వీకెండ్ పాదచారులు
వారంతా వారాంతపు పాదచారులు. నగరంలో నడకపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది గానీ, పాతికేళ్లుగా వారంతా వారాంతాల్లో క్రమం తప్పకుండా కలసి నడుస్తూనే ఉన్నారు. నడకపై మక్కువ ఉన్నవారంతా కలసి ‘హ్యాషర్స్ వాక్’ పేరిట క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే ఈ క్లబ్ రజతోత్సవం జరుపుకోబోతోంది. నగరంలో ఉంటున్న విదేశీయులతో వారాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం, కనీసం ఆరు కిలోమీటర్లు నడక సాగించడం, ఆటపాటలు, విందు వినోదాలతో కాలక్షేపం చేయడం ఈ క్లబ్ ప్రధాన కార్యకలాపాలు.
నడక సాగించే బృందానికి నాయకత్వం వహించే ఇద్దరిని ‘హేర్స్’ అంటారు. వీరు ఆకుపచ్చ చొక్కాలు ధరిస్తారు. ప్రతి ఆదివారం వీరంతా సాయంత్రం వేళల్లో కలుసుకుంటారు. నగరంలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారంతా ఈ సమావేశాలకు హాజరవుతుంటారు. వీరిలో అమెరికా, చైనా సహా పలు దేశాలకు చెందిన నలభై మంది వరకు సభ్యులు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఈ బృందం సందర్శించిన అన్ని ప్రదేశాల వివరాలను ఒక రికార్డు బుక్లో నమోదు చేసుకుంటారు.
సిద్ధాంతి