Hybrid Vehicle
-
టయోటా ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా ఓ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను అభివృద్ధి చేయనుంది. బ్యాటరీతోపాటు 100 శాతం ఇథనాల్‌తో ఇది పరుగెడుతుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం బ్రెజిల్ నుంచి తెప్పించిన టయోటా కరోలా ఆల్టిస్ ఫ్లెక్స్ ఫ్యూయల్–స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ వాహనానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌తోపాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైయిన్ పొందుపరిచారు. ఫ్లెక్స్–ఫ్యూయల్ అనుకూల కార్లు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనం లేదా మిశ్రమంతో కూడా నడుస్తాయి. సాధారణంగా పెట్రోల్‌తోపాటు ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమం ఉపయోగిస్తారు. 20 నుంచి 100 శాతం వరకు ఇథనాల్‌ను వినియోగించవచ్చు. ఇటువంటి వాహనాలు బ్రెజిల్, యూఎస్ఏ, కెనడాలో ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. దేశంలో కాలుష్యం పెద్ద ఆందోళన కలిగిస్తోందని మంత్రి అన్నారు. రవాణా రంగం కాలుష్యానికి దోహదపడుతోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తోపాటు ఇథనాల్, మిథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. భారతదేశం అతి తక్కువ సమయంలో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించిందని టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. 2025 నాటికి ఇది 20 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రతీ ముగ్గురిలో ఒకరి ఓటు వీటికే
న్యూఢిల్లీ: భారత్‌లో రవాణా పరంగా వినియోగ ధోరణులు మారిపోతున్నట్టు డెలాయిట్ గ్లోబల్ ఆటోమోటివ్ కన్జూమర్ స్టడీ 2022 తెలిపింది. మరింత మంది ఎలక్ట్రికల్ (ఈవీ), హైబ్రిడ్ (ఒకటికంటే ఎక్కువ ఇంధనాలతో పనిచేసేవి) వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. తన అధ్యయనంలో భాగంగా వాహనదారుల అభిరుచులు, ఆసక్తులు, ఇష్టాలను ఈ సంస్థ తెలుసుకుని ఒక నివేదిక విడుదల చేసింది. పర్యావరణ అనుకూల వాహనాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► భారత్‌లో 59 శాతం మంది వినియోగదారులు వాతావరణ మార్పులు, కాలుష్యం స్థాయి, డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ► ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, పర్యావరణ పట్ల స్పృహ, వాహనం నడిపే విషయంలో మెరుగైన అనుభవం తదితర అంశాలు ఈవీల పట్ల ఆసక్తికి కారణాలు. ► బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్పిడి), చార్జింగ్ సదుపాయాలపై బడ్జెట్లో దృష్టి సారించడం అన్నది పర్యావరణ అనుకూల వాహన వినియోగాని మద్దతునివ్వడమే. ►69 శాతం మంది ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) వాహనాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ► ఈవీలను సబ్స్క్రిప్షన్ విధానంలో తీసుకునేందుకు 70 శాతం మంది ఆసక్తితో ఉన్నారు. వృద్ధి కొత్త పుంతలు ‘‘కస్టమర్ల అవసరాలు, అద్భుతమైన ఆవిష్కరణలతో భారత ఆటోమోటివ్ పరిశ్రమ కొత్త తరం వృద్ధిని చూడబోతోంది. వినియోగదారులు ప్రత్యామ్నాయ పవర్ ట్రెయిన్ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. ఇది ఈవీ వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజీవ్‌సింగ్ తెలిపారు. -
నేల నీదే... నింగీ నీదే!
-
నేల నీదే... నింగీ నీదే!
మనకు పరుగెత్తే కార్ల గురించి తెలుసు... ఎగిరే డ్రోన్ల గురించి వింటూ ఉంటాం. మరి ఈ రెండూ కలిసిపోతే... అవసరమైనంత వరకూ రోడ్లపై పరుగులు పెట్టి... ఆ తరువాత అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకుంటే? అద్భుతంగా ఉంటుంది కదూ! విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ కూడా ఇదే అంటోంది. అనడమే కాదు... ఇలాంటి హైబ్రిడ్ రవాణా వ్యవస్థలు ఎలా సాధ్యమవుతాయో వివరిస్తోంది కూడా. కావాలంటే పక్క ఫొటోలు చూడండి. ఎయిర్‌బస్ తయారు చేయాలని సంకల్పిస్తున్న సరికొత్త రవాణా వ్యవస్థ తాలూకూ డిజైన్లు ఇవి. దీనికి ఎయిర్‌బస్ పెట్టిన పేరు ‘పాప్ అప్’. ఏంటి దీని ప్రత్యేకత అంటే... చాలా సింపుల్... అవసరమైనప్పుడు ఇది రెండు భాగాలుగా విడిపోగలదు. అడుగున ఉన్న భాగం కారులా పనిచేస్తుంది. పైన ఉన్నది ప్రయాణీకులు కూర్చునే క్యాబిన్‌లా ఉంటుంది. ఈ క్యాబిన్‌కు నాలుగు ప్రొపెల్లర్లు ఉన్న ఇంకోభాగం వచ్చి అనుసంధానమవుతుంది. ఆ తరువాత అది డ్రోన్లా పైకి ఎగిరిపోతుంది. మనల్ని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఎయిర్‌బస్ ‘ప్రాజెక్టు వాహన’ పేరుతో ఎగిరే కారునొకదాన్ని తయారు చేస్తున్నామని గత ఏడాదే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కొత్త డిజైన్ హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించారు. డ్రైవర్లు అవసరం లేని, పూర్తిగా విద్యుత్తుతో మాత్రమే నడిచే ఈ వాహనం పూర్తిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోగల అప్లికేషన్‌తో... ఇప్పుడు మీరు ఊబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా ఆన్ డిమాండ్ బుక్ చేసుకోవచ్చు. ఆ తరువాత మొత్తం ఈ వాహనమే చూసుకుంటుంది. ఎంత దూరం రోడ్డుపై వెళ్లాలి... డ్రోన్ రూపంలో ఎంత దూరం ఎగిరి వెళ్లాలి వంటివన్నమాట. ట్రాఫిక్ జామ్లలో ఇరుక్కోకుండా నగరాల్లో సాఫీగా ప్రయాణించేందుకు ఇదో మేలైన మార్గం అంటోంది ఎయిర్‌బస్... 2030 నాటికల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎయిర్‌బస్ ఆలోచన. చూద్దాం ఏమవుతుందో! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రోడ్లపై పరుగెడుతూ, అవసరమైనపుడు అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకునేలా ఎయిర్‌బస్ కంపెనీ డిజైన్ చేసిన అద్భుత వాహనం ‘పాప్ అప్’