈ అంశానికి సంబంధించి టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా పిట్యూటరీ గ్రంధి నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ లేదా లవ్ హార్మోన్ ల లక్షణాలు కల్గిన స్ప్రే ను రూపొందించి వివిధ జాతులకు చెందిన 16 పెంపుడు కుక్కులపై పరిశోధనలు జరిపారు. తోటి శునకాలతో పాటు యజమానితో శునకాలు ఎలా వ్యవహరిస్తున్నాయనే అంశాన్ని పరిశీలించారు. వాసన చూడటం, నాకడం, మృదువుగా స్పశించడం, యజమాని శరీరంతో ఆడటం, సేదతీరడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఆక్సిటోసిన్ స్ప్రే విడుదలైన తర్వాత శునకాల ప్రవర్తనలో చాలా మార్పు కనిపించిందట. యజమానిపై అమితమైన ప్రేమ కురిపించడం, ఉత్తేజంగా ఉండటం గుర్తించారు. శునకాల గుండె వేగంలో మార్పులనూ గమనించారు. అయితే ఈ స్ప్రే కు శత్రువులను మిత్రులుగా మార్చే గుణం లేదని, ముందు ఉన్న స్నేహ బంధాన్ని మాత్రమే పెంపొందిస్తుందని పరిశోధకులు తెలిపారు. -
హచ్ శునకంలా వెంబడిస్తుంది...
మీరు ఎక్కడికెళ్లినా మిమ్మల్ని హచ్ శునకంలా వెంబడిస్తూ.. వీడియోలు తీసే సరికొత్త ద్రోన్ ఇది. పేరు ఎయిర్డాగ్. మీరు పరుగెత్తినా.. ఆటలాడినా.. ఎత్తై ప్రదేశాలకు వెళ్లినా.. కారులో దూసుకుపోతున్నా సరే.. ఇది పైనుంచి వీడియోలు తీయగలదు. అలలపై సర్ఫింగ్, మంచుపై, రోడ్లపై స్కేటింగ్ వంటివి చేసినా ఇది మిమ్మల్ని వెంబడిస్తూ కెమెరాలో బంధిస్తుంది. జస్ట్ ఎయిర్లీష్ అనే చిన్న కంప్యూటరైజ్డ్ ట్రాకర్ పరికరాన్ని చేతికి ధరిస్తే చాలు.. దాని నుంచి అందే సిగ్నళ్ల ఆధారంగా ఎయిర్డాగ్ ఫాలో అయిపోతుంది. సిగ్నళ్లను బట్టి.. ఎప్పుడు ఎగరాలి? ఎప్పుడు దిగిపోవాలి? అన్నది ఇది స్వతంత్రంగానే చేయగలదు. నిరంతరాయంగా 20 నిమిషాలు పనిచేసే ఈ ద్రోన్... ఎయిర్లీష్ను ధరించినవారిని గంటకు 64 కి.మీ. వేగంతో కూడా వెంబడిస్తుందట. దీనితో కొండంచున నిలబడి ఆకాశం నుంచి కూడా వీడియోలు తీసుకోవచ్చని, సినిమా షూటింగులకు సైతం ఉపయోగించవచ్చని దీనిని తయారు చేసిన అమెరికాలోని హెలికో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారు చెబుతున్నారు. ధర సుమారు రూ.60 వేలు.